భారత్‌లో 125సీసీకి మించిన బైక్‌లలో ఏబిఎస్ తప్పనిసరి!

By Ravi

భారతదేశంలో మోటార్‌సైకిళ్ల వలన జరుగుతున్న ప్రమాదాలు అధికమవుతున్న నేపథ్యంలో, వాటిని అరికట్టే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ఇకపై దేశంలో విక్రయించబడే 125సీసీ ఇంజన్ సామర్థ్యానికి మించిన అన్ని మోటార్‌సైకిళ్లలో ఏబిఎస్ (యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్)ను తప్పనిసరి చేయాలని నిర్ణయించారు.

ఏబిఎస్‌తో కూడిన మోటార్‌సైకిళ్లను ఉపయోగించడం వలన రవాణా భద్రత పెరిగి, రోడ్డు ప్రమాదాల్లో మరణించే వారి సంఖ్య తగ్గే అవకాశం ఉంటుందని అధికారులు భావిస్తున్నారు. భారతదేశంలో మోటార్‌సైకిల్ పరిశ్రమ చాలా పెద్దది. ద్విచక్ర వాహనాల కొనుగోళ్లు కూడా నానాటికి పెరుగుతునే ఉన్నాయి. ఫలితంగా, వాటి వలన కలిగే ప్రమాదల రిస్క్ కూడా పెరుగుతూ వస్తోంది.

రోడ్డు రవాణా మంత్రిత్వ శాఖ నుంచి సేకరించిన దత్తాంశం ప్రకారం, 2013లో సుమారు 39,000 మందికి పైగా ద్విచక్ర వాహన చాలకులు వివిధ రోడ్డు ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోయినట్లు సమాచారం. భారత రోడ్లపై జరుగుతున్న రోడ్డు ప్రమాదాలలో దాదాపు 70 శాతం ప్రమాదాల్లో మోటార్‌సైకిళ్ల ప్రమేయం ఉందని అంచనా. శరీరానికి రక్షణ కవచాలు (ప్రొటెక్టివ్ రైడ్ గేర్), శిరస్త్రాణం (హెల్మెట్) ధరించకపోవటం కూడా ఈ ప్రమాదానికి కారణాలుగా చెప్పుకోవచ్చు.

ABS To Becomes Mandatory

యూరోపియన్ దేశాలలో ఇప్పటికే 125సీసీకి మించి ఇంజన్ సామర్థ్యం కలిగిన అన్ని మోటార్‌సైకిళ్లలో ఏబిఎస్ తప్పనిసరిగా ఉంటుంది. ఇండియా కూడా ఇప్పుడే ఇదే సిస్టమ్‌ను పాటించనుంది. దేశంలో 125సీసీకి మించి ఎక్కువ ఇంజన్ సామర్థ్యం కలిగిన మోటార్‌సైకిళ్లను ఏబిఎస్ లేకుండా విక్రయించడాన్ని చట్టరీత్యా నేరంగా పరిగణించాలని ప్రభుత్వాధికారులు భావిస్తున్నారు.

ఈ నిబంధన పూర్తిస్థాయిలో అమల్లోకి వస్తే, త్వరలోనే అన్ని బజాజ్ పల్సర్ మోటార్‌సైకిళ్లు, హీరో కరిజ్మాలు, హోండా యునికార్న్‌లు మొదలైన మోటార్‌సైకిళ్లన్నీ ఏబిఎస్‌తో లభించే ఆస్కారం ఉంది.

ఏబిఎస్ అంటే ఏమిటి..? అదెలా పనిచేస్తుంది..?
సాదారణ బ్రేకింగ్ సిస్టమ్ (డ్రమ్/డిస్క్)లో రోడ్డుపై అత్యవసరంగా బ్రేక్ వేయాల్సిన పరిస్థితుల్లో బ్రేక్ వేసినప్పుడు టైర్లు తిరిగడం (టైర్ రోలింగ్) ఆగిపోయి టైర్లు రోడ్డపై రాచుకుంటూ, బ్రేకింగ్ దూరం పెరిగి వాహనం జారిపోయే ఆస్కారం ఉంది. అయితే, యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్‌లో అత్యవసర పరిస్థితుల్లో బ్రేక్ వేసినప్పుడు టైర్లు తిరగడం ఆగిపోకుండానే వాహన వేగాన్ని పూర్తిగా నియంత్రించి, బ్రేకింగ్ దూరాన్ని (బ్రేకింగ్ డిస్టన్స్) తగ్గించి ప్రమాదం నుండి తప్పించుకోవడం జరుగుతుంది.

Most Read Articles

English summary
Soon ABS (anti-lock braking system) will become mandatory in India for all the motorcycles with 125cc displacement or bigger. This measure is a response to the increasing number of road-caused deaths among motorbike users and passengers.
Story first published: Wednesday, January 28, 2015, 9:43 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X