బంగ్లాదేశ్ మార్కెట్లోకి ప్రవేశించిన హీరో మోటోకార్ప్!

By Ravi

భారతదేశపు అతిపెద్ద ద్విచక్ర వాహన తయారీ కంపెనీ హీరో మోటోకార్ప్ ఉత్పత్తులు, ఇప్పుడు పొరుగు దేశమైన బంగ్లాదేశ్ మార్కెట్లో కూడా లభ్యం కానున్నాయి. బంగ్లాదేశ్‌కు చెందిన నిటోల్ నిలాయ్ గ్రూప్‌తో హీరో మోటోకార్ప్ జాయింట్ వెంచర్‌ను ఏర్పాటు చేసుకొని బంగ్లాదేశ్ మార్కెట్లోకి ప్రవేశించింది. ఈ జాయింట్ వెంచర్‌లో హీరో మోటోకార్ప్‌కు 55 శాతం మెజారిటీ వాటా ఉంది.

బంగ్లాదేశ్‌లో హీరో మోటోకార్ప్ మొత్తం 11 మోడళ్ల (మోటార్‌సైకిళ్లు, స్కూటర్ల)ను విక్రయించనుంది. ప్రారంభంలో భాగంగా, 50 అవుట్‌లెట్ల ద్వారా వీటిని విక్రయించనున్నారు. అంతేకాకుండా, బంగ్లాదేశ్‌లో హీరో మోటోకార్ప్ విక్రయించే అన్ని ఉత్పత్తులకు ఐదేళ్ల వారంటీని కూడా ఆఫర్ చేయనుంది. ఆ దేశంలో ఐదేళ్ల వారంటీతో లభ్యం కానున్న తొలి ద్విచక్ర వాహనాలు ఇవే కావటం విశేషం.

Hero MotoCorp

ఈ జాయింట్ వెంచర్‌లో భాగంగా కేవలం ద్విచక్ర వాహనాలను విక్రయించడమే కాకుండా, వీటిని స్థానికంగా తయారు చేసేందుకు బంగ్లాదేశ్‌లో ఓ తయారీ కేంద్రాన్ని కూడా స్థాపించనున్నారు. విశేషం ఏంటంటే, హీరో మోటోకార్ప్‌కు భారతదేశం వెలుపల ఇదే తొలి ప్లాంట్ కావటం. వచ్చే ఆర్థిక సంవత్సరం (2015-16) ద్వితీయ త్రైమాసికం నాటికి ఈ ప్లాంటు నిర్వహణలోకి రానుంది.

హీరో మోటోకార్ప్ బంగ్లాదేశ్ మార్కెట్లో హెచ్ఎఫ్ డాన్, హెచ్ఎఫ్ డీలక్స్, స్ప్లెండర్ ప్లస్, స్ప్లెండర్ ప్రో, కొత్త స్ప్లెండర్ ఐస్మార్టట్, ప్యాషన్ ప్రో వంటి 100సీసీ బైక్‌లను మరియు సూపర్ స్ప్లెండర్, గ్లామర్ వంటి 125సీసీ బైక్‌లను అలాగే ఎక్స్‌ట్రీమ్, హంక్ వంటి 150సీసీ బైక్‌లతో పాటుగా 100సీసీ ప్లెజర్ స్కూటర్‌ను విక్రయించనుంది.

Most Read Articles

English summary
Hero MotoCorp, the world's largest two-wheeler manufacturer in terms of sales, has entered Bangladesh through a joint venture with Nitol Niloy Group. Hero holds a majority 55 percent stake in the joint venture.
Story first published: Tuesday, April 22, 2014, 9:43 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X