3వ ఎడిషన్ ఇండియా బైక్ వీక్ 2015 ప్రారంభం!

By Ravi

భారతదేశపు అతిపెద్ద బైకర్ ఫెస్టివల్ 'ఇండియా బైక్ వీక్' 2015 ఎడిషన్ శుక్రవారం (ఫిబ్రవరి 20, 2015) నాడు గోవాలో అంగరంగ వైభవంగా ప్రారంభమైంది. ఇదివరకటి రెండు ఎడిషన్లతో పోల్చుకుంటే ఈసారి మరింత గ్రాండ్‌గా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు.

మూడవ ఎడిషన్ ఇండియా బైక్ వీక్ ఫెస్టివల్‌ను కూడా సెకండ్ ఎడిషన్ మాదిరిగానే గోవాలోని వగతోర్ ప్రాంతం వద్ద నిర్వహిస్తున్నారు. భారత్‌లోని సెవంటీ ఈవెంట్ మీడియా గ్రూప్, ఫాక్స్ లైఫ్ సంస్థలు సంయుక్తంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాయి.

india bike week start in goa

ఈ కార్యక్రమాన్ని మా డ్రైవ్‌స్పార్క్ బృందం ప్రత్యక్షంగా కవర్ చేస్తుంది. ఇండియా బైక్ వీక్ ఫెస్టివల్‌లో స్వదేశీయులే కాకుండా, ఇతర దేశాలకు చెందిన బైకర్లు కూడా పాల్గొంటున్నారు. పలు విలాసవంతమైన బైక్ కంపెనీలు తమ ఉత్పత్తులను ప్రదర్శనకు ఉంచాయి.

ప్రపంచంలోని అతిపెద్ద మోటార్‌సైకిల్ కార్యక్రమాల్లో ఒకటైన, అమెరికాలోని సౌత్ డకోటాలో నిర్వహించే వార్షిక 'స్టుర్గిస్ మోటార్‌సైకిల్ ర్యాలీ' నుంచి స్ఫూర్తి పొంది ఇండియా బైక్ వీక్ కార్యక్రమాన్ని రూపొందించారు. ఇండియా బైక్ వీక్‌ను తొలిసారిగా ఫిబ్రవరి 2013లో ప్రారంభించారు. ఆ తర్వాత రెండవ ఎడిషన్‌ను జనవరి 2014లో నిర్వహించారు. ప్రస్తుతం జరుగుతున్నది మూడవ ఎడిషన్. లేటెస్ట్ అప్‌డేట్స్ కోసం తెలుగు డ్రైవ్‌స్పార్క్‌ను గమనిస్తూ ఉండండి.

Most Read Articles

English summary
India Bike Week (IBW) is back with its third edition that promises to be a lot more than just an automobile event.
Story first published: Saturday, February 21, 2015, 9:28 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X