హీరో స్ప్లెండర్‌ను ఓవర్‌టేక్ చేసిన హోండా యాక్టివా!

By Ravi

గడచిన దశాబ్ధాలుగా హీరో స్ప్లెండర్ భారతదేశంలో అత్యధికంగా అమ్ముడుపోతున్న ద్విచక్ర వాహనంగా తన హవా కొనసాగిస్తోంది. అయితే, ఇక హీరో స్ప్లెండర్ తన నెంబర్ వన్ స్థానాన్ని కోల్పోనుంది. ఎందుకంటే, హోండా యాక్టివా స్కూటర్ ఇప్పుడు ఆ స్థానాన్ని కైవసం చేసుకుంది. అమ్మకాల పరంగా నెంబర్ వన్‌గా స్ప్లెండర్ బైక్‌ను యాక్టివా స్కూటర్ ఓవర్‌టేక్ చేసింది.

గడచిన ఆర్థిక సంవత్సరంలోనే (2013-14) హీరో స్ప్లెండర్ బైక్ (100సీసీ)ను హోండా యాక్టివా స్కూటర్ రెండుసార్లు ఓవర్‍‌టేక్ చేసింది. మొదట సెప్టెంబర్ 2013లో ఆ తర్వాత మార్చ్ 2014లో ఈ రికార్డు నమోదైంది. మార్చ్ 2014లో హోండా మొత్తం 1,77,928 యాక్టివా స్కూటర్లను విక్రయించింది. ఇదే సమయంలో హీరో మోటోకార్ప్ కేవలం 1,63,778 యూనిట్ల స్ప్లెండర్ బైక్‌లను మాత్రమే విక్రయించింది.

Honda Activa 125 Front

ఒకప్పుడు భారత్‌లో ఆటోమేటిక్ స్కూటర్లను కొనేవారి సంఖ్య చాలా తక్కువగా ఉండేది. అయితే, ఇప్పుడు ట్రెండ్ మారింది. నాణ్యమైన ఇంజన్, ధృడమైన బాడీతో లభిస్తున్న యాక్టివా స్కూటర్‌ను కొనేందుకు కస్టమర్లు క్యూ కడుతున్నారు. ఇప్పటికీ హోండా యాక్టివా విషయంలో రెండు మూడు నెలల వెయిటింగ్ పీరియడ్ ఉంటోందంటే, ఈ స్కూటర్ ఉన్న డిమాండ్ ఏంటో ఇట్టే అర్థమైపోతుంది.

ప్రస్తుతం హోండా యాక్టివా రెండు వేరియంట్లలో (రెగ్యులర్ 110సీసీ యాక్టివా మరియు 110సీసీ యాక్టివా-ఐ) లభిస్తుంది. మరోవైపు యాక్టివా ప్రోడక్ట్ పోర్ట్‌ఫోలియోను విస్తరించుకునే దిశలో భాగంగా, కంపెనీ ఇందులో మరింత శక్తివంతమైన 125సీసీ వెర్షన్ యాక్టివాను విడుదల చేయనుంది. ఇప్పటికే ఈ మోడల్‌కు బుకింగ్‌లు కూడా ప్రారంభమయ్యాయి. యాక్టివా జోరు ఇలానే కొనసాగితో టూవీలర్ మార్కెట్లో హీరో స్ప్లెండర్ తన లీడర్‌షిప్ స్థానాన్ని కోల్పోక తప్పదని విశ్లేషకులు చెబుతున్నారు.

Most Read Articles

English summary
Hero Splendor has long been India's number one two wheeler, but those days might be coming to an end. Hero's rival and former partner Honda has for long had a success story of its own in the form of the Activa automatic scooter. After over a decade of excellent sales, we could finally witness India's most loved scooter dethroning India's best selling two wheeler, the Splendor.
Story first published: Friday, April 18, 2014, 18:01 [IST]
--<
-->
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X