ఐబిడబ్ల్యూ చాయ్ పకోడా రైడ్‌లో పాల్గొన్న 500 బైకర్స్

బైకింగ్ అంటే ఎవరికి మాత్రం ఇష్టం ఉండదు. వందల సంఖ్యలో బైకర్లంతా ఓ చోట చేరితే అక్కడ పండుగ వాతావరణం నెలకొంటుంది. గత ఆదివారం జరిగిన చాయ్ అండ్ పకోడా ముంబై ఎడిషన్‌లో 500 మందికి పైగా బైకర్లు పాల్గొన్నారు. భారతదేశపు అతిపెద్ద మోటార్‌సైకిల్ ఫెస్టివల్ అయిన ఇండియా బైక్ వీక్ (ఐబిడబ్ల్యూ) సోషల్ మీడియా వీక్ సహకారంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది.

ముంబైలోని సబర్బన్ లొకేషన్ నుంచి ప్రారంభమైన ఐబిడబ్ల్యూ చాయ్ అండ్ పకోడా రైడ్, ముంబై నుంచి 150 కిలోమీటర్ల దూరంలో ఎన్‌హెచ్8 వద్ద ఉన్న పార్సీ డా డాబా వరకు సాగింది. తాము నడిపే ఏదైనా సరే రైడర్లు ఈ రైడ్‌లో పాల్గొనవచ్చు. ముంబై ఎడిషన్ చాయ్ అండ్ పకోడా రైడ్‌లో పల్సర్, హ్యార్లీ డేవిడ్‌సన్, ట్రైయంప్ మోటార్‌సైకిళ్లతో పాటు పలు ఇతర సూపర్‌బైక్‌లు కూడా ఉన్నాయి.

ముంబైలోని ఔత్సాహిక బైకర్లంతా తమ పిల్లలు, ఆఫీసు ఉద్యోగులు, స్నేహితులతో ఈ రైడ్‌లో పాల్గొన్నారు. మోటార్‌సైకిళ్లంటే ప్యాషన్ ఉన్న వారినంతా ఓ చోటకు చేర్చడమే ప్రధాన లక్ష్యంగా ఈ రైడ్‌ను నిర్వహించినట్లు 70 ఈఎమ్‌జి సీఈఓ మార్టిన్ డా కోస్టా తెలిపారు. మోటార్‌సైకిళ్లంటే ఇష్టం ఉన్నవారు ఎవ్వరైనా సరే తాము నడిపే బైక్‌తో సంబంధం లేకుండా ఇందులో పాల్గొనవచ్చు.

Over 500 Bikers Meet For IBW Chai And Pakoda Ride
Most Read Articles

English summary
The Mumbai edition of the Chai and Pakoda ride saw over 500 bikers participate on Sunday morning. India Bike Week, India's largest motorcycle festival, organized the gathering, in association with Social Media Week.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X