బిఎమ్‌డబ్ల్యూ‌ని తాకిన "మేక్ ఇన్ ఇండియా" సెగ

By Anil

బిఎమ్‌డబ్ల్యు కార్లకు మాత్రమే కాదు లగ్జరీ బైకులకు కూడా నిలయమని మరో మారు 2016 ఇండియన్ ఆటో ఎక్స్ పో సాక్షిగా నిరూపించింది. గత వారంలో జరిగిన ఆటో ఎక్స్ పో వేదిక మీద బిఎమ్‌డబ్ల్యూ తమ మోటోర్రాడ్ స్ట్రీట్ బైక్ జి310ఆర్‌ను ప్రదర్శించింది.
Also Read: హోండా నవీ స్కూటర్ @ రూ.39,500
ప్రధాని కనిపెట్టిన మేకిన్ ఇండియా మంత్రం బాగా పనిచేసింది. ఎందుకంటే బిఎమ్‌డబ్ల్యూ ఈ జి310ఆర్ బైకును మేకిన్ ఇండియా లో భాగంగా దేశీయ ద్విచక్ర వాహనాల తయారీ సంస్థ టీవీఎస్ వారి ఆధ్వర్యంలో తయారు చేయనున్నారు. జి310ఆర్ బైకు గురించి మరిన్ని వివరాలు క్రింది కథనం ద్వారా తెలుసుకుందాం రండి.

 డిజైన్

డిజైన్

బిఎమ్‌డబ్ల్యూ వారు దీనిని సింపుల్‌గా చక్కగా మరియు ఒద్దిగా డిజైన్ చేశారు. హెడ్ లైట్ మరియు ముందు వైపు డిజైన్‌ను ఆర్1200ఆర్ బైకు నుండి గ్రహించారు.బిఎమ్‌డబ్ల్యూ వారి ఎస్ 1000ఆర్ బైకులోని సైడ్ డికాల్స్ మరియు యాంగులర్ సైడ్ ప్యానల్స్‌ను ఇందులో కల్పించారు. వీటన్నింటి కలయికతో ఇది ఎంతో అత్భుతంగా ఉంది.

 జి310ఆర్ ఇంజన్ వివరాలు

జి310ఆర్ ఇంజన్ వివరాలు

ఇందులో 313సీసీ కెపాసిటి గల నీటితో చల్లబడే సింగల్ సిలిండర్ ఇంజన్ కలదు. ఇంజన్ లోపల సిలిండర్ హెడ్‌లో రెండు ఓవర్ హెడ్ క్యామ్ షాఫ్ట్‌లు కలవు.

 పవర్

పవర్

బిఎమ్‌డబ్ల్యూ జి310ఆర్ బైకులో గల ఇంజన్ 9,500 ఆర్‌పిఎమ్ వేగం వద్ద 33.6 బిహెచ్‌పి పవర్ ను ఉత్పత్తి చేస్తుంది.

టార్క్

టార్క్

ఈ ఇంజన్ ఉత్పమ పవర్‌తో పాటు 7,500 ఆర్‌పిఎమ్ వేగం వద్ద గరిష్టంగా 28 ఎన్ఎమ్ టార్క్‌ను విడుదల చేయును.

అత్యధిక వేగం

అత్యధిక వేగం

బిఎమ్‌డబ్ల్యూ కార్ల మాదిరిగా బిఎమ్‌డబ్ల్యూ బైకు కూడా అత్యధిక వేగం దూసుకుపోగలదు. ఈ జి310ఆర్ బైకు వేగం గరిష్టంగా గంటకు 145 కిలోమీటర్ల వేగంతో దూసుకుపోగలదు.

 ట్రాన్స్‌మిషన్

ట్రాన్స్‌మిషన్

ఈ బైకు ఇంత వేగంతో పరుగులు పెడుతుందంటే దీనికి వినియోగించిన ట్రాన్స్‌మిషన్ ఎలా ఉంటుందో ఆలోచించండి. పవర్ మరియు టార్క్‌ను వెనుక చక్రాలకు అందివ్వడానికి దీని ఇంజన్‌కు 6-స్పీడ్ గేర్‌బాక్స్‌ను అందించారు.

ఇంధన సామర్థ్యం

ఇంధన సామర్థ్యం

బిఎమ్‌డబ్ల్యూ మోటోర్రాడ్ స్ట్రీట్ జి310ఆర్ బైకు లీటర్‌కు 30 కిలోమీటర్లు ఇస్తుంది. మరియు ఈ బైకు 11-లీటర్ల ఇంధన కెపాసిటి గల ట్యాకును కలిగి ఉంది.

సస్పెన్షన్

సస్పెన్షన్

బిఎమ్‌డబ్ల్యూ తమ జి310ఆర్ బైకులో ముందు వైపున 140 ఎమ్ఎమ్ ట్రావెల్ గల టెలిస్కోపిక్ ఫ్రంట్ ఫోర్క్స్ మరియు వెనుకవైపున 131 ఎమ్ఎమ్ ట్రావెల్ గల మోనో షాక్ అబ్జార్వర్‌ కలదు.

 బ్రేకులు

బ్రేకులు

మందు వైపున నాలుగు పిస్టన్ల కాలిపర్ 300 ఎమ్ఎమ్ డిస్క్ బ్రేక్ మరియు వెనుక వైపున సింగల్‌ పిస్టన్ గల ఫ్లోటింగ్ డిస్క్ గల 240 ఎమ్ఎమ్ డిస్క్ బ్రేక్ కలదు.

 అందుబాటులోకి

అందుబాటులోకి

బిఎమ్‌డబ్ల్యూ వారి సాంకేతికతతో మరియు టీవీఎస్ టూ వీలర్స్ వారి భాగస్వామ్యంతో తయారు కానున్న ఈ జి310ఆర్ బైకు అతి త్వరలో మనకు రోడ్ల మీద కనపడనుంది.

 పోటి

పోటి

దేశీయ మార్కెట్లోక మంచి అమ్మకాలు నమోదు చేసుకుంటున్న కెటిఎమ్ వారి 390 బైకునకు పోటిగా దీనిని దేశీయ మార్కెట్లోకి అందిస్తున్నట్లు జర్మనీకి చెందిన బిఎమ్‌డబ్ల్యూ తెలిపింది.

 2016 ఇండియన్ ఆటో ఎక్స్ పోలో ప్రదర్శించబడిన మరిన్ని టూ వీలర్ల గురించి
  • 1.49 లక్షల ధరతో ముచ్చటగా మూడు బైకులు: వీటి దెబ్బతో ఎన్ఫీల్డ్ ఇంటికే
  • యమహా ఎమ్‌టి-09 స్ట్రీట్‌ ఫైటర్ విడుదల :దీనిని కొనగల సత్తా ఉందా ?

Most Read Articles

English summary
'Make In India' BMW G310R Shown Off At Auto Expo
Story first published: Wednesday, February 10, 2016, 15:37 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X