హోండాకు భారత్‌లో కోటిన్నరకు పైగా కస్టమర్లు

By Ravi

జపాన్‌కు చెందిన ప్రముఖ ద్విచక్ర వాహన సంస్థ హోండాకు చెందిన పూర్తి భారతీయ అనుబంధ కంపెనీ హోండా మోటార్‌సైకిల్ అండ్ స్కూటర్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ (హెచ్ఎమ్ఎస్ఐ), భారత మార్కెట్లో మరో అరుదైన మైలురాయిని అధిగమించింది. హెచ్ఎమ్ఎస్ఐ భారత మార్కెట్లోకి ప్రవేశించి దాదాపు 13 ఏళ్లు పూర్తవుతున్న నేపథ్యంలో, దేశీయ విపణిలో కంపెనీ ద్విచక్ర వాహనాల విక్రయాలు 1.5 కోట్ల మైలురాయిని చేరాయి.

భారతదేశంలో కార్యకలాపాలు ప్రారంభించిన 13 ఏళ్లకు ఈ ఘనత సాధించామని హెచ్ఎమ్ఎస్ఐ వైస్ ప్రెసిడెంట్ (సేల్స్ అండ్ మార్కెటింగ్) వై.ఎస్. గులేరియా తెలిపారు. ఇంత స్వల్పకాలంలోనే ఈ ఘనత సాధించడం హోండా బ్రాండ్‌పై పెరుగుతున్న వినియోగదారుల నమ్మకానికి నిదర్శనమని ఆయన వ్యాఖ్యానించారు. జులై 2012 నాటికి కోటి వాహనాల విక్రయ మార్కును దాటామని, తాజా అరకోటి వాహన అమ్మకాలు కేవలం 18 నెలల్లోనే సాధించామని గులేరియా చెప్పారు.

Honda Motorcycle

మాస్ (బడ్జెట్) మోటార్‌సైకిల్ సెగ్మెంట్లో హోండా అందిస్తున్న డ్రీమ్ యుగ, డ్రీమ్ నియో బైక్‌లకు మంచి ఆదరణ లభించిందని, ఈ బైక్‌లతోనే మంచి వృద్ధి సాధించామని ఆయన వెల్లడించారు. తమ సేల్స్ నెట్‌వర్క్‌ను మరింత విస్తృతం చేసేందుకు సన్నాహాలు చేస్తున్నామని, తర్వలో కొత్తగా మరో 500 టచ్-పాయింట్లను ఏర్పాటు చేస్తామని, వీటితో తమ నెట్‌వర్క్ 2,500కు పెరుగుతుందని గులేరియా వివరించారు.

హోండా మోటార్‌సైకిల్ అండ్ స్కూటర్ ఇండియా డిసెంబర్ 14, 1999లో భారత మార్కెట్లోకి ప్రవేశించింది, ఆ తర్వాత 2001లో తొలిసారిగా తమ మానేసర్ ప్లాంటులో ఉత్పత్తి కార్యకలాపాలను ప్రారంభించింది. ప్రస్తుతం హెచ్ఎమ్ఎస్ఐకి భారత్‌లో మొత్తం 3 ఉత్పత్తి కేంద్రాలు ఉన్నాయి. అందులో ఒకటి మానేసర్ (హర్యానా), మరొకటి తపుకరా (రాజస్థాన్)లో ఉండగా మూడవ ప్లాంట్‌ను ఇటీవలో కర్ణాటకలోని నర్సాపూర్ వద్ద ఏర్పాటు చేశారు. ఈ మూడు ప్లాంట్ల సాయంతో 2014 ఆర్థిక సంవత్సరం చివరి నాటికి కంపెనీ మొత్తం ఉత్పత్తి సాలీనా 46 లక్షల యూనిట్లకు చేరుకోనుంది.

Most Read Articles

English summary
Honda Motorcycle & Scooter India Pvt. Ltd. (HMSI), the fastest growing 2wheeler company in India today announced the acquisition of 15 million customer milestone in its 13th year of operation in India. The latest 5 million customers were added in just 18 months after the declaration of 10 million customer milestone in July, 2012.
Story first published: Friday, January 24, 2014, 13:36 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X