యమహా స్కూటర్లలో బ్లూ కోర్ టెక్నాలజీ, కొత్త కలర్ ఆప్షన్స్

By Ravi

జపనీస్ టూవీలర్ కంపెనీ యమహా, దేశీయ విపణిలో విక్రయిస్తున్న స్కూటర్లలో తమ పాపులర్ బ్లూ కోర్ టెక్నాలజీని పరిచయం చేసింది. అంతేకాకుండా.. ఈ స్కూటర్లలో కంపెనీ కొత్త కలర్ ఆప్షన్లను కూడా పరిచయం చేసింది.

ప్రస్తుతం యమహా మోటార్ ఇండియా, భారత మార్కెట్లో రే, రే జెడ్, ఆల్ఫా స్కూటర్లను విక్రయిస్తోంది. ఇప్పుడు ఈ మూడు స్కూటర్లు కూడా బ్లూ కోర్ టెక్నాలజీతో పాటుగా, కొత్త కలర్ ఆప్షన్లలో లభ్యం కానున్నాయి.

yamaha new colour launch

హోండా అందిస్తున్న హెచ్ఈటి (హోండా ఈకో టెక్నాలజీ), సుజుకి అందిస్తున్న ఎస్ఈపి (సుజుకి ఈకో పెర్ఫార్మెన్స్) టెక్నాలజీల మాదిరిగానే ఈ యమహా బ్లూ కోర్ టెక్నాలజీ కూడా పవర్‌తో పాటుగా మైలేజ్‌ని మెరుగుపరచడంలో సహకరిస్తుంది.

బ్లూ కోర్ టెక్నాలజీతో వస్తున్న కొత్త 2015 యమహా స్కూటర్లకు, ఇదివరకే మార్కెట్లో ఉన్న స్కూటర్లకు మధ్య వ్యత్యాసాన్ని తెలిపేందుకు గాను కంపెనీ ఈ కొత్త మోడళ్లను సరికొత్త కలర్ ఆప్షన్లలో అందిస్తోంది. వీటి మైలేజీని 62 కెఎంపిఎల్ నుంచి 66 కెఎంపిఎల్‌కు పెంచారు.

బ్లూ కోర్ టెక్నాలజీతో లభ్యం కానున్న కొత్త 2015 యమహా స్కూటర్ల ధరలు ఇలా ఉన్నాయి:

  • యమహా ఆల్ఫా - రూ.49,939
  • యమహా రే - రూ.47,805
  • యమహా రే జెడ్ - రూ.48,936
yamaha scooter price in india

ప్రస్తుత ఇంజన్లతో పోల్చుకుంటే యమహా బ్లూ కోర్ టెక్నాలజీ కలిగి ఇంజన్లలో కొన్ని మార్పులు చేర్పులు ఉంటాయి. ఈ కొత్త ఇంజన్లలో కంబస్టియన్‌ను మెరుగు పరచేందుకు నికెల్ స్పార్క్ ప్లగ్‌ను ఆఫర్ చేస్తున్నారు. మఫ్లర్ సెట్టింగ్, కొత్త బిఎస్ కార్బురేటర్, టిపిఎస్ సెట్టింగ్‌లను మార్చారు.

Most Read Articles

English summary
Japanese two-wheeler, Yamaha is focussing on its scooter segment in Indian market. They have now introduced new colours, along with its Blue Core technology in all its scooters. Yamaha offers the Alpha, Ray and Ray-Z scooters in India. All three scooters share the same engine, however, their design is targeted towards different buyers.
Story first published: Thursday, March 26, 2015, 10:50 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X