కెటిఎమ్‌ డ్యూక్ 390 కన్నా తక్కువ ధరతో బిఎమ్‌డబ్ల్యూ జి310ఆర్

By Anil

ఇండియన్స్ ఎప్పటి నుండో ఎదురు చూస్తున్న బైక్ బిఎమ్‌డబ్ల్యూ వారి జి310ఆర్. బైకు ప్రేమికులు ఎప్పటి నుండో దీని మీద అమితాశక్తిని పెంచుకుంటున్నారు. అయితే ఈ బైకు అత్యంత ఖరీదైన ఉత్పత్తులను తీసుకువచ్చే బిఎమ్‌డబ్ల్యూకు చెందినది కాబట్టి దీని ధర భారీగా ఉంటుంది అనే ప్రశ్న మొదలైంది.

అయితే దీనికి ఏకైక పోటీగా ప్రస్తుతం ఉన్న కెటిఎమ్ డ్యూక్390 కన్నా తక్కువ ధరతో అందుబాటులోకి రానున్నట్లు బిఎమ్‌డబ్ల్యూ ప్రకటించింది. బిఎమ్‌‌డబ్ల్యూ జి310ఆర్ గురించి మరిన్ని వివరాలు....

 డ్యూక్ 390 కన్నా తక్కువ ధరతో బిఎమ్‌డబ్ల్యూ జి310ఆర్

ఇంగ్లాండులో బిఎమ్‌డబ్ల్యూ జి310ఆర్ బైకు ధర 4,290జిపిపి (3.88 లక్షలు)గా ఉంది.ఇక్కడ కెటిఎమ్‌డ్యూక్ 390 తో పోల్చుకుంటే ఈ ధర ఎంతో తక్కువ.

 డ్యూక్ 390 కన్నా తక్కువ ధరతో బిఎమ్‌డబ్ల్యూ జి310ఆర్

కాని బిఎమ్‌డబ్ల్యూ ఈ జి310ఆర్ బైకు దిగుమతి చేసుకోకుండా టీవీఎస్ వారి హోసురు ప్లాంటులో ఉత్పత్తి చేయనుంది. తద్వార దిగుమతి సుంకం తగ్గి మరింత తక్కువ ధరతో అందుబాటులోకి వచ్చే అవకాశం. కాబట్టి మొత్తం మీద ఇది 1.8 లక్షలకే అందుబాటులోకి రానుంది.

 డ్యూక్ 390 కన్నా తక్కువ ధరతో బిఎమ్‌డబ్ల్యూ జి310ఆర్

ఇంగ్లాండులో కెటిఎమ్‌డ్యూక్ 390 బైకులను బజాజ్ ఇండియా తయారు చేస్తోంది. అక్కడ ఈ కెటిఎమ్ 390 ధర సుమారుగా 4.12 లక్షలుగా ఉంది. కాని ఇండియన్ మార్కెట్లో దీని ధర రూ. 2.15 లక్షలు ఆన్ రోడ్‌గా ఉంది.

 డ్యూక్ 390 కన్నా తక్కువ ధరతో బిఎమ్‌డబ్ల్యూ జి310ఆర్

బిఎమ్‌డబ్ల్యూ వారి జి310ఆర్ బైకు ధర (1.80 లక్షలు) కెటిఎమ్ డ్యూక్ 390 ధర (2.15 లక్షల) కన్నా సుమారుగా 35 వేల రుపాయల వరకు వ్యత్యాసం ఉండనుంది. అందులోను బ్రాండ్ బైకు అనే ఫీలింగ్‌కు కూడా లోనవుతారు.

జి310ఆర్ ఇంజన్

జి310ఆర్ ఇంజన్

సాంకేతికంగా ఈ బిఎమ్‌డబ్ల్యూ జి310ఆర్ బైకులో 313 సీసీ సామర్థ్యం ఉన్న సింగిల్ సిలిండర్ పెట్రోల్ ఇంజన్ కలదు.

 డ్యూక్ 390 కన్నా తక్కువ ధరతో బిఎమ్‌డబ్ల్యూ జి310ఆర్

ఇందులోని శక్తివంతమైన ఇంజన్ సుమారుగా 34బిహెచ్‌పి పవర్ మరియు 28ఎన్ఎమ్ గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేయును. ఇందులోని ఇంజన్‌కు 6-స్పీడ్ మ్యాన్యువల్ ట్రాన్స్‌మిషన్ గల గేర్‌బాక్స్‌ను అనుసంధానం చేశారు.

 డ్యూక్ 390 కన్నా తక్కువ ధరతో బిఎమ్‌డబ్ల్యూ జి310ఆర్

బిఎమ్‌డబ్ల్యూ జి310ఆర్ బైకులో 11 లీటర్ల సామర్థ్యం ఉన్న ఇంధన ట్యాంకును అందించారు. మరియు ఇది లీటర్‌కు 36 కిలోమీటర్ల మైలేజ్‌ను ఇవ్వగలదు.

 సస్పెన్షన్ మరియు బ్రేకులు

సస్పెన్షన్ మరియు బ్రేకులు

సస్పెన్షన్ పరంగా ఇందులో ముందు వైపున 140ఎమ్ఎమ్ ట్రావెల్ గల అప్‌సైడ్ డౌన్ ఫోర్క్స్ మరియు వెనుక వైపున 131ఎమ్ఎమ్ ట్రావెల్ గల మోనో షాక్ అబ్జార్వర్ కలదు.

డ్యూక్ 390 కన్నా తక్కువ ధరతో బిఎమ్‌డబ్ల్యూ జి310ఆర్

ఇక బ్రేకుల విషయానికి వస్తే ఇందులో ముందు వైపు 300ఎమ్ఎమ్ మరియు వెనుక వైపున 240ఎమ్ఎమ్ చుట్టు కొలత గల డిస్క్ బ్రేకులు కలవు.

మరిన్ని ఆసక్తికరమైన కథనాల కోసం....

బైకు మరియు స్కూటర్ల అమ్మకాలు అధిగమించన టీవీఎస్ ఎక్స్ఎల్

102 ఏళ్ల తరువాత విస్తరించబడిన పనామా కాలువ గురించి అద్బుతమైన నిజాలు.....

Most Read Articles

English summary
BMW G310R To Be Priced Cheaper Than The KTM Duke 390 In India!
Story first published: Wednesday, June 29, 2016, 15:47 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X