మార్చ్ 12వ తేదీన ట్రైయంప్ టైగర్ ఎక్స్‌సిఎక్స్, ఎక్స్ఆర్ఎక్స్ విడుదల

By Ravi

గడచిన ఫిబ్రవరి నెలలో జరిగిన ఇండియన్ బైక్ వీక్ 2015లో ట్రైయంప్ ప్రదర్శనకు ఉంచిన టైగర్ ఎక్స్‌సిఎక్స్, టైగర్ ఎక్స్ఆర్ఎక్స్ మోడళ్లను ఈనెల 12వ తేదీన విడుదల చేసేందుకు కంపెనీ సన్నాహాలు చేస్తోంది. ఈ మేరకు ట్రైయంప్ ఇండియా మీడియా మిత్రులకు ఆహ్వానాలు కూడా పంపింది.

ట్రైయంప్ గడచిన సంవత్సరం నవంబర్ నెలలో మిలాన్‌లో జరిగిన ఈఐసిఎమ్ఏలో తొలిసారిగా టైగర్ ఎక్స్‌సిఎక్స్, టైగర్ ఎక్స్ఆర్ఎక్స్ మోడళ్లను ఆవిష్కరించింది. ఈ రెండింటిలోను ఒకేరకమైన ఇంజన్‌ను ఉపయోగించారు. ఈ బైక్‌లలోని 800సీసీ, త్రీ-సిలిండర్, లిక్విడ్ కూల్డ్ ఇంజన్ గరిష్టంగా 92.68 హార్స్‌పవర్‌ల శక్తిని, 79 ఎన్ఎమ్‌ల టార్క్‌ని ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్ 6-స్పీడ్ గేర్‌బాక్స్‌తో కనెక్ట్ చేయబడి ఉంటుంది.

triumph india launch

ట్రైయంప్ టైగర్ ఎక్స్‌సిఎక్స్, ఎక్స్ఆర్ఎక్స్ ఫీచర్లు:

  • అడ్వాన్స్డ్ ఏబిఎస్
  • ట్రాక్షన్ కంట్రోల్
  • థ్రోటల్ మ్యాప్స్
  • త్రీ రైడింగ్ మోడ్స్
  • క్రూయిజ్ కంట్రోల్
  • అడ్వాన్స్డ్ ట్రిప్ కంప్యూటర్
  • ఆక్స్ సాకెట్
  • ఆటో క్యాన్సిల్ ఇండికేటర్స్
  • అడ్జస్టబల్ విండ్‌స్క్రీన్
  • హ్యాండ్ గార్డ్స్
  • అల్యూమినియం లగేజ్ కంటైనర్స్ (ఆప్షనల్)
  • ఫోర్జ్డ్ అల్యూమినియం ఫోల్డింగ్ గేర్ పెడల్ (ఆప్షనల్)
  • హ్యాండిల్‌బార్ రైజర్స్ (ఆప్షనల్)
  • హీటెడ్ గ్రిప్స్ (ఆప్షనల్)
  • ఎల్ఈడి ఫాగ్ లైట్స్ (ఆప్షనల్)
triumph india launch plan

ట్రైయంప్ టైగర్ ఎక్స్‌సిఎక్స్, ఎక్స్ఆర్ఎక్స్ కలర్ ఆప్షన్స్:

  • క్రిస్టల్ వైట్
  • ఫాంటమ్ బ్లాక్
  • క్యాస్పియన్ బ్లూ
Most Read Articles

English summary
Triumph Motorcycles recently showcased its Tiger XCx and XRx adventure motorcycles at the India Bike Week festival. Now the British based manufacturer has confirmed it will be launching both these motorcycles in India on 12th of March, 2015.
Story first published: Friday, March 6, 2015, 16:17 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X