కొలంబియాలో ఆరు బైక్స్‌ని విడుదల చేసిన హీరో మోటోకార్ప్

By Ravi

దేశపు అగ్రగామి ప్యాసింజర్ కార్ల తయారీ కంపెనీ హీరో మోటోకార్ప్, ఇటీవలే కొలంబియాలో కొత్త ప్లాంట్ పనులను ప్రారంభించిన సంగతి తెలిసినదే. ఈ నేపథ్యంలో, కొలంబియాలో కంపెనీ ఆరు కొత్త మోటార్‌సైకిళ్లను కూడా అక్కడి మార్కెట్లో విడుదల చేసింది.

దక్షిణ అమెరికాలోని అతిపెద్ద టూవీలర్ మార్కెట్లలో కొలంబియా కూడా ఒకటని, ఈ ప్రాంతంలో తాము తమ నెట్‌వర్క్‌ను విస్తరించుకోనున్న నేపథ్యంలో, ఈ మార్కెట్ కీల పాత్ర పోషించనుందని హీరో మోటోకార్ప్ వైస్ చైర్మన్, ఎండి, సీఈఓ పవన్ ముంజాల్ తెలిపారు. కొలంబియాను ఆధారంగా చేసుకొని, దాని చుట్టు ప్రక్కల ఉన్న ఇరుగపొరుగు దేశాలకు తమ ఉత్పత్తులను ఎగుమతి చేస్తామని ఆయన చెప్పారు.

హీరో మోటోకార్ప్ ఆఫర్ చేస్తున్న 100సీసీ బైక్స్ - స్ప్లెండర్ ఐస్మార్ట్, ఈకో డీలక్స్, ప్యాషన్ ప్రో, 125సీసీ బైక్ - గ్లామర్, 150సీసీ బైక్ - హంక్, 225సీసీ బైక్ - కరిజ్మా జెడ్ఎమ్ఆర్ మోడళ్లను కొలంబియా మార్కెట్లో విడుదల చేశారు.

Hero MotoCorp Launches Six Bikes In Colombia

హీరో మోటోకార్ప్ గ్లోబల్ ఎక్స్‌పాన్షన్ ప్లాన్ (ప్రపంచ విస్తరణ ప్రణాళిక)లో భాగంగా, కొలంబియాలో ఓ అధునాతన ఉత్పత్తి కేంద్రాన్ని ఏర్పాటు చేయనుంది. ఈ ప్రాజెక్ట్ ఖర్చు 70 మిలియన్ అమెరికన్ డాల్రు. ఇందులో 38 మిలియన్ డాలర్లను కంపెనీ క్యాపిటల్‌గా వెచ్చించనుంది. మిగిలిన మొత్తాన్ని వర్కింగ్ క్యాపిటల్‌గా రానున్న మూడేళ్ల కాలం పాటు వినియోగించనుంది. ఈ ఈక్విటీ పెట్టుబడిని హీరో మోటోకార్ప్ లిమిటెడ్ పూర్తి నెథర్లాండ్స్ అనుబంధ సంస్థ హెచ్ఎమ్‌సిఎల్ బివి ద్వారా వెచ్చించనున్నారు.

కొలంబియాలో సుమారు 17 ఎకరాల (68,000 చ.అ.) విస్తీర్ణంలో ఏర్పాటు చేయనున్న ఈ ప్లాంట్ 2015 మధ్య భాగం నాటికి అందుబాటులోకి రావచ్చని అంచనా. ఈ ప్లాంట్ ప్రారంభ ఉత్పత్తి సామర్థ్యం సాలీనా 78,000 యూనిట్లు. భవిష్యత్తులో ఈ ఉత్పత్తి సామర్థ్యాన్ని 1.50 లక్షల యూనిట్లకు పెంచనున్నారు. హీరో మోటోకార్ప్ తమ గ్లోబల్ ఫుట్‌ప్రింట్ కోసం అనేక దేశాలలో కార్యకలపాలాను ప్రారంభించి ప్రపంచపు నెంబర్ వన్ టూవీలర్ కంపెనీగా అవతరించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలుస్తోంది.

Most Read Articles

English summary
India's largest two-wheeler maker Hero MotoCorp has launched six of its best-selling bikes here as part of its target to clock 1.2 million unit sales from global business by 2020.
Story first published: Tuesday, December 2, 2014, 11:06 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X