ఆటో ఎక్స్‌పోలో విడుదల కానున్న యమహా ఎమ్‌టి-320

By Vinay

యమహా ఫాస్కినో అనే ప్రీమియం స్కూటర్‌ను ఇటీవల భారత మార్కెట్లోకి విడుదల చేసింది. భవిష్యత్తులో మరిన్ని మోడళ్లను భారత్ కోసం విడుదల చేయాలని ఉంది.

ఈ జపనీస్ తయారీ సంస్థ తన వైజడ్ఎఫ్-ఆర్15 మోడల్‌‌తో విజయానికి బాటలు వేసుకుంది. అప్పటి నుంచి తన మోడళ్లను కాస్మొటిక్ మార్పులతో అభివృద్ధి చేస్తోంది.

yamaha

రానున్న 2016 ఆటో ఎక్స్‌పోలో యమహా తన సరి కొత్త స్ట్రీట్ మోటార్ సైకిల్‌ను విడుదలచేయనుంది. దానికి ఎమ్‌టి-320 అని పేరు పెట్టింది. ఇది యమహా వైజడ్ఎఫ్-ఆర్3 మోటార్ సైకిల్‌ నుండి అభివృద్ధి చేయబడింది.

స్పెసిఫికేషన్స్ :
ఇంజన్ : 321సీసీ ఇన్-లైన్,2-సిలిండర్,లిక్విడ్ కూల్డ్.
హార్స్‌పవర్ : 41.40.
టార్క్ : 26.9 ఎన్ఎమ్.
గేర్‌బాక్స్ : 6-స్పీడ్, కాన్స్‌టాన్ట్ మెష్.

yamaha

డిజైన్ పరంగా ఎమ్‌టి-320, ఎమ్‌టి రేంజ్ మోటార్ సైకిల్‌ మాదిరి మరియు ఇటీవల ఇండోనేషియాలో విడుదల చేసిన ఎమ్‌టి-25 మాదిరి ఉంది. కొన్ని కాంపొనెంట్స్ వైజడ్ఎఫ్-ఆర్3 మోటార్ సైకిల్‌‌లో ఉన్న విధంగా తయారుచేయబడింది.

యమహా తన మరిన్ని మోడళ్లను భారత్‌కు తీసుకువచ్చే ఆలోచనలో ఉంది. వైజడ్ఎఫ్-ఆర్3ను ఆగష్టు 2015లో విడుదల చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి.

Also Read: మరిన్ని ఆశ్చర్యకరమైన విషయాలు

Most Read Articles

English summary
Yamaha recently launched its premium scooter in Indian market, which is christened as Fascino. They have lined up several product launches for India in the near future.
Story first published: Saturday, July 11, 2015, 9:16 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X