1.5 లక్షలోపు గల 200సీసీ బైక్‌లు:ధర మరియు స్పెసిఫికేషన్స్

By Anil

భారతదేశపు యొక్క ద్విచక్ర వాహనాల రంగం రోజురోజుకు కొత్త పుంతలు తొక్కుతోంది. ప్రస్తుతం ద్విచక్ర వాహన తయారిదారులు వినియోగదారులకు అతి ఉత్తమమైన ఫీచర్‌లు గల బైక్‌లను లక్షా యాభైవేలలోపు ధరలకు అందిచాలనే ఆలోచనలో ఉన్నారు.

200 సీసీ మోటర్ బైక్‌లు మంచి స్టీరింగ్ బ్యాలెన్స్ అందిస్తాయి. అంతే కాకుండా వీటి నుండి మంచి ఫ్యూయల్ కెపాసిటి, హార్స్‌పవర్, బరువు వంటి విభిన్న రకాల స్పెసిఫికేషన్స్‌ను అందిస్తాయి. 200సీసీ బైక్‌లు అందస్తున్న వివిధ రకాల ఆఫర్‌లు గురించి తెలుసుకోవాలని ఉందా అయితే క్రింద గల స్లైడ్స్ మీద క్లిక్ చేయండి.
ఇక్కడ మీరు గమనించినట్లయితే అన్ని ధరలు ( ఎక్స్ షోరూమ్ మరియు అన్-రోడ్ ధరలు ముంబయ్ నుండి ).
ఇక్కడ క్లిక్ చేయండి:మహీంద్ర కొత్త లోగో మోజో అధికారికంగా విడుదల

బజాజ్ పల్సర్ ఎన్.యస్ 200:

బజాజ్ పల్సర్ ఎన్.యస్ 200:

  • ఇంజిన్- 199సీసీ, సింగిల్ సిలిండర్, లిక్విడ్ కూల్డ్
  • పవర్- 23 బి.హెచ్.పి
  • గేర్ బాక్స్- 6-స్పీడ్
  • బరువు- 145 కేజీలు
  • మైలేజ్- 40 కెపియల్
  • ఆన్-రోడ్ ధర-రూ.1,04,265
  • అంతేకాకుండా ఇందులో ముందు మరియు వెనుక వైపున గల చక్రాలకు డిస్క్ బ్రేక్‌లు కలవు, స్పోర్ట్స్ డిజిటల్ స్పీడో మీటర్ మరియు అనలాగ్ ఆర్.పి.ఎమ్ దీని ప్రత్యేకతలు.

    బజాజ్ పల్సర్ ఆర్.ఎస్200:

    బజాజ్ పల్సర్ ఆర్.ఎస్200:

    • ఇంజిన్- 199సీసీ, సింగిల్ సిలిండర్, లిక్విడ్-కూల్డ్
    • పవర్- 24 బి.హెచ్.పి
    • గేర్ బాక్స్- 6-స్పీడ్
    • బరువు- 165 కేజీలు
    • మైలేజ్- 35 కెపియల్
    • ఆన్-రోడ్ ధర-రూ.1,50,327 (ఎ.బి.యస్); రూ.-1,37,495(స్టాండర్డ్)
    • ఎ.బి.యస్ అనగా యాంటిలాక్ బ్రేకింగ్ సిస్టమ్.

      బజాజ్ పల్సర్ ఎ.యస్ 200:

      బజాజ్ పల్సర్ ఎ.యస్ 200:

      • ఇంజిన్- 199సీసీ, సింగిల్ సిలిండర్, లిక్విడ్-కూల్డ్
      • పవర్- 23 బి.హెచ్.పి
      • గేర్ బాక్స్- 6-స్పీడ్
      • బరువు- 153 కేజీలు
      • మైలేజ్- 42 కెపియల్
      • ఆన్-రోడ్ ధర-రూ.1,05,900.
      • ఇందులో ముందు మరియు వెనుక వైపున గల చక్రాలకు డిస్క్ బ్రేక్‌లు కలవు.

        బజాజ్ పల్సర్ 200ఎఫ్:

        బజాజ్ పల్సర్ 200ఎఫ్:

        • ఇంజిన్- 200సీసీ, సింగిల్ సిలిండర్, లిక్విడ్-కూల్డ్
        • పవర్- 21 బి.హెచ్.పి
        • గేర్ బాక్స్- 5-స్పీడ్
        • బరువు- 150 కేజీలు
        • మైలేజ్- 38 కెపియల్
        • ఆన్-రోడ్ ధర-రూ.99,900
        • దీనిలో యాంటి లాక్ బ్రేకింగ్ సిస్టమ్ లేదు కావాలంటే ఏర్పాటు చేసుకోవచ్చు.

