భారత్‌లో ప్రపంచంలో కెల్లా అతిపెద్ద హోండా స్కూటర్ ప్లాంట్

By Ravi

జపనీస్ టూవీలర్ బ్రాండ్ హోండా భారతదేశపు అగ్రగామి ద్విచక్ర వాహన సంస్థగా ఎదిగేందుకు సన్నాహాలు ముమ్మరం చేస్తోంది. ఇందులో భాగంగానే హోండా, తమ లక్ష్యాన్ని చేరుకునేందుకు గుజరాత్‌లో ఓ స్కూటర్ ఉత్పత్తి కేంద్రాన్ని ఏర్పాటు చేస్తోంది. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, హోండాకు ప్రపంచంలో కెల్లా ఇదే అతిపెద్ద స్కూటర్ ప్లాంట్ కానుంది.

ప్రస్తుతం ఆర్థిక సంవత్సరం స్కూటర్ల అమ్మకాలు జోరుగా సాగుతున్నాయి. ప్రస్తుతం మొత్తం ద్విచక్ర వాహనాల అమ్మకాలలో దాదాపు 27 శాతానికి పైగా అమ్మకాలు స్కూటర్ల నుంచే వస్తున్నాయి. దాదాపు దశాబ్దం క్రితం దీని వాటా కేవలం 8 శాతంగా మాత్రమే ఉండేది. తమ స్కూటర్ల ఉత్పత్తి సామర్థ్యాన్ని రెట్టింపు చేసినప్పటికీ, డిమాండ్‌ను చేరుకోవటం ఇబ్బందులు ఎదుర్కుంటున్నట్లు హోండా పేర్కొంది.

Honda Activa 125

హోండా మోటార్‌సైకిల్ అండ్ స్కూటర్ ఇండియా నుంచి భారత మార్కెట్లో అత్యంత సక్సెస్ సాధించిన స్కూటర్ యాక్టివా. ఈ మోడల్ భారత్‌లో విడుదలై దాదాపు 13 ఏళ్లు గడిచాయి. ఇప్పటికీ ఈ మోడల్‌కు డిమాండ్ ఎక్కువే. హోండా యాక్టివా స్కూటర్‌ను కొనాలనుకునే ఇప్పటికీ నెలల తరబడి వేచి ఉండాల్సిన పరిస్థితి నెలకొని ఉంది. ప్రస్తుతం యాక్టివాలో 3 వేరియంట్లు అందుబాటులో ఉన్నాయి.

హోండాకు ఇప్పటికే 60,000 స్కూటర్లకు పైగా బ్యాక్‌లాగ్ ఉందని, రానున్న పండుగ సీజన్‌లో ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని హోండా మోటార్‌సైకిల్ అండ్ స్కూటర్స్ ఇండియా వైస్ ప్రెసిడెంట్ (సేల్స్ అండ్ మార్కెటింగ్) తెలిపారు. ఈ సమస్యను పరిష్కరించేందుకు రూ.1100 కోట్ల పెట్టుబడితో గుజరాత్‌లోని అహ్మదాబాద్ వద్ద కొత్త ప్లాంట్‌ను ఏర్పాచు చేస్తున్నామని ఆయన వివరించారు. ఈ కొత్త ప్లాంట్‌లో 2015-16 నాటికి ఏటా 58 లక్షల యూనిట్లను ఉత్పత్తి చేయనున్నారు.

Most Read Articles

English summary
Honda is aiming to become the country's number one two-wheeler manufacturer, and is setting up what will be the world's largest scooter manufacturing unit in Gujarat to achieve this target.
Story first published: Monday, August 4, 2014, 12:41 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X