కొత్త మోడళ్లతో కేక పుట్టించే ఆలోచనలో కే.టీ.ఎమ్?

By Vinay

కే.టీ.ఎమ్ ప్రస్తుతం బజాజ్ తో కలిసి బైక్ లను విడుదల చేస్తోంది. వారు ఇప్పటి వరకూ డ్యూక్ 125, డ్యూక్ 200, డ్యూక్ 390, ఆర్.సీ 125, ఆర్.సీ200 మరియు ఆర్.సీ 390 మోడళ్లను ప్రవేశపెట్టాయి.

తమ 390 సామర్థ్యమున్న యూనిట్ ను వాడుకుని మరిన్ని కొత్త మోడళ్లను ప్రవేశపెట్టడంతో కేక పుట్టించే ఆలోచనలో ఉన్నాయి. కే.టీ.ఎమ్ 390 మరిన్ని కొత్త ఫీచర్స్ తో, అదిరే లుక్ మరియు షాక్ అబ్సార్వర్ లాంటి పరికరాలను ఉపయోగించుకొని అద్భుతంగా రూపొందనుంది.

ktm

ఇప్పుడు ఈ ఆస్ట్రియన్ తయారీ సంస్థ రెండు పర్మామెన్స్ ఓరియెంటెడ్ బైక్ లను భారత మార్కెట్లో ఆవిష్కరించే ఆలోచనలో ఉంది. కే.టీ.ఎమ్ తన సూపర్ అడ్వాంచర్ మరియు 1290 సూపర్ డ్యూక్ మోడళ్లను భారత్ లో ప్రవేశపెట్టే ఆలోచనలో ఉంది.

కొన్ని సంవత్సరాల నుంచి మోటార్ సైకిల్ ఔత్సాహికులు కే.టీ.ఎమ్ విడుదల చేయబోయే సరి కొత్త పవర్ ప్యాక్డ్ మోటార్ సైకిల్ కోసం ఎదురుచూస్తున్నారు. తమ అవసరాలకు సరిపోయే విధంగా ఉంటుందని అభిమానులు ఊహల్లో తేలిపోతున్నారు.

ktm stunt

కే.టీ.ఎమ్ విడుదల చేయబోయే సూపర్ అడ్వాంచర్ మరియు 1290 సూపర్ డ్యూక్ రెండు మోడళ్లు ఇంజన్ నుంచి అత్యధిక శక్తిని ఉత్పత్తి చేసేలా ఉన్నాయి. ఆ రెండు కొన్ని భద్రత, రైడింగ్ అభివృద్ధి వంటి ఆప్షన్లను కలిగి ఉన్నాయి.

కే.టీ.ఎమ్ మొదట కంప్లీట్లీ బిల్ట్ యూనిట్స్ (సీబీయు) గా ఉత్పత్తి చేసి అనంతరం వాటిని కంప్లీట్లీ నోన్డ్ డౌన్ (సీకేడీ) యూనిట్స్ ఆధారంగా తయారుచేసి, డిమాండ్ ఆధారంగా అందించాలని ఆలోచిస్తోంది.
మరిన్ని అప్ డేట్స్ కోసం చూస్తూ ఉండండి. తెలుగు డ్రైవ్ స్పార్క్.......

Most Read Articles

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X