ఆంధ్రాలోనే హీరో మోటోకార్ప్ ప్లాంట్, రూ.2200 కోట్ట పెట్టుబడి

By Ravi

భారతదేశపు అగ్రగామి ద్విచక్ర వాహన తయారీ సంస్థ హీరో మోటోకార్ప్ తమ 6వ ప్లాంట్‌ను దక్షిణ భారతదేశంలో ఏర్పాటు చేయాలని భావిస్తున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసినదే. ఆ ప్లాంట్‌ను సొంతం చేసుకునేందుకు తెలంగాణా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు పోటీ పడిపడినప్పటికీ, హీరో మోటోకార్ప్ తమ ప్లాంట్‌ను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే ఏర్పాటు చేసేందుకు మొగ్గు చూపింది. మొత్తం రూ.2,200 కోట్ల పెట్టుబడితో ఆంధ్రప్రదేశ్‌లో ప్లాంట్‌ను ఏర్పాటు చేయనున్నామని కంపెనీ ఉన్నతాధికారి ఒకరు వెల్లడించారు.

ఆంధ్రప్రదేశ్‌‌లోని చిత్తూరు జిల్లాలో ఉన్న పారిశ్రామిక ప్రాంత శ్రీ సిటీలో ఈ ప్లాంట్‌ను ఏర్పాటు చేసేందుకు రాష్ట్ర క్యాబినెట్ 600 ఎకరాల స్థలాన్ని హీరో మోటోకార్ప్‌కు కేటాయించింది. స్థానిక మార్కెట్ అవసరాలను తీర్చేందుకు గాను దక్షిణ భారతదేశంలో కెల్లా అతిపెద్ద ప్లాంట్‌ను ఏర్పాటు చేసేందుకు కంపెనీ సిద్ధంగా ఉందని హీరో మోటోకార్ప్ మేనేజింగ్ డైరెక్టర్, సీఈఓ పవన్ ముంజాల్ వెల్లడించారు.

Hero MotoCorp

శ్రీ సిటీలో ఇప్పటికే క్యాడ్బరీ, పెప్సికో, కెల్లాగ్స్, కోల్గేట్ పామోలివ్, ఆల్స్టామ్, ఇసుజు మోటార్స్ వంటి ప్రముఖ కార్పోరేట్ కంపెనీలున్నాయని, ఈ ప్రాంతంలో హీరో మోటో ప్లాంట్ ఏర్పాటు ద్వారా దాదాపు 9000 మందికి ఉపాధి లభిస్తుందని శ్రీ సిటీ ఎగ్జిక్యూటివ్ ఒకరు తెలిపారు.

ఈ ప్రతిపాదిత హీరో మోటోకార్ప్ ప్లాంట్‌ను సంవత్సరానికి 1.8 మిలియన్ ద్విచక్ర వాహనాలను ఉత్పత్తి చేసే సామర్థ్యంతో ఏర్పాటు చేయనున్నారు. ఇది హీరో మోటోకార్ప్‌కు భారతదేశంలో 6వ ప్లాంట్, ఈ ప్లాంట్ పూర్తిస్థాయిలో నిర్వహణలోకి వస్తే, కంపెనీ మొత్తం దేశీయ ఉత్పత్తి సామర్థ్యం 12 మిలియన్ యూనిట్లకు చేరుకుంటుంది.

Most Read Articles

English summary
India's largest twowheeler maker Hero MotoCorp plans to invest Rs 2,200 crore to set up a manufacturing plant in Andhra Pradesh, according to a senior official.
Story first published: Tuesday, September 16, 2014, 10:08 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X