గుజరాత్‌లో హోండా మోటార్‌సైకిల్ ప్లాంట్; రూ.1100 కోట్ల పెట్టుబడి

By Ravi

జపాన్‌కు చెందిన ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ కంపెనీ హోండా మోటార్‌‌‌సైకిల్‌ అండ్‌ స్కూటర్స్‌ ఇండియా ప్రైవేట్‌ లిమిటెడ్‌ (హెచ్‌ఎమ్ఎస్‌ఐ) గుజరాత్‌లో రూ.1100 కోట్లపెట్టుబడిని వెచ్చించి ఓ కొత్త ప్లాంట్‌ను నిర్మించనుంది. అహ్మాదాబాద్ జిల్లాలోని వితలపూర్ గ్రామంలో ఈ ప్లాంట్‌ను ఏర్పాటు చేయనున్నారు.

ఈమేరకు హెచ్ఎమ్ఎస్ఐ గుజరాత్ రాష్ట్ర ప్రభుత్వంతో స్టేట్‌ సపోర్ట్‌ అగ్రిమెంట్‌ (ఎస్‌ఎస్‌పి)ను కుదుర్చకుంది. వార్షికంగా 1.2 మిలియన్ యూనిట్ల వాహనాలను ఉత్పత్తి చేసేలా హోండా మోటార్‌సైకిల్ అండ్ స్కూటర్ ఇండియా ఏర్పాటు చేస్తున్న ఈ ప్లాంట్ వలన స్థానికంగా 2000 మంది యువతకు ఉపాధి లభించనుందని కంపెనీ పేర్కొంది.

HMSI To Invest INR 1100 Cr To Set Up New Plant In Gujarat

డిసెంబర్‌ 2015 నాటికి ఈ ప్లాంట్‌లో ఉత్పత్తి ప్రారంభం కావచ్చని అంచనా. కొత్త ప్లాంట్ చేరికతో హెచ్‌ఎమ్ఎస్‌ఐ మొత్తం ఉత్పత్తి సామర్థ్యం సాలీనా 6 మిలియన్‌ యూనిట్లకు చేరుకోనుంది. హోండాకు ఇప్పటికే భారతదేశంలో మూడు చోట్ల (హర్యానా, రాజస్థాన్‌, కర్నాటక) ప్లాంట్‌లు ఉన్నాయి.

గుజరాత్‌ ప్లాంట్‌లో నుంచి హోండా యాక్టివా స్కూటర్‌ను ఉత్పత్తి చేయనున్నారు. ఇదిలా ఉండగా గుజరాత్‌ ఆర్థికశాఖ మంత్రి సౌరభ్‌ పటేల్‌ మాట్లాడుతూ.. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ జపాన్‌ పర్యటన తర్వాత, ఆయా దేశాలకు చెందిన కంపెనీలు గుజరాత్‌లో పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వస్తున్నాయని అన్నారు. మోడీ మేక్‌ ఇన్‌ ఇండియా పిలుపునకు విశేష స్పందన లభిస్తోందని పటేల్‌ తెలిపారు.

Most Read Articles

English summary
Motorcycle and Scooter India will invest Rs 1,100 crore to set up a two-wheeler plant at Vithalapur village in Ahmedabad district and signed a 'state support agreement' with the Gujarat Government for the purpose today.
Story first published: Wednesday, October 1, 2014, 9:46 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X