పెట్రోల్/డీజిల్ కావాలా? పొల్యూషన్ సర్టిఫికెట్ చూపించండి!

By Ravi

పొల్యూషన్ అండర్ కంట్రోల్ (పియూసి) సర్టిఫికెట్ కోసం మనలో చాలా మంది పెట్రోల్ బంకులను ఆశ్రయిస్తుంటాం. కొన్ని ప్రముఖ పెట్రోల్ బంకుల వద్దగా ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన, ఆర్టీఏ సర్టిఫైడ్ ఏజెంట్‌ల నుంచి పియూసి సర్టిఫికెట్ పొందతూ ఉంటాం. ఈ పొల్యూషన్ సర్టిఫికెట్‌ను ప్రతి ఆరు నెలలకు ఒకసారి రెన్యువల్ చేసుకోవాల్సి ఉంటుంది.

అయితే, అనేక మంది మోటారిస్టులు తమ వాహనం యొక్క పొల్యూషన్ చెకప్ డ్యూ డేట్‌ను మర్చిపోవటం లేదా ఈ సర్టిఫికెట్‌కు పెద్దగా ప్రాధాన్యత ఇవ్వకపోవటం వంటివి జరుగుతూ ఉంటాయి. ఈ నేపథ్యంలో, ఢిల్లీ ప్రభుత్వం పియూసి సర్టిఫికెట్ల విషయంలో ఓ విశిష్టమైన విధానాన్ని ప్రవేశపెట్టింది. అదేంటంటే..

PUC Certificate To Get Compulsory To Buy Petrol

దేశ రాజధాని నగరంలో నానాటికీ పెరిగిపోతున్న వాహనాల సంఖ్య కారణంగా అధికమవుతున్న వాతావరణ కాలుష్యాన్ని తగ్గించేందుకు గాను, నగరంలోని అన్ని వాహనాలు ఎప్పటికప్పుడు పొల్యూషన్ చెకప్‌ను చేయించుకునేందుకు వీలుగా, ప్రతి ఫ్యూయెల్ ఫిల్లింగ్ స్టేషన్ వద్ద వాహన చాలకులు తమ వాహనం యొక్క పియూసి సర్టిఫికెట్‌ను చూపిస్తేనే ఇంధనాన్ని నింపేలా ఆదేశాలు జారీ చేసింది.

ఛీఫ్ సెక్రటరీ ఎస్.కె. శ్రీవాత్సవ సారధ్యంలో నిర్వహించిన ఓ అత్యుతన్న స్థాయి సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. వాహనాల ద్వారా అధికమవుతున్న కాలుష్యాన్ని నివారించేందుకు గాను, చెల్లుబాటైన పియూసి సర్టిఫికెట్లను చూపించిన తర్వాతే వాహనాల్లో ఇంధనాన్ని నింపేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

Most Read Articles

English summary
We often take our vehicles to petrol pumps and get our 'Pollution Under Control' certificate. Currently the certificate has very less value and is merely done as a formality by most. It was introduced to regulate the pollution caused by vehicles. Now the Delhi government has decided to provide petrol or diesel only to those owners of vehicles that have a valid PUC certificate.
Story first published: Saturday, August 23, 2014, 16:53 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X