భారతీయ మార్కెట్లో విడుదలకు సిద్దంగా ఉన్న 10 బైక్‌లు: ఇందులో దేనిని ఎంచుకుంటారు.

By Anil

ప్రతి రోజు ఎన్నో కొత్త బైకులు, కార్లు రకరకాల మోడల్స్ విడుదల అవుతూనే ఉంటాయి. కాని ప్రతి సారి నూతనత్వ కోరుకునే వారికి ప్రతిది పాతగా ఉంటుంది. అలా కొత్తదనం కోరుకునే దిచక్ర వాహన ప్రియులకు ఒక శుభ వార్త.

ప్రస్తుతం ఏ బైక్‌లు ఎప్పడు రిలీజ్ అవుతాయో ఏ మాత్రం అంచనా వేయలేం ఎందుకంటే సోషల్ మీడియా వినియోగం విరివిగా ఉన్నందువల్ల ఎప్పుడుపడితే అప్పడు కొన్ని కంపెనీల తమ వాహనాలను విడుదల చేస్తున్నారు. అందు కోసం తెలుగు పాఠకుల కోసం అతి త్వరలో విడుదల కాబోతున్న 10 బైక్‌ల గురించి వివరంగా అందిస్తున్నాము.
Also Read: హోండా కు పోటిగా హీరో స్ల్పెండర్ ప్రొ: ఎందుకు, ఏమైంది?

త్వరలో విడుదల కాబోతున్న 10 బైక్‌ల గురించి క్రింద స్లైడర్ ద్వారా తెలుసుకుందాం.

2015 టివియస్ విక్టర్:

2015 టివియస్ విక్టర్:

పూర్తిగా స్వదేశీ పరిజ్ఞానంతో ద్విచక్ర వాహనాలను తయారు చేస్తున్న టూ వీలర్ తయారీదారులు అయిన టి.వి.యస్ ఇప్పటికే ఉన్న విక్టర్ మోడల్‌కు కొన్ని కొత్త సొబగులు తొడిగి మార్కెట్లోకి విడుదల చేయనుంది. దీనిని 2016 ఢిల్లీలో జరగబోయే ఆటో ఎక్స్‌పోలో ప్రజర్శించనున్నారు. ఇది 110సీసీ మరియు 125 సీసీ అను రెండు ఇంజన్ వేరియంట్లలో లభించనుంది. దీని ధర సుమారుగా రూ. 50,000 నుండి 52,000 మద్య ఉండవచ్చు.

టివియస్ అపాచె:

టివియస్ అపాచె:

టివియస్ తన అభివృద్దిపరిచిన అపాచె మోడల్‌ను ఇది వరకే జరిగిన 2014 ఆటో ఎక్స్‌-పోలో ప్రదర్శించింది. దీనిని అతి త్వరలోనే మార్కెట్లోకి విడుదల చేయనున్నారు. అయితే ఇది మార్కెట్లకి విడుదలైన తరువాత కెటియమ్ డ్యూక్200, బజాజ్ పల్సర్ 200 యన్‌యస్, హోండా సిబిఆర్250ఆర్ మరియు హీరో హెచ్‌ఎక్స్250ఆర్ వంటి మోడళ్లకు గట్టి పోటిగా నిలువనుంది. అంతే కాకుండా ఇది యాంటి లాక్ బ్రేకింగ్ సదుపాయంతో అందుబాటులో ఉంది.

కెటియమ్‌ 1050 అడ్వెంచర్:

కెటియమ్‌ 1050 అడ్వెంచర్:

కెటియమ్ 1050 బైక్ ఈ సంవత్సరం చివరకల్లా విడుదల కానుంది. ఇందులో గల 1,055 సీసీ ఇంజన్ 95బిహెచ్‌పి పవర్ మరియు 107 ఎన్ఎమ్ అత్యధిక టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది యాంటి-లాక్ బ్రేకింగ్ సిస్టమ్‌తో అందుబాటులో ఉండనుంది. ఈ బైక్ నాలుగు రకాల రైడింగ్ మోడ్‌లలో లభించును అవి - స్పోర్ట్, స్ట్రీట్, రెయిన్, ఆఫ్-రోడ్.

హోండా సిబి500యఫ్:

హోండా సిబి500యఫ్:

ఇందులో గల లిక్విడ్ కూల్డ్ ప్యార్లల్‌-ట్విన్ 471సీసీ ఇంజన్ మీకు ఇస్తుంది 47బిహెచ్‌పి పవర్‌ను. దీని సుమారుగా రూ. 5 లక్షల వరకు ఉండవచ్చని అంచనా. అయితే ఈ హోండా సిబి500యఫ్ కవసాకి ఇఆర్6యన్ మరియు కవసాకి నింజా 650ఆర్ మోడల్లకు పోటిగా నిలువనుంది.

