అతి త్వరలో మహీంద్రా మోజో బైక్ విడుదల

By Ravi

మహీంద్రా గ్రూపుకు చెందిన ద్విచక్ర వాహన విభాగం మహీంద్రా టూవీలర్స్ మరో సరికొత్త ఉత్పత్తి మార్కెట్లోకి రాబోతుంది. ఈ ఏడాది ఫిబ్రవరిలో జరిగిన 2014 ఆటో ఎక్స్‌పోలో కంపెనీ ప్రదర్శనకు ఉంచిన రిఫ్రెష్డ్ మహీంద్రా మోజో (Mahindra Mojo) 300సీసీ బైక్ విడుదలకు సిద్ధంగా ఉంది. కంపెనీ ఈ బైక్‌ను ఏ సమయంలో నైనా విడుదల చేసేందుకు రెడీగా ఉంది.

ఇది కూడా చదవండి: బెస్ట్ 200-250సీసీ బైక్స్

మహీంద్రా టూవీలర్స్ ఇప్పటికే మోజో బైక్‌ను పూనే రోడ్లపై టెస్టింగ్ చేస్తోంది. ఈ టెస్టింగ్ ప్రక్రియ దాదాపు పూర్తయినట్లు తెలుస్తోంది. ఇటీవలే మహీంద్రా టూవీలర్స్ ఓ డీలర్స్ మీట్‌ను నిర్వహించి ఈ బైక్‌ను వారి కోసం ప్రదర్శనకు కూడా ఉంచినట్లు సమాచారం. మహీంద్రా మోజో మొత్తం రెండు వేరియంట్లలో (రెగ్యులర్, స్పోర్ట్) లభ్యం కానుంది.

Mahindra Mojo

మహీంద్రా మోజో బైక్‌లో 295సీసీ, సింగిల్ సిలిండర్, లిక్విడ్ కూల్డ్ ఇంజన్‌ను ఉపయోగించారు. ఈ ఇంజన్ గరిష్టంగా 28 బిహెచ్‌పిల శక్తిని, 25 ఎన్ఎమ్‌ల టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. స్పోర్ట్ వేరియంట్ కొంచెం ఎక్కువ పెర్ఫామెన్స్‌ను ఆఫర్ చేసే అవకాశం ఉంది. ఈ ఇంజన్ 6-స్పీడ్ గేర్‌బాక్స్‌తో అనుసంధానం చేయబడి ఉంటుంది.

ఇది కూడా చదవండి: బెస్ట్ 125సీసీ స్కూటర్స్

మహీంద్రా మోజో బైక్‌లో పెటల్ స్టైల్ డిస్క్ బ్రేక్స్, రేడియల్ టైర్స్, అప్‌సైడ్ డౌన్ ఫోర్క్స్, పీరెల్లీ డెమోన్ టైర్స్ వంటి ఫీచర్లున్నాయి. ఇంకా డిజిటల్ స్పీడోమీటర్, అనలాగ్ టాకోమీటర్ కాంబినేషన్‌తో కూడిన ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ వంటి ఫీచర్లు కూడా ఉన్నాయి. ఈ బైక్‌కు సంబంధించిన మరిన్ని అప్‌డేట్స్ కోసం తెలుగు డ్రైవ్‌స్పార్క్‌ను గమనిస్తూ ఉండండి.

Most Read Articles

English summary
The 2014 Auto Expo showcased the revamped Mahindra Mojo. Ever since, the bike was frequently seen testing in Pune. Recently, Mahindra Two-Wheelers showcased the Mojo to the Indian dealers, hinting a launch very soon.
Story first published: Friday, August 8, 2014, 16:56 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X