చిత్తూరు జిల్లాలోని సత్యవేడులో హీరో మోటోకార్ప్ ప్లాంట్

By Ravi

భారతదేశపు అగ్రగామి ద్విచక్ర వాహన తయారీ సంస్థ హీరో మోటోకార్ప్ భారతదేశంలో కెల్లా తమ ఆరవ ప్లాంట్‌ను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏర్పాటు చేయనున్నట్లు మనం ఇదివరకటి కథనంలో చదువుకున్నాం. కాగా.. ఇప్పుడు ఆ ప్లాంట్‌ను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని చిత్తూరు జిల్లా సత్యవేడు మండలంలో ఏర్పాట చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి.

ఈ ప్రాంతంలో హీరో మోటో కార్ప్‌ ప్లాంట్ ఏర్పాటుకు కావల్సిన భూమి సిద్దంగా ఉందని ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్‌ కృష్ణారావు తెలిపారు. ఈ మేరకు గత సోమవారం హీరో మోటో కార్ప్‌ ప్రతినిధులు, ప్రభుత్వాధికారులతో ఆయన సచివాలయంలో సమావేశమయ్యారు.

hero land acquisition

చిత్తూరు జిల్లా సత్యవేడు మండలం మాదన్నపాలెం వద్ద మొత్తం 592 ఎకరాల భూమిని హీరో మోటోకార్ప్‌కు అప్పగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఓ అవగాహనా ఒప్పందాన్ని కుదుర్చుకుంది. ఈ ప్లాంట్ ఏర్పాటు కోసం హీరో మోటోకార్ప్ రూ.1,600 కోట్ల పెట్టుబడిని వెచ్చించనుంది. ఈ ప్లాంట్ ఏర్పాటు వలన పరోక్షంగా, ప్రత్యక్షంగా వేలాది మందికి ఉపాధి లభించనుంది.

ఈ కొత్త ప్లాంట్ పూర్తిస్థాయిలో నిర్వహణలోకి వచ్చినట్లయితే, ఈ ప్లాంట్ ప్రతి ఏటా 1.8 మిలియన్ మోటార్‌సైకిళ్లు మరియు సైకిళ్లు ఉత్పత్తి అవుతాయి. ఇది హీరో మోటోకార్ప్‌కు భారతదేశంలో 6వ ప్లాంట్, ఈ ప్లాంట్ పూర్తిస్థాయిలో నిర్వహణలోకి వస్తే, కంపెనీ మొత్తం దేశీయ ఉత్పత్తి సామర్థ్యం 12 మిలియన్ యూనిట్లకు చేరుకుంటుంది.

Most Read Articles

English summary
India's largest two-wheeler maker Hero MotoCorp has finalised land aqusation in Chittore district in Andhra Pradesh to set up a manufacturing plant.
Story first published: Tuesday, March 24, 2015, 16:23 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X