హైదరబాద్‌లో ట్రైయంప్ డీలర్‌షిప్ ప్రారంభం

భారత లగ్జరీ బైక్ సెగ్మెంట్లోకి తాజాగా ప్రవేశించిన ప్రముఖ బ్రిటీష్ మోటార్‌సైకిల్ 'బ్రాండ్ ట్రైయంప్', దేశీయ విపణిలో తమ రెండవ డీలర్‌షిప్ కేంద్రాన్ని ఆంధ్రప్రదేష్ రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో ప్రారంభించింది (మొదటి షోరూమ్‌ను ఇటీవలే బెంగుళూరులో ప్రారంభించారు). హైదరాబాద్‌కు చెందిన రెబల్ మోటార్‌సైకిల్స్ ఈ డీలర్‌షిప్‌ను నిర్వహిస్తోంది. బెంజారాహిల్స్‌‌లో ఈ డీలర్‍‌‌షిప్‌ను ఏర్పాటు చేశారు.

రెబల్ మోటార్‌సైకిల్స్ ట్రైయంప్ డీలర్‌షిప్‌లో కొత్త వాహనాల సేల్స్‌తో పాటుగా సర్వీస్ మరియు స్పేర్ పార్ట్‌లను అలాగే ట్రైయంప్ బ్రాండెడ్ యాక్ససరీలు, రైడ్ గేర్‌లను కూడా ఆఫర్ చేయనున్నారు. హైదరాబాద్ షోరూమ్ ప్రారంభానికి ముందే 50 బైక్‌లు బుక్ అయ్యాయని ట్రయంప్ ఇండియా మేనేజింగ్ డెరైక్టర్ విమల్ సుంబ్లీ తెలిపారు. మొత్తం పది మోడల్స్‌ను అందుబాటులో ఉంచామని, వీటి ధరలు రూ.5.9 లక్షల నుంచి రూ.20 లక్షల రేంజ్‌లో ఉన్నాయని ఆయన వివరించారు (అన్ని ధరలు ఎక్స్-షోరూమ్, ఢిల్లీ).

ఇది కూడా చదవండి: ట్రైయంప్ మోటార్‌సైకిళ్ల కొనుగోలుకు హెచ్‌డిఎఫ్‌సి లోన్స్

Triumph Motorcycles

ట్రైయంప్ గడచిన నవంబర్ నెలాఖరులో భారత మార్కెట్లోకి అధికారికంగా ప్రవేశించి, 10 కొత్త ఉత్పత్తులను విడుదల చేసింది. ఇందులో ఆరు మోడళ్లను సికెడి (కంప్లీట్లీ నాక్డ్ డౌన్) రూట్లో విడిభాగాలను దిగుమతి చేసుకొని భారత మార్కెట్లో అసెంబ్లింగ్ చేయనున్నారు. అవి - ట్రైయంప్ బోన్నెవిల్లె, ట్రైయంప్ బోన్నెవిల్లే టి100, ట్రైయంప్ డేటోనా 675ఆర్, ట్రైయంప్ స్ట్రీట్ ట్రిపుల్, ట్రైయంప్ స్పీడ్ ట్రిపుల్, ట్రైయంప్ త్రక్స్టన్. మార్కెట్లో వీటి ధరలు రూ.5.7 లక్షల నుంచి రూ.11.4 లక్షల (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ) రేంజ్‌లో ఉన్నాయి.

ఇది కూడా చదవండి: ట్రైయంప్ మోటార్‌సైకిళ్ల మోడళ్లు, ధరలు మరియు ఇతర వివరాలు

మిగిలిన నాలుగు మోడళ్లను సిబియూ (కంప్లీట్లీ బిల్ట్ యూనిట్) రూట్లో పూర్తిగా విదేశాల్లో తయారైన బైక్‌లను ఇండియాకు దిగుమతి చేసుకొని విక్రయించనున్నారు. అవి - ట్రైయంప్ రాకెట్ 3 రోడ్‌స్టర్, ట్రైయంప్ టైగర్ ఎక్స్‌ప్లోరర్, ట్రైయంప్ టైగర్ 800 ఎక్స్‌సి, ట్రైయంప్ థండర్‌‌బర్డ్ స్ట్రోమ్. వీటి ధరలు రూ.20 లక్షల (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ) వరకు ఉన్నాయి.

Most Read Articles

English summary
Iconic British motorcycle brand Triumph has opened a dealership facility in Hyderabad named Rebel Motorcycles. The motorcycle manufacturer plans to set up nine dealerships in India by March 2014. The first one was set up in Bangalore. 
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X