హోండా సిబి300యఫ్:

హోండా సిబి300యఫ్:

హోండా సిబి300యఫ్ బైక్‌లో గల సింగల్ సిలిండర్ ఇంజన్ 30బిహెచ్‌పి పవర్ మరియు 27ఎన్ఎమ్ అత్యధిక టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. దీని ధర దాదాపుగా రూ. 2.5 లక్షల వరకు ఉండవచ్చు అని అంచనా. ఇది కనుక మార్కెట్లోకి వస్తే ఇది కవసాకి జడ్250 మోడల్ బైక్‌కు గట్టి పోటిగా నిలుస్తుంది.

 హీరో హెచ్‌ఎక్స్250ఆర్:

హీరో హెచ్‌ఎక్స్250ఆర్:

హెచ్‌ఎక్స్250ఆర్ బైక్‌లో 249సీసీ గల 4-స్ట్రోక్ సింగంల్ సిలిండర్ ఇంజన్ ఉంది. ఇది కేవలం 9 సెకండ్ల వ్యవధిలోనే గంటకు 0 నుండి 100 కిలోమీటర్లు వేగాన్ని అందుకోగలదు. ఇది ఈ సంవత్సరం చివరికల్లా విడుదల కావచ్చు. మరియు దీని ధర రూ. 1.5 లక్షల నుండి 2 లక్షల వరకు ఉండవచ్చు అని అంచనా.

 బియమ్‌డబ్ల్యూ కొత్త బైక్:

బియమ్‌డబ్ల్యూ కొత్త బైక్:

బియమ్‌డబ్ల్యూ తన కొత్త టూ వీలర్‌ను కె03 అనే కోడ్ పేరుతో పరిచయం చేసింది. అయితే బియమ్‌డబ్ల్యూ టివియస్ తో చేతులు కలిపి 500సీసీ లోపు గల బైక్‌ను తయారు చేయాలని నిర్ణయించింది. ఇది జి 310ఆర్ అనే పేరుతో నామకతరణం చేయబడింది. అయితే ఇందులో సింగల్ సిలిండర్ గల ఇంజన్ ఉందని సమాచారం.

 బజాజ్ పల్సర్ ఆర్‌యస్400:

బజాజ్ పల్సర్ ఆర్‌యస్400:

బజాజ్ పల్సర్ తన ఆర్‌యస్400 మోడల్ బైక్ను అతి త్వరలో విడుదల చేయనున్నారు. 375సీసీ ఇంజన్ గల ఈ బజాజ్ పల్సర్ ఆర్‌యల్400 బైక్ ధర రూ. 1.7 నుండి 1.8 లక్షల మద్య ఉంటుందని అంచనా. దీని గల ఏకైకల పోటీ హోండా సిబిఆర్300ఆర్.

బజాజ్ పల్సర్ 150యన్‌.యస్:

బజాజ్ పల్సర్ 150యన్‌.యస్:

బజాజ్ పల్సర్ 150యన్‌.యస్ అత్యధిక పవర్‌ను 9,000 ఆర్‌పియమ్ వద్ద మరియు అత్యధిక టార్క్‌ను 7,500 ఆర్‌పియమ్ వద్ద ఇది విడుదల చేస్తుంది. ఇందులో 149.5సీసీ గల ఇంజన్ ఉంది. ఈ బైక్‌లో 12-లీటర్ల ఫ్యూయల్ కెపాసిటి గల ట్యాంక్ కలదు. దీని ధర రూ. 70,000 నుండి 75,000 రుపాయల మధ్య ఉండవచ్చు.

 అప్రిలియా ఆర్‌యస్‌వి4:

అప్రిలియా ఆర్‌యస్‌వి4:

భారతీయ మార్కెట్లోకి అప్రిలియా తన ఆర్‌యస్‌వి4 మోడల్ బైక్‌ను అతి త్వరలో విడుదల చేయనుంది. ఇందులో గల 999.6సీసీ ఇంజన్ 13,000 ఆర్‌పియమ్ వద్ద201 పియస్‌ పవర్‌ను మరియు 10,500 ఆర్‌పియమ్ వద్ద 115ఎన్ఎమ్ అత్యధిక టార్క్‌ను విడుదల చేస్తుంది. ఇది మూడు రైడింగ్ మోడ్స్‌ను అందిస్తోంది అవి-ట్రాక్, స్పోర్ట్ మరియు రేస్

టూవీలర్లకు చెందిన మరిన్ని విషయాలు.....

Most Read Articles

English summary
top-10 Upcoming Motorcycles India
Story first published: Monday, November 16, 2015, 18:53 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X