సెప్టెంబర్‌లో 7.35 శాతం పెరిగిన సుజుకి టూవీలర్ సేల్స్

By Ravi

జపనీస్ టూవీలర్ కంపనీ సుజుకి మోటార్‌సైకిల్ ఇండియా గడచిన నెలలో ప్రోత్సాహకర అమ్మకాలను నమోదు చేసుకుంది. సెప్టెంబర్ 2014లో సుజుకి టూవీలర్ అమ్మకాలు అంతకు ముందు సంవత్సరం ఇదే సమయంతో పోల్చుకుంటే 7.35 శాతం వృద్ధిని సాధించాయి.

సుజుకి మోటార్‌సైకిల్ సెప్టెంబర్ 2013లో 41,799 యూనిట్లను విక్రయించగా, సెప్టెంబర్ 2014లో 44,873 యూనిట్లను విక్రయించింది. సుజుకి మోటార్‌సైకిల్ ఇండియా గడచిన రెండేళ్ల నుంచి భారత మార్కెట్లో స్థిరమైన వృద్ధిని సాధిస్తూ వస్తోంది.

ఈ అమ్మకాల వృద్ధిపై సుజుకి మోటార్‌సైకిల్ ఇండియా లిమిటెడ్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ అతుల్ గుప్తా వ్యాఖ్యానిస్తూ.. భారత మార్కెట్ నుంచి తమ అన్ని ఉత్పత్తులకు మంచి స్పందన లభిస్తోందని, పెరుగుతున్న వినియోగదారుని సంతృప్తి (కస్టమర్ శాటిస్‌ఫాక్షన్) వలన మార్కెట్లో సానుకూల ప్రచారం కొనసాగుతోందని, తాము ఇటీవలే విడుదల చేసిన జిక్సర్ బైక్ తమ వృద్ధికి మరింత సహకరించగలదని ఆయన ధీమా వ్యక్తం చేశారు.

Suzuki
Most Read Articles

English summary
Suzuki Motorcycle India Pvt. Ltd., a subsidiary of one of the world’s leading two-wheeler manufacturer Suzuki Motor Corporation, registered a 7.35% increase in their September 2014 sales figures as compared to September 2013. Suzuki Motorcycle sold 44,873 units in September 2014 as opposed to 41,799 units in September 2013, recording a strong growth in its overall sales. Suzuki Motorcycles has maintained a consistent growth path over the last couple of years.
Story first published: Wednesday, October 1, 2014, 17:20 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X