బజాజ్ నుండి మరో సంచలనాత్మక మోడల్: డొమైనర్ 400

బజాజ్ ఆటో ఎంతో కాలంగా దేశీయ విపణిలోకి తమ డొమైనర్ 400 బైకును విడుదల చేయడానికి ఆతృతగా ఎందురుచూస్తోంది. అయితే ఎట్టకేలకు చకన్ లోని తమ ఉత్పత్తి ప్లాంటులో డొమైనర్ 400 ఉత్పత్తిని ప్రారంభించింది.

By Anil

బజాజ్ ఆటో ఇండియన్ మార్కెట్లోకి తమ డొమైనర్ 400 బైకు విడుదల ఎప్పుడా అని యువత ఎంతగానో ఎదురుచూస్తోంది. అయితే దాని విడుదల తాలుకు పనులన్నీ పూర్తియినట్లు తెలుస్తోంది. గత వారంలో బజాజ్ తమ చకన్ ప్రొడక్షన్ ప్లాంటులో 400 క్రూయిజర్ శ్రేణికి చెందిన బైకు ఉత్పత్తిని అధికారికంగా ప్రారంభించింది. గతంలో దీని కోసం క్రటోస్ అనే పేరును కూడా పరీక్షించి చూశారు.

బజాజ్ డొమైనర్ 400

బజాజ్ తమ చకన్ ప్లాంటు ద్వారా మొదటి విడత డొమైనర్ 400 బైకులను పూర్తి స్థాయిలో ఉత్పత్తి చేసింది. సుమారుగా 15 సంవత్సరాల పల్సర్ ఆధిపత్యం తరువాత డొమైనర్ పేరుతో సరికొత్త బ్రాండ్ నేమ్ ని పరిచయం చేసింది.

బజాజ్ డొమైనర్ 400

చకన్ ప్లాంటులోని ఫస్ట్ బ్యాచ్ డొమైనర్ 400 బైకులను పూర్తి స్థాయిలో మహిళా ఇంజనీర్లే ఉత్పత్తి చేశారు. ప్రస్తుతం బజాజ్ శ్రేణిలో ఉన్న పల్సర్ మరియు అవెంజర్ సిరీస్ ఉత్పత్తుల కన్నా పై స్థానంలో ఈ డొమైనర్ 400 నిలవనుంది.

బజాజ్ డొమైనర్ 400

బజాజ్ శ్రేణిలోని అత్యంత శక్తివంతమైన ఉత్పత్తిగా దృష్టి సారించి డొమైనర్ 400 ను అభివృద్ది చేశారు. డొమైనర్ 400 ప్రీమియమ్ మోటార్ సైకిల్ సరికొత్త బ్రాండ్ పేరుతో మరో విజయపు చరిత్రనులిఖించనుంది.

బజాజ్ డొమైనర్ 400

గతంలో దీనికి క్రటోస్ అనే పేరును పరిశీలించారు, అయితే ఆ పేరును మరో సంస్థ రిజిస్టర్ చేసుకోవడం వలన డొమైనర్ పేరును ఖరారు చేసుకున్నారు. గతంలో సిఎస్ 400 కాన్సెప్ట్‌లో గుర్తించినటువంటి డ్యూయల్ ఇంస్ట్రుమెంట్ క్లస్టర్ తో రానుంది.

బజాజ్ డొమైనర్ 400

అప్పట్లో ప్రదర్శించినటువంటి కాన్సెప్ట్ మోడల్‌కు మరియు ఈ ప్రొడక్షన్ రెడీ మోడల్‌లో బాగా గుర్తించదగిన మార్పు ఏమిటంటే, మునుపటి అప్ సైడ్ డౌన్ ఫ్రంట్ ఫోర్క్స్ స్థానంలో కన్వెన్షనల్ టెలిస్కోపిక్ ఫ్రంట్ సస్పెన్షన్ వచ్చింది. వెనుక వైపున ఎప్పటిలాగే మోనో షాక్ అబ్జార్వర్ అందించారు.

బజాజ్ డొమైనర్ 400

సాంకేతికంగా బజాజ్ డొమైనర్ 400 లో 373సీసీ సామర్థ్యం గల ఫోర్ వాల్వ్ ఫ్యూయల్ ఇంజెక్టెడ్ డిటిఎస్-ఐ లిక్విడ్ కూల్డ్ ఇంజన్ కలదు.

బజాజ్ డొమైనర్ 400

బజాజ్ డొమైనర్ లో వినియోగించిన ఇంజన్‌ను కెటిఎమ్ డ్యూక్ 390 నుండి సేకరించింది. అయితే డొమైనర్ కోసం కాస్త అభివృద్ది చేశారు. ఇది గరిష్టంగా 40బిహెచ్‌పి పవర్ మరియు 30ఎన్ఎమ్ గరిష్ట టార్క్ ఉత్పత్తి చేయును.

బజాజ్ డొమైనర్ 400

డొమైనర్ 400 లో 34బిహెచ్‌పి పవర్ ఉత్పత్తి చేసే ఇంజన్‌ను కూడా పరిచయం చేయనుంది. స్టాండర్డ్ గా యాంటి లాక్ బ్రేకింగ్ సిస్టమ్ రాకపోతే ఆప్షనల్‌గా దీనిని పరిచయం చేసే అవకాశం ఉంది.

బజాజ్ డొమైనర్ 400

ప్రస్తుతం బజాజ్ ఆటో కు డొమైనర్ 400 ఫ్లాగ్‌షిప్ మోడల్‌గా నిలవనుంది. దేశీయ మార్కెట్లో ఉన్న రాయల్ ఎన్ఫీల్డ్ లోని క్రూయిజింగ్-టూరింగ్ మోటార్ సైకిళ్లకు గట్టి పోటీనివ్వనుంది.

బజాజ్ డొమైనర్ 400

బజాజ్ ఆటో ఈ డొమైనర్ 400 ను 1.6 నుండి 1.8 లక్షలు ఎక్స్ షోరూమ్ ధర తో విడుదల చేసే అవకాశం ఉంది.

బజాజ్ డొమైనర్ 400

  • తక్కువ బడ్జెట్లో యువతను ఊరిస్తోన్న స్పోర్ట్స్ బైకులు...
  • హిస్టరీలో మొదటిసారి: జీరో డౌన్ పేమెంట్ తో మారుతి కార్లు
  • సముద్ర గర్భంలో కదిలే రహదారి సొరంగం

Most Read Articles

Read more on: #బజాజ్
English summary
Bajaj Dominar 400 Production Begins — To Be Launched In Mid-December
Story first published: Monday, November 21, 2016, 10:52 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X