నిన్జా 300 బైక్ ధరను రూ.10,000 పెంచిన కవాసకి

By Ravi

జపనీస్ స్పోర్ట్స్ బైక్ కంపెనీ కవాసకి భారత మార్కెట్లో విక్రయిస్తున్న నిన్జా 300 స్పోర్ట్స్ ధర మరింత ప్రియమైంది. ఈ బైక్ ధరను రూ.10,000 మేర పెంచుతున్నట్లు కంపెనీ ప్రకటించింది. బజాజ్-కవాసకి గడచిన సంవత్సరం ఏప్రిల్ నెలలో కవాసకి నిన్జా 300 స్పోర్ట్స్ బైక్‌ను భారత మార్కెట్లో విడుదల చేశాయి. కెటిఎమ్ తమ ఆర్‌సి బైక్‌లను అత్యంత సరసమైన ధరకే విడుదల చేస్తే, కవాసకి మాత్రం తమ స్పోర్ట్స్ బైక్ ధరను మరింత పెంచడం గమనార్హం.

కవాసకి నిన్జా 300 స్పోర్ట్స్ బైక్ విషయానికి వస్తే.. నిన్జా సిరీస్‌లో కవాసకి అందిస్తున్న 250సీసీ వేరియంట్ నిన్జా 250 స్పోర్ట్స్ బైక్ స్థానాన్ని భర్తీ చేస్తూ కంపెనీ ఈ 300సీసీ బైక్‌ను ప్రవేశపెట్టింది. కవాసకి జెడ్ఎక్స్-10ఆర్ మోడల్‌ నుంచి స్ఫూర్తి పొంది డిజైన్ చేసిన హెడ్‌ల్యాంప్స్, ఫ్లోటింగ్ విజర్, రివైజ్డ్ ఇన్‌స్ట్రుమెంట్స్, లార్జర్ ఫెయిరింగ్ వెంట్స్ వంటి డిజైన్ మార్పులను ఈ కొత్త బైక్‌లో గమనించవచ్చు.

kawasaki ninja price hike

ఈ బైక్‌లోని రేడియేటర్ ఫ్యాన్ కౌల్ బైక్ నడుపుతున్నప్పుడు ఇంజన్ నుంచి వెలువడే వేడిని రైడర్‌కు తగలకుండా చేస్తుంది. ఇందులో 296సీసీ, పారలల్ ట్విన్-సిలిండర్, ఫ్యూయెల్ ఇంజక్టెడ్ ఇంజన్‌ను ఉపయోగించారు. ఇది గరిష్టంగా 11,000 ఆర్‌పిఎమ్ వద్ద 38.8 బిహెచ్‌పిల శక్తిని మరియు 10,000 ఆర్‌పిఎమ్ వద్ద 27.5 ఎన్ఎమ్‌ల టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్‌ 6-స్పీడ్ గేర్‌బాక్స్‌తో (1-క్రిందకు, 5-పైకి) జతచేయబడి ఉంటుంది.

ఇందులో ఏబిఎస్ ఆప్షన్‌ను కంపెనీ ఆఫర్ చేయటం లేదు. ఈ బైక్ మొత్తం బరువు 172 కేజీలు. ఇది లైమ్ గ్రీన్, పెరల్ స్టార్‌డస్ట్ వైట్ అనే రెండు కలర్ ఆప్షన్లతో మాత్రమే లభ్యమవుతుంది. డైమండ్ టైప్ స్టీల్ ఫ్రేమ్, 37 మి.మీ. టెలిస్కోపిక్ ఫ్రంట్ ఫోర్క్స్, లింక్డ్ మోనోషాక్ రియర్ సస్పెన్షన్, ముందు వైపు 290 మి.మీ., వెనుక వైపు 220 మి.మీ. నిస్సిన్ డిస్క్ బ్రేక్స్ ఇందులో చెప్పుకోదగిన ప్రత్యేకతలు.

Most Read Articles

English summary
Currently Kawasaki's Ninja 300 was already out of reach of many enthusiasts. Now the Japanese manufacturer has taken it a step further and has hiked the price further by INR 10,000. This announcement comes post the launch of KTM's flagship RC range launch in India of affordable riding.
Story first published: Monday, September 29, 2014, 15:47 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X