ట్రైయంప్ 250సీసీ మోటార్‌సైకిల్ ప్లాన్స్ ఏమయ్యాయ్?

By Ravi

బ్రిటన్‌కు చెందిన ప్రముఖ మోటార్‌సైకిళ్ల తయారీ కంపెనీ 'ట్రైయంప్' ఏషియన్ మార్కెట్ల (ప్రత్యేకించి భారత మార్కెట్) కోసం ఓ 250సీసీ మోటార్‌సైకిల్‌ను అభివవృద్ధి చేస్తున్నట్లు మనం ఇదివరకటి కథనాల్లో చదువుకున్నాం. అయితే, ట్రైయంప్ ఇప్పుడు ఆ ప్లాన్స్‌ను విరమించుకున్నట్లు తెలుస్తోంది.

ట్రైయంప్ ప్రస్తుతం మార్కెట్లో విక్రయిస్తున్న లగ్జరీ మోటార్‌సైకిళ్లన్నీ కూడా అధిక ధరను కలిగి ఉన్నాయి. ఈ నేపథ్యంలో, ట్రైయంప్ క్వార్టర్ లీటర్ (250సీసీ) ఇంజన్‌ను ప్రవేశపెట్టి, దానిని స్థానికంగానే ఉత్పత్తి చేయటం ద్వారా మాస్ మార్కెట్ సెగ్మెంట్లోకి ప్రవేశించాలని గతంలో కంపెనీ సన్నాహాలు చేసింది.

Triumph 250cc Motorcycle Plan Shelved

కర్ణాటకలోని బెంగుళూరుకి సమీపంలో నర్సాపూర్ వద్ద ట్రైయంప్ ఏర్పాటు చేసిన ఉత్పత్తి కేంద్రంలో తొలుతగా 250సీసీ పారలల్ ట్విన్-సిలిండర్ మోటార్‌సైకిల్‌ను తయారు చేయాలని భావించారు. కానీ ఇప్పుడు ఆ ప్లాన్ వాయిదా పడింది. ఇందుకు గల కారణాలను మాత్రం ట్రైయంప్ ఇండియా వెల్లడించడం లేదు.

ట్రైయంప్ ఉత్పత్తులు సరసమైన ధరకే లభ్యమయ్యే అవకాశాలు చాలా తక్కువ. ఒకవేళ ట్రైయంప్ ఇండియా 250సీసీ బైక్‌ను తయారు చేసినప్పటికీ, ఇప్పటికే ఈ సెగ్మెంట్లో లభిస్తున్న ఇతర 250సీసీ మోటార్‌సైకిళ్లకు ధీటుగా ట్రైయంప్ తమ ఉత్పత్తి ధరను ఖరారు చేయటం సాధ్యం కాకపోవచ్చు. ఈ పరిస్థితులను అధ్యయనం చేసిన ట్రైయంప్ తమ ప్లాన్‌ను డ్రాప్ చేసుకున్నట్లు తెలుస్తోంది.

ఇదిలా ఉండగా.. ట్రైయంప్ ఈనెల 18వ తేదీన ఇండియాలో మరో కొత్త ఉత్పత్తి విడుదల చేయనుంది. ఆ మోటార్‌సైకిల్ ఏమై ఉంటుందా అని ఇప్పుడు సర్వత్రా ఆసక్తి నెలకొని ఉంది. లేటెస్ట్ అప్‌డేట్స్ కోసం తెలుగు డ్రైవ్‌స్పార్క్‌ను గమనిస్తూ ఉండండి.

Most Read Articles

English summary
Triumph had planned to develop a new 250cc engine, which will power a couple of motorcycles. These motorcycles were to be manufactured and sold in the Asian market itself. However, it has come to our understanding that Triumph has shelved their quarter-litre plans.
Story first published: Saturday, September 13, 2014, 15:05 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X