హీరో, హోండాలకు కలిసొచ్చిన ధన్‌తేరాస్; రికార్డు స్థాయిలో అమ్మకాలు

By Ravi

సాధారణంగా ధన త్రయోదశి (ధన్‌తేరాస్, దీపావళి) నాడు వినియోగదారులకు కొనుగోలు సెంటిమెంట్ ఎక్కువగా ఉంటుంది. ఆ రోజున బంగారం లేదా ఏదైనా వస్తువు కొనుగోలు చేస్తే మంచిదని చాలా మంది భావిస్తుంటారు. మోటార్ వాహనాల విషయంలో కూడా ఈ సెంటిమెంట్ బలంగా ఉంటుంది. ఈ సెంటిమెంట్‌‌ను క్యాష్ చేసుకునేందుకు కంపెనీలు కూడా పలు ఆఫర్లను ప్రకటించి, కస్టమర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తుంటాయి.

ఈ ధన్‌తేరాస్ రోజున ద్విచక్ర వాహనాల తయారీ దిగ్గజాలు హీరో మోటోకార్ప్, హోండా మోటార్‌సైకిల్ అండ్ స్కూటర్ ఇండియా లిమిటెడ్‌లు భారీ అమ్మకాలు నమోదు చేశాయి. నిన్న ఒక్కరోజే హీరో మోటోకార్ప్ ఏకంగా 2 లక్షలకు పైగా ద్విచక్ర వాహనాలను విక్రయించగా, హోండా మోటార్‌సైకిల్ అండ్ స్కూటర్ ఇండియా 1.65 లక్షల వాహనాలను విక్రయించినట్లు వెల్లడించింది.

Hero MotoCorp

ఒక్క రోజులో ఇంత భారీ సంఖ్యలో అమ్మకాలు సాధించడం తమకు ప్రప్రథమమని, గతేడాది ఇదే రోజుతో పోలిస్తే అమ్మకాలు 80 శాతనికి పైగా వృద్ధి సాధించామని హీరో మోటోకార్ప్ నేషనల్ సేల్స్ హెడ్ ఎ. శ్రీనివాస్ తెలిపారు. ఈ పండుగ సీజన్‌లో వాహనాలకు డిమాండ్ భారీగా ఉంటుందని తాము ముందుగానే అంచనా వేసి అందుకు అన్ని ఏర్పాట్లు చేసుకున్నామని ఆయన వివరించారు.

కాగా.. హోండా మోటార్‌సైకిల్ అండ్ స్కూటర్ ఇండియా గడచిన సంవత్సరం ధన్‌తేరాస్ రోజున 78,500 వాహనాలు విక్రయించగా.. ఈసారి ఏకంగా 110 శాతం వృద్ధితో 1.65 లక్షల వాహనాలను విక్రయించింది. హీరో నుంచి విడిపోయి ప్రత్యేక కంపెనీగా ఏర్పడిన తర్వాత ఇదే తమకు తొలి పండుగ సీజన్ అని, భారీ విక్రయాలు కస్టమర్లకు తమపై ఉన్న నమ్మకాన్ని తెలియజే స్తోందని కంపెనీ వైస్ ప్రెసిడెంట్ యాదవీందర్ గులేరియా తెలిపారు.

Most Read Articles

English summary
Two-wheeler majors Hero MotoCorp and Honda Motorcycle & Scooter India (HMSI) raked in massive sales on Dhanteras with the homegrown market leader surpassing the two lakh units mark. 
Story first published: Thursday, October 23, 2014, 11:46 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X