హోండా టూవీలర్ మొబైల్ సర్వీస్ వ్యాన్ సేవలు ప్రారంభం

By Ravi

హోండా మోటార్‌సైకిల్ అండ్ స్కూటర్ ఇండియా లిమిటెడ్, భారత్‌‍లో తమ వినియోగదారుల కోసం సరికొత్త సర్వీస్ సేవలను ప్రారంభించింది. గ్రామీణ ప్రాంతాల్లోని హోండా కస్టమర్లకు తమ సర్వీసింగ్ సేవలను మరింత చేరువ చేసేందుకు గాను హోండా ఈ సరికొత్త ప్రణాళికకు శ్రీకారం చుట్టింది.

హోండా తమ వేవ్ 2.0 స్ట్రాటజీ బ్లూ-ప్రింట్‌లో భాగంగా 'మొబైల్ సర్వీస్ వ్యాన్' సేవలను ప్రారంభించినట్లు పేర్కొంది. ఈ కొత్ మొబైల్ సర్వీస్ వ్యాన్ సేల్స్, సర్వీస్, స్పేర్ పార్ట్స్ సేవలను ఆఫర్ చేస్తుంది. దేశంలోని మారుమూల ప్రాంతాలను లక్ష్యంగా చేసుకొని కంపెనీ ఈ సేవలను ప్రారంభించింది.

ఈ సందర్భంగా హోండా మోటార్‌సైకిల్ అండ్ స్కూటర్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ సీఈఓ, ప్రెసిడెంట్ కీటా మురమట్సు మాట్లాడుతూ.. తమ నెట్‌వర్క్ విస్తరణలో భాగంగా, దేశంలోని మారుమూల ప్రాంతాలను కూడా కవర్ చేయనున్నామని, ఈ ఏడాది 70 శాతం, సుమారు 1000 టచ్ పాయింట్లను గ్రాణీ ప్రాంతాల్లో ఏర్పాటు చేస్తామని ఆయన వివరించారు.

Mobile Service Van

హోండా ఈ ఏడాది చివరి నాటికి దేశవ్యాప్తంగా ఇలాంటివి 11 మొబైల్ సర్వీస్ వ్యాన్‌లను పరిచయం చేయాలనే లక్ష్యంతో ఉంది. ఈ వ్యాన్ ద్వారా కంపెనీ తమ సర్వీసింగ్ సేవలను కస్టమర్ల వద్దకు తీసుకువెళ్లటంతో పాటుగా, ఇదే వాహనం కంపెనీకి ప్రచార వాహనంగా కూడా ఉపయోగపడనుంది. ఇందులో ఓ మోటార్‌సైకిల్‌ను డిస్‌ప్లే ఉంచేంత స్థలం ఉంటుంది.

ఈ మొబైల్ వ్యాన్ ఏకకాలంలో రెండు హోండా మోటార్‌సైకిళ్లను సర్వీస్ చేయగల సామర్థ్యం ఉంది. తమ మోటార్‌సైకిళ్లను ఎలా రిపేర్ చేయాలనే విషయాన్ని కూడా హోండా గ్రామీణ ప్రాంతాల్లోని స్థానిక మెకానిక్‌లకు శిక్షణ ఇవ్వనుంది.

Most Read Articles

English summary
Honda Motorcycle and Scooter India Pvt. Ltd is one of the highest selling manufacturers. They want to further penetrate into the Indian market and are taking on new initiatives. They have now launched their unique 'Mobile Service Van' for rural customers.
Story first published: Wednesday, August 27, 2014, 11:50 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X