చెన్నై ప్లాంట్‌లో తొలి ఉత్పత్తి 'యమహా ఆల్ఫా' స్కూటరే

By Ravi

జపాన్‌కు చెందిన ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ కంపెనీ యమహా మోటార్ ఇండియా, తమిళనాడు రాజధాని చెన్నైలో ఓ కొత్త ఉత్పత్తి కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్న సంగతి తెలిసినదే. వచ్చే నవంబర్ నెల నుంచి ఈ ప్లాంట్‌లో ఉత్పత్తి ప్రారంభం కానుంది. యమహా చెన్నై ద్విచక్ర వాహన కేంద్రం నుంచి తొలిసారిగా మార్కెట్లోకి రానున్న ఉత్పత్తి యమహా ఆల్ఫా (Yamaha Alpha) స్కూటర్.

ప్రస్తుతం యమహా ఇండియా ఈ స్కూటర్‌ను గ్రేటర్ నోయిడాలోని సర్జాపూర్ ప్లాంట్‌లో ఉత్పత్తి చేస్తోంది. ఇకపై ఈ స్కూటర్‌ను సర్జాపూర్ ప్లాంట్‌తో పాటుగా చెన్నై ప్లాంట్‌లో కూడా ఉత్పత్తి చేయనున్నారు. యమహా తమ స్కూటర్ల తయారీ కోసం సర్జాపూర్ ప్లాంట్‌లో మొత్తం మహిళా సిబ్బందినే ఉపయోగిస్తున్న సంగతి తెలిసినదే. అదే విధంగా చెన్నై ప్లాంట్‌లో ఈ స్కూటర్ కోసం యమహా మహిళలనే నియమించనుంది.


చెన్నై ప్లాంట్ పూర్తిస్థాయిలో నిర్వహణలోకి వస్తే, భారత్‌లో యమహా ఉత్పత్తి సామర్థ్యం మరింత పెరిగే అవకాశం ఉంది. సర్జాపూర్, ఫరీదాబాద్‌లలోని రెండు ప్లాంట్ల సాయంతో యమహా ప్రస్తుతం సాలీనా 12 లక్షల ద్విచక్ర వాహనాలను ఉత్పత్తి చేస్తోంది. కాగా.. సాలీనా 18 లక్షల ఉత్పత్తి సామర్థ్యంతో ఏర్పాటు చేస్తున్న చెన్నై ప్లాంట్ కూడా నిర్వహణలోకి వస్తే, యమహా ఉత్పత్తి సామర్థ్యం సాలీనా 30 లక్షల యూనిట్లకు పెరుగుతుంది.

ఇక యమహా ఆల్ఫా స్కూటర్ విషయానికి వస్తే.. ఈ ఏడాది ఫిబ్రవరిలో జరిగిన 2014 ఢిల్లీ ఆటో ఎక్స్‌పోలో యమహా తొలిసారిగా ఈ స్కూటర్‌ను ఆవిష్కరించింది. యమహా ఆల్ఫా ప్రస్తుతం కంపెనీ అందిస్తున్న రే, రే జెడ్ స్కూటర్ల మాదిరిగా కాకుండా హోండా యాక్టివా, టీవీఎస్ జూపిటర్ మోడళ్ల మాదిరిగా ఫ్యామిలీ డిజైన్‌ను కలిగి ఉంటుంది.

Yamaha Alpha

ఈ స్కూటర్‌లో ఎయిర్-కూల్డ్, 4-స్ట్రోక్, 113సీసీ ఇంజన్‌ను ఉపయయోగించారు. ఈ ఇంజన్ గరిష్టంగా 7500 ఆర్‌పిఎమ్ వద్ద 7.1 పిఎస్‌ల శక్తిని, 5000 ఆర్‌పిఎమ్ వద్ద 8.1 ఎన్ఎమ్‌ల టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్ సివిటి (కంటిన్యూస్లీ వేరియబల్ ట్రాన్సిమిషన్) ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో అనుసంధానం చేయబడి ఉంటుంది.

ఈ స్కూటర్‌లో 21 లీటర్ల అండర్ సీట్ స్టోరేజ్ స్పేస్ ఉంటుంది. దీని ఫ్యూయెల్ ట్యాంక్ కెపాసిటీ 5.2 లీటర్లు. ఇది లీటరుకు 62 కి.మీ. మైలేజీనిస్తుందని కంపెనీ పేర్కొంది. దీని మొత్తం బరువు 104 కిలోలు. ఇది బ్లాక్, గ్రే, వైట్, రెడ్ మరియు మాగెంటా కలర్లలో లభిస్తుంది.

Most Read Articles

English summary
Yamaha Motors upcoming new manufacturing plant at Chennai, that will go on stream this November, will likely begin production with the Alpha scooter.
Story first published: Monday, July 28, 2014, 14:32 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X