మరో 18 నెలల్లో ఆంధ్రా ప్లాంట్ నుంచి బైక్స్: హీరో మోటోకార్ప్

భారతదేశపు అగ్రగామి ద్విచక్ర వాహన తయారీ సంస్థ హీరో మోటోకార్ప్ తమ 6వ ప్లాంట్‌ను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే ఏర్పాటు చేసేందుకు సిద్ధమైన సంగతి తెలిసినదే. ఈ మేరకు హీరో మోటోకార్ప్ మరియు ఆంధ్రప్రదేశ్ సర్కారు మధ్య ఓ పరస్పర సహకార ఒప్పందం కుదింరింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని చిత్తూరు జిల్లాలో ఉన్న శ్రీసిటీలో హీరో మోటోకార్ప్ ప్లాంట్ కోసం ఆ రాష్ట్ర సర్కారు స్థలాన్ని కేటాయించింది.

హీరో మోటోకార్ప్ ఈ ప్లాంట్ పనులను వీలైనంత త్వరగా ప్రారంభించి, ప్లాంట్ నిర్మాణాన్ని కూడా సాధ్యమైనంత త్వరలో పూర్తి చేయాలని యోచిస్తోంది. మరో 18 నెలల సమయంలో ఈ ప్లాంట్ నుంచి ద్విచక్ర వాహనాలను ఉత్పత్తి చేస్తామని హీరో మోటోకార్ప్ ప్రకటించింది.

చిత్తూరులోని శ్రీసిటీలో ఏర్పాటు చేయనున్న హీరో మోటోకార్ప్ ప్లాంట్ వలన సుమారు 3000 మందికి ప్రత్యక్షంగా ఉపాధి లభించనుండగా, పరోక్షంగా మరో 7000 మందికి ఉపాధి లభించనుంది.

Made In Andhra Hero Bikes In 18 Months

మొత్తం 600 ఎకరాల విస్తీర్ణంలో హీరో మోటోకార్ప్ ఈ ప్లాంట్‌ను ఏర్పాటు చేయనుంది. ఇందు కోసం కంపెనీ మొత్తంగా రూ.3,100 కోట్లను పెట్టుబడిగా వెచ్చించనుంది. ఇందులో రూ.1,600 కోట్లను మెయిన్ ప్లాంట్ మరియు ఆర్ అండ్ డి కోసం ఉపయోగించనున్నారు. మిగిలిన రూ.1,500 కోట్లను యాన్సిలరీ యనిట్ల కోసం ఉపయోగించనున్నారు.

ఈ కొత్త ప్లాంట్ పూర్తిస్థాయిలో నిర్వహణలోకి వచ్చినట్లయితే, ఈ ప్లాంట్ ప్రతి ఏటా 1.8 మిలియన్ మోటార్‌సైకిళ్లు మరియు సైకిళ్లు ఉత్పత్తి అవుతాయి. ఇది హీరో మోటోకార్ప్‌కు భారతదేశంలో 6వ ప్లాంట్, ఈ ప్లాంట్ పూర్తిస్థాయిలో నిర్వహణలోకి వస్తే, కంపెనీ మొత్తం దేశీయ ఉత్పత్తి సామర్థ్యం 12 మిలియన్ యూనిట్లకు చేరుకుంటుంది.

Most Read Articles

English summary
After being pursued by both Telangana and Andhra Pradesh and opting for the latter, Hero MotoCorp announced on Tuesday that its manufacturing plant near Sri City in Chittoor district will start rolling out motorcycles in 18 months time.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X