అథర్ ప్రారంభం అదిరింది: దేశీయ మార్కెట్లోకి సరికొత్త ఎలక్ట్రిక్ స్కూటర్‌తో ఎంట్రీ

By Anil

పెట్రోల్ ఇంధనంతో పరుగులు తీసే స్కూటర్లు ఎటు చూసినా కనపడుతూనే ఉంటాయి, వీటి వలన పర్యావరణానికి మరియు ప్రాణమున్న ప్రతివాటికి ముప్పే అందుకోసం కేవలం ఎలక్ట్రిక్ స్కూటర్లను మాత్రమే మార్కెట్లోకి అందిస్తాము అంటోంది నూతన ఎకో టూ వీలర్ల సంస్థ "అథర్". పేరు వినడానికి కొత్తగా ఉంది కదూ. కాని ఎకో ఫ్రెండ్లీ స్కూటర్లను మాత్రమే తయారు చేస్తాము అంటూ ముందుకు వచ్చిన స్టార్టప్ సంస్థ ఇది.

అథర్ హార్డ్ వేర్ సంస్థ అయిన అథర్ నేడు మార్కెట్లోకి తమ మొదటి స్మార్ట్ స్కూటర్ ఎస్340 ను బెంగుళూరులోని సర్జీ (SURGE)ను వేదికగా చేసుకుని ప్రదర్శించింది. దీని గురించి మరిన్ని వివరాలు క్రింది కథనం ద్వారా తెలుసుకుందాం రండి.

మొదటి స్కూటర్‌తో మార్కెట్లోకి ఎంట్రీ ఇచ్చిన అథర్ టూవీలర్స్

అథర్ సంస్థ దేశీయ మర్కెట్లోకి ప్రదర్శించిన మొదటి ఎలక్ట్రిక్ స్కూటర్ ఎస్ 340 ను ఒక్క సారి ఛార్జింగ్ చేస్తే నిరంతరాయంగా 60 కిలోమీటర్లు వరకు ప్రయాణించవచ్చు.

మొదటి స్కూటర్‌తో మార్కెట్లోకి ఎంట్రీ ఇచ్చిన అథర్ టూవీలర్స్

దీని కోసం ఇందులో ప్రత్యేకంగా లిథియం-అయాన్ బ్యాటరీను అందించారు. దీనిని గంట సమయం పాటు ఛార్జింగ్ చేస్తే 80 శాతం వరకు ఛార్జింగ్ అవుతుంది.

మొదటి స్కూటర్‌తో మార్కెట్లోకి ఎంట్రీ ఇచ్చిన అథర్ టూవీలర్స్

ఛార్జింగ్ చేయడానికి దీనికి ఎటువంటి ప్రత్యేకమైన సాకెట్‌లు అవసరం లేదు. దీనిని 5ఎ సాధారణ సాకెట్ ద్వారా ఛార్జింగ్ చేయవచ్చు.

మొదటి స్కూటర్‌తో మార్కెట్లోకి ఎంట్రీ ఇచ్చిన అథర్ టూవీలర్స్

అథర్ వారి ఎస్340 ఎలక్ట్రిక్ స్కూటర్ గంటకు 72 కిలోమీటర్ల అత్యధిక వేగంతో పరుగులు పెడుతుంది.

మొదటి స్కూటర్‌తో మార్కెట్లోకి ఎంట్రీ ఇచ్చిన అథర్ టూవీలర్స్

దీనికి ముందు వైపున చక్కటి లైటింగ్ ఇవ్వగల ఎల్‌ఇజడి లైటును కల్పించారు. మరియు బరువును సమాతరంగా ఉంచుతూ గురుత్వాకర్షణ శక్తికి తక్కువలోనయ్యే విధంగా డిజైన్ చేసారు. తద్వారా ఇది స్పోర్టివ్‌ లుక్‌ను పొందినది.

మొదటి స్కూటర్‌తో మార్కెట్లోకి ఎంట్రీ ఇచ్చిన అథర్ టూవీలర్స్

దీనికి ముందువైపు స్పీడో మీటరు గల ప్రాంతంలో 24/7 కనెక్టివిటీని మరియు ఆన్‌-రోడ్ న్యావిగేషన్ సిస్టమ్‌ను కల్పించారు.

మొదటి స్కూటర్‌తో మార్కెట్లోకి ఎంట్రీ ఇచ్చిన అథర్ టూవీలర్స్

ఇందులో రెండు డ్రైవ్ మోడ్స్‌ను పరిచయం చేశారు. అవి స్పోర్ట్ మరియు ఎకానమి. దీని ద్వారా రైడ్ చేయు వారు ముందుగా ఈ స్కూటర్‌లో లాగిన్ అయ్యి ఆ తరువాత డ్రైవ్ మోడ్‌ను ఎంచుకుని రైడ్ చేయవచ్చు.

మొదటి స్కూటర్‌తో మార్కెట్లోకి ఎంట్రీ ఇచ్చిన అథర్ టూవీలర్స్

అథర్ ఎస్340 స్కూటర్‌ను ఎస్340 మొబైల్ యాప్ ద్వారా ఎల్లప్పుడూ కనెక్టివీతో ఉండవచ్చు. దీని ద్వారా కాన్ఫిగర్ రైడ్, ప్రొఫైల్ ప్రిఫరెన్స్ మరియు సింక్ న్యావిగేషన్ రూట్‌లను రిమోట్ ద్వారా అనుకరించవచ్చు.

మొదటి స్కూటర్‌తో మార్కెట్లోకి ఎంట్రీ ఇచ్చిన అథర్ టూవీలర్స్

ప్రస్తుతం అథర్ సంస్థ ఈ ఎస్‌340 ఎలక్ట్రిక్ స్కూటర్‌ను కర్ణాటకలోని బెంగళూరు కేంద్రంగా వీటి తయారీని చేపట్టింది.

మొదటి స్కూటర్‌తో మార్కెట్లోకి ఎంట్రీ ఇచ్చిన అథర్ టూవీలర్స్

అథర్ స్కూటర్ల సంస్థ వీటిని కేవలం ఆన్‌లైన్ ద్వారా మాత్రమే కొనుగోలు చేసే అవకాశాన్ని అందించింది. దీనిని ఆన్‌లైన్ ద్వారా కొనుగోలు చేసిన వారికి నేరుగా వినియోగదారుల ఇంటికే డెలివరీ ఇవ్వనున్నారు.

మొదటి స్కూటర్‌తో మార్కెట్లోకి ఎంట్రీ ఇచ్చిన అథర్ టూవీలర్స్

వచ్చే త్రైమాసికం నుండి వీటిని బెంగళూరు, చెన్నై మరియు పూనే వంటి నగరాలలో ముందస్తు ఆర్డర్లను స్వీకరించనున్నారు. మరియు వీటినిటెస్ట్ రైడ్ కోసం కొన్ని నగరాలలో ఏర్పాట్లను చేయనున్నారు.

Most Read Articles

English summary
Ather Unveils Peppy Looking Eco Friendly Smart Electric Scooter
Story first published: Tuesday, February 23, 2016, 19:27 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X