ఆగస్ట్ 20న టీవీఎస్ స్కూటీ జెస్ట్ విడుదల

By Ravi

ప్రముఖ దేశీయ టూవీలర్ బ్రాండ్ 'టీవీఎస్' గడచిన ఫిబ్రవరిలో జరిగిన 2014 ఆటో ఎక్స్‌పోలో ప్రదర్శించిన 110సీసీ స్కూటర్ 'టీవీఎస్ స్కూటీ జెస్ట్'ను త్వరలోనే మార్కెట్లో విడుదల చేయనున్నట్లు గతంలో టీవీఎస్ మోటార్ కంపెనీ వైస్ ప్రెసిడెంట్ జె.ఎస్. శ్రీనివాసన్ (సేల్స్) వెల్లడించిన సంగతి తెలిసినదే. కాగా.. తాజా అప్‌డేట్ ప్రకారం, ఈ స్కూటర్ ఆగస్ట్ 20న మార్కెట్లో విడుదల కానుంది.

ప్రస్తుతం టీవీఎస్ అందిస్తున్న స్కూటీ పెప్‌కు ఫేస్‌లిఫ్ట్ వెర్షనే ఈ కొత్త స్కూటీ జెస్ట్. స్టయిలిష్ బూమరాంగ్ షేప్డ్ ఎల్ఈడి ఇండికేటర్ ల్యాంప్స్, కొత్త రియర్ స్టాఫ్ ల్యాంప్ డిజైన్, కొత్త గ్రాబ్ హ్యాండిల్ బార్స్ వంటి డిజైన్ మార్పులను ఇందులో గమనించవచ్చు. స్కూటీ పెప్‌తో పోల్చుకుంటే, జెస్ట్‌లో ఈ కాస్మోటిక్ మార్పులతో పాటుగా మరింత విశాలమైన సీట్, పెద్ద ఫుట్ బోర్డ్, 19 లీటర్ అండర్ సీట్ స్టోరేజ్, హెవీ బాడీ వంటి మార్పులు కూడా ఉన్నాయి.

TVS Scooty Zest

టీవీఎస్ స్కూటీ జెస్ట్ స్కూటర్‌లో 109.7సీసీ, ఎయిర్-కూల్డ్, సింగిల్ సిలిండర్ ఇంజన్‌ను ఉపయోగించారు (వెగో స్కూటర్లో ఉపయోగించిన ఇంజన్). ఈ ఇంజన్ గరిష్టంగా 7500 ఆర్‌పిఎమ్ వద్ద 8 హెచ్‌పిల శక్తిని, 5500 ఆర్‌పిఎమ్ వద్ద 8 ఎన్ఎమ్‌ల టార్క్‌ను ఈ ఇంజన్ సివిటి (కంటిన్యూస్లీ వేరియబల్ ట్రాన్సిమిషన్) గేర్‌బాక్స్‌తో అనుసంధానం చేయబడి ఉంటుంది.

వాస్తవానికి, టీవీఎస్ వెగో ఛాస్సిస్, వీల్‌బేస్, టెలిస్కోపిక్ ఫోర్క్స్‌లనే జెస్ట్ స్కూటర్‌లో కూడా ఉపయోగించారు. ఇది లీటరు పెట్రోల్‌కు గరిష్టంగా 62 కిలోమీటర్ల మైలేజీనిస్తుందని కంపెనీ పేర్కొంది. అండర్ సీట్ లైట్, మొబైల్ ఫోన్ చార్జింగ్ పాయింట్ వంటి పలు విశిష్టమైన ఫీచర్లు ఈ స్కూటర్ సొంతం. లేటెస్ట్ అప్‌డేట్స్ కోసం తెలుగు డ్రైవ్‌స్పార్క్‌ను గమనిస్తూ ఉండండి.

Most Read Articles

English summary
TVS India had showcased several products at the 2014 Auto Expo, which was held in New Delhi. Among them was the Zest scooter, which they plan to launch on the 20th of August, 2014. Every manufacturer is trying to capture the scooter segment in India, which is ever growing.
Story first published: Monday, August 4, 2014, 14:04 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X