బెనెల్లీ టియన్‌టి25 వర్సెస్ కెటియమ్ డ్యూక్ 200: కంపారిజన్

By Anil

200 నుండి 250 సీసీ మధ్య గల టూవీలర్ ఏదంటే ఠపీమని కెటియమ్ డ్యూక్ 200 అని చెప్పవచ్చు. ఎందుకంటే ఈ సెగ్మెంట్లోకి దీనిని మించిన బైక్‌ లేదు కాబట్టి. ఆస్ట్రియన్‌కు చెందిన టూ వీలర్ల తయారీదారులైన కెటి‌యమ్‌కు ఈ సెగ్మెంట్లో తిరుగులేదు. కాని బెనెల్లీ వారు దీనికి పోటిగా టియన్‌టి25 బైకును తీసుకువస్తోంది. ఇది బెనెల్లీ వారి ఉత్పత్తులలో భారతీయ మార్కెట్‌కు అందిస్తున్న సరసమైన టూ వీలర్.

బెనెల్లీ టియన్‌టి మార్కెట్లోకి విడుదల అయితే కెటియమ్‌ డ్యూక్ 200 మోడల్‌తో ధర, డిజైన్, ఇంజన్ స్పెసిఫికేషన్స్, మైలేజ్ మరియు ఫీచర్ల విషయంలో ఎలా పోటిపడనుందో క్రింది కథనం ద్వారా తెలుసుకుందాం రండి.

ధర

ధర

  1. బెనెల్లీ టియన్‌టి 25 ధర రూ. 1.65 లక్షలు(ఉండవచ్చు)
  2. కెటియమ్ డ్యూక్ 200 ధర రూ. 1.51 లక్షలు

రెండు ధరలు ఆన్-రోడ్ (ఢిల్లీ)గా ఇవ్వబడ్డాయి.

బెనెల్లీ టియన్‌టి25 డిజైన్

బెనెల్లీ టియన్‌టి25 డిజైన్

ఈ బెనెల్లీ టియన్‌టి 25 డిజైన్ దీని కన్నా ముందు గల మోడల్ టియన్‌టి300 రూపంతో వచ్చింది. ఇందులో కల్పించిన ఫీచర్స్ పరంగా ఇది కొంచెం అందంగా కనబడుతుంది. ఇకపోతే దీనికి ప్రక్క వైపున గల సైలెన్సర్ కూడా ఇది అందంగా కనపడటానికి ఒక కారణం అని చెప్పవచ్చు.

 కెటియమ్ డ్యూక్ 200 డిజైన్

కెటియమ్ డ్యూక్ 200 డిజైన్

మీరు ఈ కెటియమ్ బైక్‌లను గమనించినట్లయితే దాదాపుగా అన్ని ఒకే డిజైన్‌ను పోలి ఉంటాయి. ప్రస్తుతం భారతీయ మార్కెట్లో ఉత్తమ డిజైన్ గల బైకు కూడా ఇదే. ఇక ఈ డ్యూక్ 200 లో మాత్రం నూతనత్వం సంతరించుకోలేదు.

 బెనెల్లీ టియన్‌టి 25 ఇంజన్

బెనెల్లీ టియన్‌టి 25 ఇంజన్

ఈ సరికొత్ బెనెల్లీ టియన్‌టి25 మోటార్ బైకులో 249 సీసీ గల సింగల్ సిలిండర్ లిక్విడ్ కూల్డ్ ఇంజన్ కలదు.

టియన్‌టి25 శక్తి

టియన్‌టి25 శక్తి

ఈ బెనెల్లీ టియన్‌టి 25 లో గల ఇంజన్ దాదాపుగా 24.1 బిహెచ్‌పి అశ్వ శక్తి మరియు 20.5 ఎన్ఎమ్ అత్యధిక టార్క్‌ను విడుదల చేస్తుంది. దీనికి ఇందులో గల 6-స్పీడ్ గేర్ బాక్స్ ఉపయోగపడుతుంది. ఇది లీటర్ కు దాదాపుగా 35 కిలో మీటర్ల మైలేజ్ ఇవ్వనున్నట్ల తెలిపారు.

 కెటియమ్ డ్యూక్ 200 ఇంజన్

కెటియమ్ డ్యూక్ 200 ఇంజన్

ఇందులో 200 సీసీ గల సింగల్ సిలిండర్ , లిక్విడ్ కూల్జ్ ఇంజన్ కలదు. ఇది దాదాపుగా 25 బిహెచ్‌పి పవర్ మరియు 19 ఎన్ఎమ్ టార్క్‌ను విడుదల చేస్తుంది.

 ట్రాన్స్ మిషన్

ట్రాన్స్ మిషన్

కెటియమ్ డ్యూక్ 200 లో 6-స్పీడ్ గేర్ బాక్స్ కలదు. మరియు ఇది లీటర్ కు 35 కిలో మీటర్ల మైలేజ్‌ను ఇస్తుంది. ఈ రెండు టూ వీలర్లలో పవర్ మరియు మైలేజ్ దాదాపుగా సమానంగా ఉన్నాయి.

బెనెల్లీ టియన్‌టి 25 ఫీచర్లు

బెనెల్లీ టియన్‌టి 25 ఫీచర్లు

  • 16.5-లీటర్ల కెపాసిటి గల ఫ్యూయల్ ట్యాంక్
  • ముందు వైపు క్రిందకు గల ఫ్రంట్ ఫోర్క్స్
  • వెనుక వైపున మోనో షాక్ సస్పెన్షన్
  • వెనుక 140, ముందు 110 సెక్షన్ గల టైర్లు ఇందులో ఉన్నాయి.
  • కెటియమ్ డ్యూక్ 200 ఫీచర్లు

    కెటియమ్ డ్యూక్ 200 ఫీచర్లు

    ఇందులో కూడా చాలా వరకు టియన్‌టి25లో గల ఫీచర్లు ఉన్నాయి.

    • ముందు వైపు క్రిందకు గల ఫ్రంట్ ఫోర్క్స్
    • వెనుక వైపు గల మోనోషాక్ సస్పన్షన్
    • అల్లాయ్ వీల్స్
    • ముందు వైపు 110, వెనుకవైపున 150 సెక్షన్ గల టైర్లు
    • ఫుల్లీ డిజిటల్ ఇంస్ట్రుమెంట్ క్లస్టర్
    • 11-లీటర్ల ఇంధన సామర్థ్యం గల ట్యాంక్.
    • బరువు

      బరువు

      • బెనెల్లీ టియన్‌టి25 150 కిలోల బరువును మోయగలదు.
      • కెటియమ్ డ్యూక్ 200 136 కిలోల బరువును మోయగలదు.
      •  తీర్పు

        తీర్పు

        బెనెల్లీ టియన్‌టి 25 మార్కెట్లో గల అన్ని 200-250సీసీ మధ్య గల టూ వీలర్లకు ఒక విలువైన ఫోటి ఇవ్వగలదు అని చెప్పవచ్చు. ధర, ఇంధన సామర్థ్యం, పవర్ మరియు ఫీచర్లు అన్ని కూడా ఎంతో బాగున్నాయి.

        బెనెల్లీ టియన్‌టి మరియు కెటియమ్‌ డ్యూక్ 200 లలో రెండు కూడా ఉత్తమమైనవే, కాకపోతే కొన్ని చిన్న చిన్న ఫీచర్లు మినహా...

        మరిన్ని టూ వీలర్ల గురించి.

Most Read Articles

English summary
Benelli TNT25 vs KTM Duke 200 Comparison
Story first published: Thursday, December 17, 2015, 11:17 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X