అద్భుతం: లక్ష అమ్మకాల మైలు రాయిని దాటిన బజాజ్ వి మోటార్ సైకిల్

By Anil

బజాజ్ ఆటో ఇండియా వారు ఇండియన్ మార్కెట్లోకి కొద్ది నెలల క్రితం విడుదల చేసిన లేటెస్ట్ మోటార్ సైకిల్ బజాజ్ వి. విడుదల చేసిన అతి కొద్ది కాలంలోనే లక్ష యూనిట్ల అమ్మకాలు నమోదయ్యాయి. బజాజ్ వారికి ఇది గొప్ప విజయం అని అభివర్ణించవచ్చు.

బజాజ్ వి మోటార్ సైకిల్

బజాజ్ సంస్థ దీనిని విడుదల చేసిన మొదటి వారంలోనే 20,000 బుకింగ్స్‌న నమోదు చేసుకుంది. తర్వాత కేవలం రెండే నెలల్లో టాప్-10 బెస్ట్ సెల్లింగ్ టూవీలర్ల జాబితాలో చోటు కూడా సాధించింది.

బజాజ్ వి మోటార్ సైకిల్

ఇది భారీ స్థాయిలో అమ్మకాలు సాధించడానికి గల ముఖ్య కారణం, భారత దేశపు యుద్ద నౌక, ఎయిర్ క్రాఫ్ట్ క్యారీయర్ ఐఎన్‌ఎస్ విక్రాంత్ యొక్క లోహంతో తయారు చేయడం.

బజాజ్ వి మోటార్ సైకిల్

అంతే కాకుండా దీనిని కేవలం రూ. 62,002 ఎక్స్ షోరూమ్ (ఢిల్లీ) ధరతో అందుబాటులోకి తీసుకురావడం.

బజాజ్ వి మోటార్ సైకిల్

150సీసీ సామర్థ్యం ఉన్న మోటార్ సైకిల్‌ను కేవలం 62,002 రుపాయల ప్రారంభ ఎక్స్ షోరూమ్ ధరతో అందుబాటులో ఉండటం కూడా కలిసొచ్చింది.

బజాజ్ వి మోటార్ సైకిల్

149.5సీసీ సామర్థ్యం ఉన్న ఎయిర్ కూల్డ్ సింగల్ సిలిండర్ ఇంజన్‌ సుమారుగా 11.8బిహెచ్‌పి పవర్ మరియు 13ఎన్ఎమ్ గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేయును.

బజాజ్ వి మోటార్ సైకిల్

ఇందులోని శక్తివంతమైన ఇంజన్‌కు 5-స్పీడ్ గేర్‍‌బాక్స్‌ను అనుసంధానం చేశారు.

బజాజ్ వి మోటార్ సైకిల్

బజాజ్ వి బైకు మంచి విజయం సాధించిన నేపథ్యంలో దీనిని మరింత సామర్థ్యంతో ఎక్కువ సీసీ ఉండే ఇంజన్‌ ఆప్షన్‌లో కూడా దీనిని అందుబాటులోకి తీసుకురావడానికి సన్నాహాలు చేస్తోంది.

బజాజ్ వి మోటార్ సైకిల్

బజాజ్ వి బైకు ఫోటోలు

ఏడు కొత్త బైకులను విడుదల చేయనున్న బజాజ్

Most Read Articles

Read more on: #బజాజ్
English summary
Bajaj V15 Clocks The 1 Lakh Sales Milestone In India
Story first published: Monday, July 25, 2016, 18:08 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X