హ్యార్లీ డేవిడ్‌సన్ కస్టమ్ బైకు విడుదల ధర రూ. 8.9 లక్షలు

Written By:

హ్యార్లీ డేవిడ్‌సన్ ఇండియా దేశీయ మార్కెట్లోకి 1200 కస్టమ్ అనే సరికొత్త బైకును విడుదల చేసింది. అమెరికా ఆధారిత ద్విచక్ర వాహనాల తయారీ సంస్థ మార్కెట్లోకి అత్యంత ఖరీదైన బైకును విడుదల చేసింది.

2016 సంవత్సరానిక మొదటి మోడల్‌గా హ్యార్లి డేవిడ్‌సన్ వారు ఈ బైకును విడుదల చేశారు. 1200 కస్టమ్ బైకు గురింతచి మరిన్ని వివరాలు క్రింది కథనం ద్వారా తెలుసుకుందాం రండి.

హ్యార్లి డేవిడ్‌సన్ వారి కస్టమ్ 1200 మోటార్ సైకిల్‌లో 1,202సీసీ గల గాలితో చల్లబడే ఇంజన్ కలదు. అయితే ఇందులో ఇంజన్‌కు ఇంధనాన్ని అందివ్వడానికి కార్బో‌రేటర్ కు బదులుగా ఫ్యూయల్ ఇంజెక్షన్‌ను కల్పించారు.

ఇందులో ఉన్న ఇంజన్ దాదాపుగా 96 ఎన్ఎమ్ అత్యధిక టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇందులో ఉన్న ఇంజన్ 5-స్పీడ్ గేర్ బాక్స్‌ను కలిగి ఉంది.

హ్యార్లీ డేవిడ్‌సన్ వారి ఈ కస్టమ్ 1200 బైకు కేవలం 268 కిలోల బరువును మాత్రమే మోయగలదు. హ్యార్లిడేవిడ్ మోడల్స్‌లో అతి తక్కువ బరువును మెసే బైకు కూడా ఇదే.

హ్యార్లి డేవిడ్‌సన్ వారు ఈ మద్యనే భారతీయ మార్కెట్లో గల తమ సూపర్ లో క్రూయిజ్ బైక్‌ను అమ్మకాల పరంగా విరమించుకుంది.

అయితే ప్రస్తుతం విడుదల చేసిన కస్టమ్ 1200 బైకు దాదాపుగా సూపర్ లో క్రూయిజ్ బైకును పోలి ఉంది. అయితే కొన్ని పెద్ద పెద్ద మార్పులను మనం ఇందులో గమనించవచ్చు.

హ్యార్లి డేవిడ్‌సన్ వారి కస్టమ్ 1200 బైకు ఫార్టిఎయిట్ మరియు ఐరన్ 883 స్పోర్ట్‌స్టార్ రేంజ్ గల బైకులతో పాటు అమ్ముడుపోతుందని ధీమా వ్యక్తం చేశారు.

ప్రస్తుతం మార్కెట్లోకి విడుదల చేసిన ఈ బైకు పూర్తిగా తయారైన తరువాత భారత్ కు దిగుమతి చేసుకుని వినియోగదారులకు అందించనున్నారు.

ప్రస్తుతం హ్యార్లి డేవిడ్‌సన్ వారు హర్యానాలోని బవాల్ ప్లాంటు ద్వారా ఎనిమది మోడల్స్‌ను తయారు చేస్తున్నారు.

ఎక్స్ పో కన్నా ముందుగా మార్కెట్లోకి వచ్చిన ఈ కస్టమ్ 1200 బైకును హ్యార్లి డేవిడ్‌సన్ ఇండియా వారు 2016 ఆటో ఎక్స్ పోలో ప్రదర్శించలేదని తెలిపారు.

Click to compare, buy, and renew Car Insurance online

Buy InsuranceBuy Now

English summary
Harley Davidson 1200 Custom Launched In India For Rs. 8.9 Lakh
Please Wait while comments are loading...

Latest Photos