యమహా 'చవక బైక్' ప్రాజెక్ట్ పేరు ఇంద్ర

By Ravi

జపనీస్ టూవీలర్ కంపెనీ ఇండియా యమహా మోటార్, ప్రపంచంలో కెల్లా అత్యంత చవకైన కమ్యూటర్ మోటార్‌సైకిల్‌ను భారత్‌లో ఉత్పత్తి చేసేందుకు సన్నాహాలు చేస్తోందని తెలుగు డ్రైవ్‌స్పార్క్ ఇదివరకటి కథనాల్లో ప్రచురించిన సంగతి తెలిసినదే. సుమారు 500 డాలర్ల (సుమారు రూ.30,000) ధరతో ఓ బడ్జెట్ మోటార్‌సైకిల్‌ను ప్రవేశపెట్టాలని యమహా యోచిస్తోంది.

భారతదేశంలో యమహా తయారు చేయనున్న ఈ లో-కాస్ట్ మోటార్‌సైకిల్ ప్రాజెక్ట్‌కు ఇంద్ర (INDRA) అనే పేరును ఖరారు చేశారు. ఇంద్ర అంటే.. ఇన్నోవేటివ్ అండ్ న్యూ డెవలప్‌మెంట్ బేస్డ్ ఆన్ రెస్పాన్సిబిల్ అనలైసిస్ అని అర్థం. అంటే.. బాధ్యతాయుతమైన అధ్యయనం ఆధారంగా చేసుకొని క్రియాత్మక, నూతన అభివృద్ధిని సాధించించడం అని అర్థం.

Yamaha Bike

ఉత్తరప్రదేశ్‌లోని సూరజ్‌పూర్‌లో గడచిన సంవత్సరం ఫిబ్రవరిలో ఏర్పాటు చేసిన యమహా మోటార్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఇండియా(వైఎమ్ఆర్‌ఐ) ఈ చవక్ బైక్‌ను అభివృద్ధి చేస్తోందని గతంలో ఇండియా మయహా మేనేజింగ్ డైరెక్టర్ తోషికజు కోబయాషి తెలిపారు. తొలుతగా ఈ బైక్‌ను భారత మార్కెట్లోను ఆ తర్వాత ఆఫ్రికా, లాటిన్ అమెరికా వంటి పలు అంతర్జాతీయ మార్కెట్లో కూడా విడుదల చేస్తా చేస్తామని ఆయన చెప్పారు.

తాము ఉత్పత్తి చేయాలనుకుంటున్న ఈ చవక బైక్‌ను భారత్‌లోనే తయారు చేయటం వలన, దీని ఉత్పాదక వ్యయం తక్కువగా ఉంటుందని, ఫలితంగా సరసమైన ధరకే దీనిని విక్రయించేందుకు అవకాశం ఏర్పడుతుందని ఇండియా యమహా మోటార్ సీఈవో, ఎమ్‌డి, హిరోయుకి సుజుకి తెలిపారు.

యమహా ఇంద్ర బైక్ ప్రాజెక్టులో కంపెనీతో పాటుగా విడిభాగాలను సరఫరా చేసే వెండర్లు కూడా భాగం పంచుకోనున్నారు. ఈ లో-కాస్ట్ బైక్‌ని చెన్నైలో యమహా కొత్తగా ప్రారంభించనున్న ప్లాంట్‌లో ఉత్పత్తి చేయనున్నారు. ఈ బైక్ కోసం కీలక భాగాలను సప్లయ్ చేసే 8 ఇన్-క్యాంపస్ వెంటర్లు ఎక్కువగా లబ్ధి పొందనున్నట్లు సమాచారం. సప్లయ్ చైన్‌పై ఆదా చేసుకోగలిగినట్లయితే, సరసమైన ధరకే బైక్‌ను అందించవచ్చనేది యమహా లాజిక్. ఇందులో 100-110సీసీ ఇంజన్‌ను ఉపయోగించవచ్చని అంచనా. లేటెస్ట్ అప్‌డేట్స్ కోసం తెలుగు డ్రైవ్‌స్పార్క్‌ను గమనిస్తూ ఉండండి.

Most Read Articles

English summary
Yamaha Motor Research and Development India Pvt. Ltd. (YMRI) in Surajpur, State of Uttar Pradesh is working on a low-cost commuter motorcycle. This Yamaha low-cost motorcycle project is named as INDRA (Innovative and New Development based on Responsible Analysis).
Story first published: Tuesday, November 4, 2014, 14:19 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X