బోన్‌విల్ సాల్ట్ ఫ్లాట్స్‌పై ఆర్ఈ కాంటినెంటల్ జిటి ల్యాండ్ స్పీడ్ రికార్డ్

By Ravi

అమెరికాలోని బోన్‌విల్ సాల్ట్ ఫ్లాట్స్ ల్యాండ్ స్పీడ్ రికార్డ్ సృష్టించడం అనేది నిజంగా ఓ గొప్ప అచీవ్‌మెంట్. ఇప్పటికే ఈ సాల్ట్ ఫ్లాట్స్‌పై చాలా మంది పలు రకాల వాహనాలతో ల్యాండ్ స్పీడ్ రికార్డ్స్ సృష్టించారు. తాజాగా రాయల్ ఎన్‌ఫీల్డ్ రీసెంట్‌గా మార్కెట్లో ప్రవేశపెట్టిన కాంటినెంటల్ జిటి కెఫే రేసర్ మోటార్‌సైకిల్‌తో కూడా ఓ కొత్త ల్యాండ్ స్పీడ్ రికార్డును సృష్టించారు.

ఇది కూడా చదవండి: కాంటినెంటల్ జిటి టెస్ట్ డ్రైవ్ రివ్యూ

ఈ రికార్డును సృష్టించింది ఓ మహిళ కావటం విశేషం. ఫిజికల్ థెరపీలో డాక్టరేట్ పొందిన నడీన్ డి ఫ్రీటస్, 500 మోడిఫైడ్ పుష్-రాడ్ పార్షియల్లీ స్ట్రీమ్‌లైన్డ్ (500 ఎమ్‌పిపిఎస్) విభాగంలో, రాయల్ ఎన్‌ఫీల్డ్ కాంటినెంటల్ జిటి మోటార్‌సైకిల్‌తో బోన్‌విల్ సాల్ట్ ఫీల్డ్స్‌పై గంటకు గరిష్టంగా 157.2 కిలోమీటర్ల వేగంతో బైక్‌ను నడిపి ఈ రికార్డు సృష్టించారు.

Royal Enfield Sets Land Speed Record

ఈ రికార్డు కోసం రాయల్ ఎన్‌ఫీల్డ్ కాంటినెంటల్ జిటి బైక్‌లో క్యామ్ షాఫ్ట్స్, సిలిండర్ హెడ్, థ్రోటల్ బాడీస్, పిస్టన్ మరియు ఎగ్జాస్ట్ సిస్టమ్‌ను మోడిఫై చేశారు. ఇంజన్ పవర్‌ను గరిష్టంగా 60 పిఎస్‌లకు పైగా పెంచారు. కంప్రెషన్ రేషియని కూడా పెంచారు.

బోన్‌విల్ సాల్ట్ ఫ్లాట్స్ ఒక ఉప్పు మేట. ఉప్పు గట్టిపడటం వలన ఏర్పడిన ధృడమైన మరియు చదునైన ఉపరితలం కలిగిన ప్రాంతం ఇది. అత్యధిక ల్యాండ్ స్పీడ్ రికార్డులను సాధించేందుకు చాలామంది ఈ ప్రాంతాన్నే ఎంచుకుంటుంటారు. స్పీడ్‌కి ఇది చాలా ఫేమస్ ప్లేస్.

Most Read Articles

English summary
Setting a land speed record in the Bonneville salt flats is a great achievement. Many attempt to achieve glory but only a few succeed. Some others need to come back the following year to re-attempt setting records. Along this list is a new entry, Nadine de Freitas, who holds a doctorate degree in physical therapy who chose to make a mark but only with a motorcycle but specifically, a Royal Enfield.
Story first published: Wednesday, September 3, 2014, 12:26 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X