ఆప్రిలియా ఎస్ఆర్-150 స్కూటర్ విడుదల ధర మరియు ఇతర వివరాలు

By Anil

ఇటాలియన్‌కు చెందిన ప్రముఖ ద్విచక్ర వాహనాల తయారీ సంస్థ ఆప్రిలియా ఎట్టకేలకు తమ అత్యంత సరసమైన ఎస్ఆర్-150 స్కూటర్‌ను దేశీయ మార్కెట్లోకి విడుదల చేసింది. దీని ప్రారంభ ధర రూ, 65,000 లు ఎక్స్ షోరూమ్ (పూనే)గా ప్రకటించింది.

ఆప్రిలియా సంస్థ దీనిని ప్రపంచ సూపర్‌స్టాక్ ఛాంపియన్, లోరెంజో సవడోరి చేతులు మీద విడుదల చేశారు. ఆప్రిలియా వారి మొదటి స్కూటర్ ఎస్‌ఆర్-150 గురించి పూర్తి వివరాలు క్రింది కథనంలో.....

ఆప్రిలియా ఎస్ఆర్-150 ఆప్రిలియా

ఆప్రిలియా టూ వీలర్ల సంస్థ మొదటి సారిగా ఈ ఎస్ఆర్-150 స్కూటర్‌ను ఈ ఏడాది ప్రారంభంలో జరిగిన 2016 ఇండియన్ ఆటో ఎక్స్ పో వేదిక మీద ప్రదర్శించింది. అప్పట్లో 2016 ముగిసేలోపు ఎస్ఆర్-150 స్సూటర్‌ను అందుబాటులోకి తీసుకువస్తాము అని ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే అనుకున్న సమయానికన్నా ముందుగా దీనిని విడుదల చేసారు.

ఆప్రిలియా ఎస్ఆర్-150 ఆప్రిలియా

ఆప్రిలియా సంస్థ దేశ వ్యాప్తంగా ఉన్న మోటో ప్లెక్స్ ఔట్‌లెట్స్ నుండి మరియు పియాజియో డీలర్లను నుండి కేవలం 5,000 రుపాయల ప్రారంభ ధరతో ఈ ఎస్‌ఆర్-150 కు సంభందించిన బుకింగ్‌లను నెల ముందుగానే ప్రారంభించింది.

ఆప్రిలియా ఎస్ఆర్-150 ఆప్రిలియా

అంతే కాకుండా ప్రముఖ ఇ-కామర్స్ దిగ్గజ సంస్థ పేటిఎమ్ నుండి కూడా ఈ ఎస్ఆర్-150 స్కూటర్లను అందుబాటులోకి తెచ్చింది. బుకింగ్ చేసుకున్న వారికి అతి త్వరలో డెలివరీ ఇవ్వనున్నట్లు దీని విడుదల కార్యక్రమంలో సంస్థ ప్రతి నిధులు తెలిపారు.

ఎస్ఆర్-150 సాంకేతిక వివరాలు

ఎస్ఆర్-150 సాంకేతిక వివరాలు

ఆప్రిలియా సంస్థ ఈ ఎస్ఆర్-150 స్కూటర్‌లో 154.4సీసీ సామర్థ్యం ఉన్న గాలితో చల్లబడే సింగల్ సిలిండర్ ఫోర్ స్ట్రోక్ ఇంజన్ కలదు.

ఆప్రిలియా ఎస్ఆర్-150 ఆప్రిలియా

ఇందులోని శక్తివంతమైన ఇంజన్ సుమారుగా 11.4బిహెచ్‌పి పవర్ మరియు 11.5ఎన్ఎమ్ గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేయును.

ఆప్రిలియా ఎస్ఆర్-150 ఆప్రిలియా

మీరు గమనించినట్లయితే ఆప్రిలియా సంస్థ ఇందులో వినియోగించిన ఇంజన్ మరియు అది విడుదల చేసే పవర్ వంటివి వాటిని సరిగ్గా వెస్పాలో వినియోగించిన ఇంజన్‌లో గుర్తించవచ్చు. ఇందులోని ఇంజన్ విడుుదల చేసే పవర్ మరియు టార్క్ సివిటి గేర్‌బాక్స్ ద్వారా వెనుక చక్రాలకు అందుతుంది.

ఆప్రిలియా ఎస్ఆర్-150 ఆప్రిలియా

ఆప్రిలియా ఎస్ఆర్-150 స్కూటర్ గరిష్టంగా గంటకు 95 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది. ఈ స్కూటర్ లీటర్‌కు 45 కిలోమీటర్ల గరిష్ట మైలేజ్ ఇవ్వగలదు.

ఫీచర్లు

ఫీచర్లు

ఫీచర్ల పరంగా ఇందులో ముందు వైపున టెలిస్కోపిక్ ఫ్రంట్ ఫోర్క్స్, వెనుక వైపున మోనో షార్ అబ్జార్వర్లు మరియు రెండు వైపులా ఉన్న 14-అంగుళాల అల్లాయ్ చక్రాలకు 120/70 వి సెక్షన్ గల టైర్లను అందించారు.

బ్రేకులు

బ్రేకులు

భద్రత పరంగా ఆప్రిలియా సంస్థ ఈ ఎస్ఆర్-150 స్కూటర్‌లో ముందు వైపున 220ఎమ్ఎమ్ డిస్క్ బ్రేకు అదే విధంగా వెనుక వైపున 140ఎమ్ఎమ్ డిస్క్ బ్రేకులను అందించింది.

ఇంస్ట్రుమెంటేషన్

ఇంస్ట్రుమెంటేషన్

ఎస్ఆర్-150 లో డ్యూయల్ పోడ్ ఇంస్ట్రుమెంట్ క్లస్టర్, హెడ్ లైట్ పాస్ సిస్టమ్ (మిగతా స్కూటర్లలో ఇలాంటి వాటిని గమనించలేనిది), ఆప్రిలియా ఎస్ఆర్-150 రెండు విభిన్న రంగుల్లో లభించును అవి, మట్టీ బ్లాక్ మరియు వైట్.

పోటీదారులు

పోటీదారులు

ప్రస్తుతం దేశీయ మార్కెట్లో ఎస్ఆర్-150 స్కూటర్‌కు వెస్పా నుండి మినహాయిస్తే మరేవిధమైన పోటీ కూడాలేదు.

ఆప్రిలియా ఎస్ఆర్-150 ఆప్రిలియా

క్విడ్ 1.0-లీటర్ ను విడుదల చేసిన రెనో: ధర మరియు ఇతర వివరాలు

ఇండియాలో ఉన్న టాప్ 5 బెస్ట్ మైలేజ్ పెట్రోల్ కార్లు

Most Read Articles

English summary
Aprilia Launches Its Most Affordable Two-Wheeler In India — The SR 150
Story first published: Tuesday, August 23, 2016, 12:35 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X