కన్నడ విద్యార్థి అద్బుత సృష్టి: లీటర్ పెట్రోల్‍‌‌తో 360 కిలోమీటర్లు మైలేజ్ ఇవ్వగల స్కూటర్

By Anil

ప్రస్తుతం ఎన్నో టూ వీలర్ సంస్థలు మా టూ వీలర్ అన్ని , ఇన్ని కిలోమీటర్లు మైలేజ్ ఇస్తుందని గొప్పలు పోతుంటాయి. కాని కొన్న తరువాత ఎటువంటి ఫలితం ఉండదు. పెట్రోల్ ఖర్చులు ఎక్కువ అవుతాయని చాలా మంది ఇప్పటికి టూవీలర్‌ను కొనడానికి వెనుకాడుతున్నారు.

కర్నాటకు చెందిన ఒక మెకానికల్ ఇంజనీరింగ్ విద్యార్థి కేవలం లీటర్ పెట్రోల్‌తో 360 కిలో మీటర్లు మైలేజ్ ఇవ్వగల టూ వీలర్‌ను సృష్టించాడు. మరి అతని సృష్టి వెనకున్న అసలు విషయాలను తెలుసుకోవాలని అనుకుంటున్నారా? అయితే క్రింద గల కథనాలను ఓ సారి చూడండి.

లీటర్ పెట్రోల్‍‌‌తో 360 కిలోమీటర్లు మైలేజ్ ఇవ్వగల స్కూటర్

ఇతని పేరు సి.సూరజ్ రాయకర్, ఇతను భాగల్ కోట‍‌‌లోని బసవేశ్వర ఇంజనీరింగ్ కాలేజి‌లో మెకానికల్ ఇంజనీరింగ్ సెకండ్ ఇయర్ చదువుతున్నాడు. ఈ హైబ్రిడ్ స్కూటర్ రూపొందించడానికి కారణం తనకు ఆటోమొబైల్స్ అంటే విరపరీతమైన ఇష్టం ఉందని అందుకే దీనిని తయార చేశాడని తెలిపాడు.

లీటర్ పెట్రోల్‍‌‌తో 360 కిలోమీటర్లు మైలేజ్ ఇవ్వగల స్కూటర్

ఒక పాత టూ వీలర్‌ను ఉపయోగించి అందులో ఎనిమిది బ్యాటరీలను అమర్చి వీటిని ఛార్జ్ చేయడానికి రెండు బ్యాటరీ ఛార్జర్‌లు, మరియు ఒక లీటర్ పెట్రోల్ దీని తయారు చేయడానికి ఉపయోగపడ్డాయి.

లీటర్ పెట్రోల్‍‌‌తో 360 కిలోమీటర్లు మైలేజ్ ఇవ్వగల స్కూటర్

ఒక లీటర్ పెట్రోల్‌ను పూర్తిగా ఇందులో గల బ్యాటరీలను ఛార్జ్ చేయడానికి ఉపయోగిస్తాడు. అనగా ఇంజన్ నుండి వచ్చే పవర్‌ను ఛార్జర్‌ల ద్వారా బ్యాటరీలకు అందుతుంది. ఈ బ్యాటరీల ద్వారా స్కూటర్ నడుస్తుంది.

లీటర్ పెట్రోల్‍‌‌తో 360 కిలోమీటర్లు మైలేజ్ ఇవ్వగల స్కూటర్

ఇలా కేవలం ఒక లీటర్ పెట్రోల్ ద్వారా ఛార్జ్ అయిన బ్యాటరీలు స్కూటర్ దాదాపుగా 360 కిలో మీటర్లు నడవడానికి సహాయపడుతుంది. అయితే ఈ మొత్తం ప్రయోగానికి ఇతనికి గైడెన్స్ ఇచ్చింది డాక్టర్ కుప్పాస్ ఇతని ఫ్రొఫెసర్ అని తెలిపాడు.

లీటర్ పెట్రోల్‍‌‌తో 360 కిలోమీటర్లు మైలేజ్ ఇవ్వగల స్కూటర్

అయితే ఈ ప్రయోగానికి చెందిన వివరాలను ప్రధాన మంత్రికి ఇతను వ్రాతపూర్వకంగా ఉత్తరం వ్రాయగా. ప్రధాన మంత్రి కార్యాలయం నుండి అనుకూలంగా ఉత్తరం వచ్చింది. ఇలాంటి ప్రయోగాలకు సంభందించి పూర్తి సహకారం అందిస్తామని ఆ ఉత్తరం పేర్కొనట్లు తెలిపాడు.

మరిన్ని ఆశక్తికరమైన విశయాలకు
  1. కేవలం పది రుపాయలకే లీటర్ కారు ఫ్యూయల్ తయారు చేసిన సాదారణ కారు మెకానిక్
  2. లీటర్‌కు 40 కిలో మీటర్ల మైలేజ్ ఇవ్వగల టయోటా వారి క్రొత్త కారు

Most Read Articles

English summary
Kannada Student Suraj Raikar Builds 360km Mileage Hybrid Scooter
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X