          హీరో కరిజ్మా జడ్.ఎమ్.ఆర్:

          హీరో కరిజ్మా జడ్.ఎమ్.ఆర్:

          ఇంత వరకు బజాజ్ మోడల్స్ చుశారు కదా ఇప్పుడు ఇతర మోడల్‌కు చెందిన 1.5 లక్షలోపు గల 200 సీసీ బైక్ హీరో కరిజ్మా జడ్.ఎమ్.ఆర్ మీకోసం దీని ఫీచర్స్. హీరో కరిజ్మా జడ్.ఎమ్.ఆర్ బైక్ ని విడుదల చేసినప్పటి నుండి దాదాపుగా 1,03,458 బైక్‌లను అమ్మినట్లు కంపెని తెలిపింది.

          • ఇంజిన్- 223సీసీ, సింగిల్ సిలిండర్, ఎయిర్-కూల్డ్
          • పవర్- 20 బి.హెచ్.పి
          • గేర్ బాక్స్- 5-స్పీడ్
          • బరువు- 157 కేజీలు
          • మైలేజ్- 40 కెపియల్
          • ఆన్-రోడ్ ధర-రూ.1,26,990.
          • ఇందులో ముందు మరియు వెనుక వైపున గల చక్రాలకు డిస్క్ బ్రేక్‌లు కలవు.

            కెటియమ్ డ్యూక్ 200:

            కెటియమ్ డ్యూక్ 200:

            మరొక అందమైన లుక్‌తో వచ్చిన బైక్ కెటియమ్ డ్యూక్ 200 దీనిని చాలా బాగా హ్యాండిల్ చెయ్యొచ్చు ఒక విధంగా చెప్పాలంటే ఇది యువతకు ఎంతో బాగా సూట్ అవుతుంది.

            • ఇంజిన్- 199సీసీ, సింగిల్ సిలిండర్, లిక్విడ్-కూల్డ్
            • పవర్- 25 బి.హెచ్.పి
            • గేర్ బాక్స్- 6-స్పీడ్
            • బరువు- 136 కేజీలు
            • మైలేజ్- 35 కెపియల్
            • ఆన్-రోడ్ ధర-రూ.1,61,548.
            • కెటియమ్ డ్యూక్ ఆర్‌సి 200:

              కెటియమ్ డ్యూక్ ఆర్‌సి 200:

              • ఇంజిన్- 199సీసీ, సింగిల్ సిలిండర్, లిక్విడ్-కూల్డ్
              • పవర్- 25 బి.హెచ్.పి
              • గేర్ బాక్స్- 6-స్పీడ్
              • బరువు- 147 కేజీలు
              • మైలేజ్- 30 కెపియల్
              • ఆన్-రోడ్ ధర-రూ.1,90,478.
              • తీర్పు:

                తీర్పు:

                చాలా బైక్‌ల గురించి ఇచ్చి మిమ్మల్ని ఏమైనా గందరగోళంలోకి నెట్టినటట్లుందా? ఒక వేళ మీరు మీ బడ్దెట్‌లో మంచి బైక్ కోసం వెతుకుతుంటే ఒక సారి కెటియమ్ డ్యూక్ 200 ని ట్రై చేయండి. ఇది మీ బడ్జెట్‌కు తగ్గ బైక్, ఇది మీకు ఇస్తుంది అత్బుమైన లుక్, మంచి పర్ఫామెన్స్ మరియు దీనిని మెయింటైన్ చేయడం కూడా కాస్త సులభమే. ఇక కెటియమ్ ఆర్‌సి 200 విషయానికి వస్తే ధర కాస్త ఎక్కువే అయినప్పటి ఇందులో కొన్ని ఎక్కువ ఫ్యూచర్‌లు ఉన్నాయి.ఇంకా తక్కువ బడ్జెట్‌లో బైక్ కావాలనుకువారు ఒకసారి బజాజ్ పల్సర్ మోడల్స్ ట్రై చేయండి.

Most Read Articles

English summary
The Indian motorcycle industry has come a long way in recent times. Two-wheeler manufacturers are trying to offer best in class performance below INR 1.5 lakh.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X