ప్రపంచ వ్యాప్తంగా 63.9 లక్షల టొయోటా వాహనాలు వెనక్కి

By Ravi

జపనీస్ కార్ కంపెనీ టొయోటాను రీకాల్ భూతం వెంటాడుతోంది.. ప్రపంచపు అగ్రగామి కార్ కంపెనీల్లో టాప్ 3 పేర్లలో వినిపించే పేరు 'టొయోటా'. అలాంటి ప్రతిష్టాత్మక కార్ బ్రాండ్ తయారు చేసే ఉత్పత్తుల్లో ఇప్పుడు నాణ్యతాపరమైన సమస్యలు తలెత్తున్నాయి.

నాణ్యతాపరమైన సమస్యల వలన టొయోటా ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా 63.9 లక్షల వాహనాలను వెనక్కు పిలిపిస్తోంది (రీకాల్). రీకాల్ చేసిన వాహనాల్లో మొత్తం 27 రకాల మోడళ్లు ఉన్నాయి. ఒక్కో మోడల్‌లో ఒక్కోరకమైన సమస్య ఉంది.

Toyota Recall

ఇంజన్ స్టార్టర్లలోని సమస్యల వల్ల అగ్నిప్రమాదాలు, యాక్సిడెంట్ల వల్ల ఆర్ఏవీ 4, కరోలా, యారిస్, మాట్రిక్స్, హైలాండర్ వంటి మోడల్స్ సహా మొత్తం 27 మోడళ్లను టొయోటా రీకాల్ చేసింది. విండ్ షీల్డ్ వైపర్ మోటార్స్, స్టీరింగ్ కాలమ్ బ్రాకెట్స్, ఇంజన్ స్టార్టర్స్, ఎయిర్ బాగ్స్‌కి కనెక్ట్ అయిన కేబుల్స్ వంటి పలు అంశాల వాలన ఆయా వాహనాల్లో సమస్యలు ఉన్నట్లు కంపెనీ గుర్తించింది.

టొయోటా చరిత్రలోనే అతిపెద్ద రీకాల్ కావటం గమనార్హం. కేవలం ఎయిర్ బ్యాగ్స్ సమస్యల వల్లనే 35 లక్షల వాహనాలు రీకాల్ చేస్తుండగా, సీట్ రెయిల్స్ సమస్యల వల్ల 16.7 లక్షల వాహనాలను రీకాల్ చేస్తున్నట్లు కంపెనీ పేర్కొంది. అమెరికన్ ఆటో దిగ్గజం జనరల్ మోటార్స్ కూడా ఇటీవలే ప్రపంచ వ్యాప్తంగా ఇగ్నిషన్ స్విచ్ సమస్య కారణంగా 26 లక్షల వాహనాలను రీకాల్ చేసిన సంగతి తెలిసినదే.

Most Read Articles

English summary
Toyota Motor Corp has announced its second-largest recall on Wednesday. Company will recall 6.39 million vehicles globally due to various issues.
Story first published: Thursday, April 10, 2014, 12:47 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X