జూన్‌లో ఆల్ టైమ్ హైకి చేరిన రాయల్ ఎన్‌ఫీల్డ్ సేల్స్

By Ravi

కొత్త లోగో, కొత్త పెయింట్ ఆప్షన్స్‌ను పరిచయం చేసిన రాయల్ ఎన్‌ఫీల్డ్ గడచిన జూన్ నెలలో అమ్మకాల జోరును కనబరిచింది. జూన్ 2014లో రాయల్ ఎన్‌ఫీల్డ్ దేశీయ మరియు విదేశీయ అమ్మకాలు అంతకు ముందు సంవత్సరం ఇదే నెలతో పోల్చుకుంటే 83 శాతం వృద్ధి చెంది 25,303 యూనిట్లుగా నమోదయ్యాయి.

జూన్ 2013లో కంపెనీ 13,806 మోటార్‌సైకిళ్లను మాత్రమే విక్రయించింది. ఐషర్ మోటార్స్‌కి చెందిన రాయల్ ఎన్‌ఫీల్డ్ చెన్నైకి సమీపంలో ఓరగడం వద్ద నిర్వహిస్తున్న ప్లాంటులో ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచడమే అమ్మకాల పెరుగుదల కారణమయ్యిందని కంపెనీ పేర్కొంగి. ఈ ప్లాంటులో సగటున ప్రతినెలా 10,000 మోటార్‌సైకిళ్లు ఉత్పత్తి అవుతున్నాయి.

Royal Enfield At An All Time High In June

ఇప్పటికీ రాయల్ ఎన్‌ఫీల్డ్ మోటార్‌సైకిళ్లకు భారీ డిమాండ్ ఉంటోది, అందుకే వీటి వెయింట్ పీరియడ్ కూడా ఎక్కువగా ఉంటుంది. రాయల్ ఎన్‌ఫీల్డ్ ఉత్పత్తి సామర్థ్యం తక్కువగా ఉండటం వలన ఈ బ్రాండ్ మోటార్‌సైకిళ్లను కొనాలనుకునే చాలా మంది కస్టమర్ల అంత కాలం వేచి ఉండలేక వేరే ఇతర బ్రాండ్ల వైపు మొగ్గు చూపుతున్నారు.

అయితే, నిజమైన రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్ ప్రియులు మాత్రం ఎంత ఆలస్యమైన తాము ఈ బ్రాండ్ మోటార్‌సైకిళ్లనే కొనుగోలు చేస్తామని చెబుతున్నారు. ప్రస్తుతం రాయల్ ఎన్‌ఫీల్డ్ 350సీసీ, 500సీసీ రేంజ్ మోటార్‌సైకిళ్లను విక్రయిస్తోంది. భవిష్యత్తులో మరింత ఎక్కువ ఇంజన్ సామర్థ్యం కలిగిన మోటార్‌సైకిళ్లను కూడా అందుబాటులోకి తీసుకురావాలని కంపెనీ యోచిస్తోంది.

Most Read Articles

English summary
Royal Enfield recently introduced new paint schemes and a new logo for its cruiser motorcycles. In the month of June the Indian based manufacturer has reported positive sales figures. They managed to sell 25,303 motorcycles in both domestic and export markets. They have grown by 83 percent compared to 13,806 motorcycles it sold in June, 2013.
Story first published: Friday, July 11, 2014, 16:19 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X