కెటిఎమ్ డ్యూక్, ఆర్‌సి 390 మోడళ్లకు కొత్త ఎమ్ఆర్ఎఫ్ టైర్లు

By Ravi

ఆస్ట్రియన్ స్పోర్ట్స్ బైక్ కంపెనీ కెటిఎమ్ అందిస్తున్న డ్యూక్ 390, ఆర్‌సి 390 మోటార్‌సైకిళ్ల కోసం కంపెనీ కొత్త టైర్లను ఆఫర్ చేస్తోంది. మరింత మెరుగైన రోడ్ గ్రిప్ కోసం ప్రత్యేకమైన టైర్లను కంపెనీ అందిస్తోంది. సాధారణంగా కెటిఎమ్ తమ పెర్ఫార్మెన్స్ మోటార్‌సైకిళ్ల కోసం జర్మన్ మెట్జెలర్ టైర్లను ఆఫర్ చేస్తుంది.

కానీ ఈ టైర్లు చాలా ఖరీదైనవి, కాబట్టి ఈ మోటార్‌సైకిళ్ల కోసం కంపెనీ ఎమ్ఆర్ఎఫ్ టైర్లను ఆఫర్ చేస్తోంది. ఈ టైర్లను రెవ్జ్-ఎఫ్‌సి1, రెవ్-సి1 అని పిలుస్తారు. స్టాక్ ఫిట్టెడ్ టైర్లకు రీప్లేట్‌మెంట్ ఎమ్ఆర్ఎఫ్ ఈ టైర్లను ఆఫర్ చేయనుంది. ఈ టైర్లు దీర్ఘకాలిక రబ్బర్ మన్నికను కలిగి ఉండి, అన్ని వాతావరణ పరిస్థితుల్లోను సుపీరియర్ గ్రిప్‌ను ఆఫర్ చేస్తాయి.

ktm new tyres

ప్రస్తుతం కెటిఎమ్ మోటార్‌సైకిళ్లలో ఆఫర్ చేస్తున్న మెట్జెలర్ టైర్ల సెట్ సుమారు రూ.16,160 వెల కలిగి ఉంటాయి. కానీ, ఈ కొత్త ఎమ్ఆర్ఎఫ్ టైర్లలో ఫ్రంట్ టైర్ ధర రూ.2,683, రియర్ టైర్ ధర రూ.3,600గా ఉన్నాయి. ఈ కొత్త రెవ్జ్ ఎఫ్‌సి1, సి1 టైర్లు వరుసగా 110/70 R-17, 150/60 R-17 సైజును కలిగి ఉంటాయి.

ktm with mrf tyres
Most Read Articles

English summary
The Duke 390 and RC 390 motorcycles by KTM is an exceptional motorcycles. This motorcycle needs special tyres that can offer phenomenal grip. The Austrian manufacturer offers German tyres by Metzeler for its performance motorcycle.
Story first published: Wednesday, March 4, 2015, 13:57 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X