2014లో 34 శాతం పెరిగిన యమహా బైక్ సేల్స్

By Ravi

జపనీస్ టూవీలర్ కంపెనీ యమహా మోటార్ ఇండియా గడచిన డిసెంబర్ నెలలో ప్రోత్సాహకర అమ్మకాలను నమోదు చేసింది. కంపెనీ అందిస్తున్న యమహా రే, రే జెడ్ స్కూటర్లతో పాటుగా యమహా స్పోర్ట్స్ బైక్‌లు కొనగోలుదారులను చక్కగా ఆకట్టుకుంటున్నాయి. మొత్మమ్మీద 2013 సంతవ్సరం కంపెనీకు ఓ చక్కటి సంవత్సరంగా నిలిచిపోనుంది.

గడచిన డిసెంబర్‌తో ముగిసిన 2013లో యమహా మొత్తం అమ్మకాలు 34 శాతం వృద్ధి చెంది 6,51,487 యూనిట్లుగా నమోదయ్యాయి. అంతకు ముందు సంవత్సరంలో ఇవి 4,86,810 యూనిట్లుగా ఉన్నాయని కంపెనీ ఓ ప్రకటనలో పేర్కొంది. 2013లో యమహా దేశీయ మార్కెట్లో అమ్మకాలు 32.6 శాతం వృద్ధి చెంది 3,48,346 యూనిట్ల నుంచి 4,61,814 యూనిట్లకు పెరిగాయి. ఇదే సమయంలో ఎగుమతులు 37 శాతం వృద్ధి చెంది 138,464 యూనిట్ల నుంచి 189,673 యూనిట్లకు పెరిగాయి.

ఇది కూడా చదవండి: యమహా రే ఫెమినా మిస్ ఇండియా 2013 ఫొటోలు


డిసెంబర్ 2012తో పోల్చుకుంటే డిసెంబర్ 2013 నెలలోనే యమహా దేశీయ అమ్మకాలు 58 శాతం వృద్ధి చెంది 25,123 యూనిట్ల నుంచి 39,777 యూనిట్లకు పెరిగాయి. ఈ సమయంలో ఎగుమతులు 13 శాతం వృద్ధి చెంది 22,360 యూనిట్ల నుంచి 25,220 యూనిట్లకు పెరిగాయి. మొత్మమ్మీద డిసెంబర్ 2013లో కంపెనీ అమ్మకాలు 37 శాతం పెరిగి 47,483 యూనిట్ల నుంచి 64,997 యూనిట్లకు పెరిగాయి.

యమహా తొలిసారిగా 1985లో భారత మార్కెట్లోకి ప్రవేశించింది. యమహా ఇండియాకు ఉత్తరప్రదేశ్‌లోని సర్జాపూర్, హర్యానాలోని ఫరీదాబాద్‌లలో ఉత్పత్తి కేంద్రాలున్నాయి. ఈ ప్లాంట్లలో తయారైన మోడళ్లను దేశీయ మార్కెట్లో విక్రయించడమే కాకుండా, పొరగు దేశాలకు కూడా కంపెనీ ఎగుమతి చేస్తుంది. యమహాకు దేశవ్యాప్తంగా 400 లకు పైగా డీలర్‌షిప్ కేంద్రాలున్నాయి.

ప్రస్తుతం యమహా దేశీయ విపణిలో విమ్యాక్స్ (1,679cc), వైజెడ్ఎఫ్-ఆర్1 (998cc), ఎఫ్‌జెడ్1 (998cc), ఫేజర్ (153cc), ఎఫ్‌జెడ్-ఎస్ (153cc), ఎఫ్‌జెడ్ (153cc), ఎస్‌జెడ్-ఎక్స్ & ఎస్‌జెడ్-ఆర్ (153cc), వైజెడ్ఎఫ్-ఆర్15 వెర్షన్ 2.0 (150cc), ఎస్ఎస్125 (123cc), వైబిఆర్ 125 (123cc), వైబిఆర్ 110 (106cc), క్రక్స్ (106cc) మరియు రే (113cc) స్కూటర్లను విక్రయిస్తోంది.

Most Read Articles

English summary
The year 2013 was certainly a hit for Yamaha Motor India Sales Pvt. Ltd. as the Company witnessed robust growth with its successful entry into the scooter segment through the launch of Ray and Ray Z, which were instrumental in boosting its sales to new highs. The Company strengthened its position by clocking sales of 651,487 units in 2013, compared to 486,810 units in 2012, registering a growth of 34% over the last year.
Story first published: Friday, January 3, 2014, 12:00 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X