వీడియో: యమహా ఆర్25 బైక్ ఫీచర్స్, స్పెసిఫికేషన్స్

By Ravi

జపనీస్ టూవీలర్ కంపెనీ యమహా ఇటీవలే ఇండోనేషియాలో తమ కొత్త 250సీసీ స్పోర్ట్స్ బైక్ 'యమహా వైజెడ్ఎఫ్-ఆర్25'ను విడుదల చేసిన సంగతి తెలిసినదే. వచ్చే ఏడాది నాటికి ఈ 250సీసీ బైక్ ఇండియన్ మార్కెట్లో కూడా విడుదల కానుంది.

ఈ నేపథ్యంలో యమహా ఆర్25 ట్రాక్ టెస్ట్‌కు సంబంధించిన ఓ వీడియోని కంపెనీ విడుదల చేసింది. ఇదే వీడియోలో తమ యమహా ఆర్25 బైక్‌కు సంబంధించిన ఫీచర్లు, స్పెసిఫికేషన్లను కూడా కంపెనీ వివరించింది.

యమహా ఆర్25 బైక్‌లో సరికొత్త 250సీసీ ఇంజన్‌ను ఉపయోగించారు. ఈ ఇంజన్ డయాసిల్ (డై కాస్టింగ్ అల్యూమినియం సిలికాన్) అనే విశిష్టమైన సిలిండర్లను ఉపయోగించుకుంటుంది. దీని వలన ఇంజన్ బరువు తగ్గడమే కాకుండా, వేడి కూడా తక్కువగా ఉంటుంది. యమహా ఓ 2-సిలిండర్ ఇంజన్‌లో ఈ తరహా టెక్నాలజీని ఉపయోగించడం ఇదే మొట్టమొదటిసారి.

ఈ బైక్‌లోని 249సీసీ, లిక్విడ్ కూల్డ్, 2-సిలిండర్, ఫోర్-స్ట్రోక్ ఇంజన్ గరిష్టంగా 12,000 ఆర్‌పిఎమ్ వద్ద 35 హార్స్ పవర్‌ల శక్తిని, 10,000 ఆర్‌పిఎమ్ వద్ద 22.6 న్యూటన్ మీటర్ల టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్ 6-స్పీడ్ గేర్‍‌బాక్స్‌తో అనుసంధానం చేయబడి ఉంటుంది. యమహా అందిస్తున్న వైజెడ్ఆర్-ఎమ్1 మోటోజిపి రేస్ బైక్ నుంచి స్ఫూర్తి పొంది ఈ ఆర్25 బైక్‌ను డిజైన్ చేశారు. మనం కూడా ఈ వీడియోని చూసేద్దాం రండి..!
<center><iframe width="100%" height="450" src="//www.youtube.com/embed/QpNul8IKQys?rel=0" frameborder="0" allowfullscreen></iframe></center>

Most Read Articles

English summary
Ever since the launch of Yamaha's quarter-litre motor cycle, there is an exciting news or buzz regarding their offering. The R25 was showcased at the 2014 Auto Expo held in New Delhi, it was followed by its launch in Indonesia. Now the Japanese manufacturer has released a video of its 250cc in-line two, liquid cooled engine.&#13;
Story first published: Friday, June 20, 2014, 10:34 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X