వికారమైన వెర్రికి అర్థం లేని ఆకారంగా మారిన బైకులు

By Anil

ఆటోమొబైల్స్ అనేవి మానవ అవసరాల కోసం ఆవిష్కరించబడ్డాయి. ఇది కొన్నేళ్ల క్రిందటి మాట. కాని నేడు, వాటిని మలుచుకునే విధానాన్ని బట్టి వారికి ఆటోమొబైల్స్ పట్ల ఎంత ఇష్టం ఉందో అనే విషయాన్ని వ్యక్తం చేస్తున్నారు. అదే ఇష్టం ఎక్కువైతే వాహనాలు వాటి రూపాన్ని కోల్పోయి వికృతాకారంగా ఉంటున్నాయి.

యువతకు బైకుల పట్ల ఉన్న మక్కువను వారి బైకులకు చేసిన మోడిఫికేషన్ల ద్వారా తెలుసుకోవచ్చు. క్రింది కథనంలో ఊహించని మోడిఫికేషన్లకు గురైన బైకుల గురించి చూద్దాం...

బైకు మోడిఫికేషన్స్

ఒకప్పుడు యువతకు ఇదే సూపర్ బైకు. ఇందులో గరిష్టంగా ఇద్దరు పెద్దలు ప్రయాణించవచ్చు. కాని దీని పొడవును ఏకంగా కారును పెంచినట్లు పెంచేశారు. ఇప్పుడు ఒకరిద్దరు కాదు ఏకందా ఐదు లేదా ఆరు మంది ప్రయాణించవచ్చు. కాని ఇండియన్ రోడ్ల మీద ఇలాంటి వాటితో రైడింగ్ ఆటలు ఆడితే అస్సలు సాగవు.

Image Source: Team-BHP

బైకు మోడిఫికేషన్స్

మోడిఫికేషన్లకు బలైన మరొక బైకు, ఏ సంస్థకు చెందినదో అని కూడా గుర్తించలేనంతగా మార్చేశారు. బజాజ్ పల్సర్ ఇంధన ట్యాంకు, ప్రత్యేక డిజైన్ చేసిన సీటు మరియు రెండు సైలెన్సర్లను కలిగి ఉంది. అందులో ఒక సైలెన్సర్ అలంకార ప్రాయంగా ఉంది. దీని ఇంజన్ బాగాన్ని తీక్షణంగా పరిశీలిస్తే ఇది రాయల్ ఎన్ఫీల్డ్ వారి బైకులా ఉంది.

బైకు మోడిఫికేషన్స్

పల్లె ప్రాంతాల్లో బాగా విజయవంతమైన బైకు హీరో వారి ప్యాసన్ ఇది కూడా బారీ మోడిఫికేషన్లకు గురైంది. జీబ్రా క్రాసింగ్‌ రోడ్డు మీదే ఎందుకుండాలి, నడిపే బైకుల మీద ఎందుకుండకూడదు అనే ప్రశ్నకు ప్రతి రూపంగా మోడిఫికేషన్ జరిగినట్లుంది. నలుగురిలో ప్రత్యేకంగా దర్శనమివ్వడం కోసం భారీ మోడిఫికేషన్‌కు ఇలా గురైంది.

Image Source: Team-BHP

బైకు మోడిఫికేషన్స్

హీరో మరియు హోండా సంయుక్తంగా ఉత్పత్తి చేసిన స్ల్పెండర్‌కు చేసిన మోడిఫికేషన్ ఆ బైకుకే ఎంతో బారంగా ఉంది, మరి రూపొందించిన వారికి ఎంత బారంగా ఉందో ఏమో. కరిజ్మా బైకు తలకాయను మరియు బజాజ్ పల్సర్ యొక్క తొకను గ్రహించి దీనికి అలంకరించారు.

బైకు మోడిఫికేషన్స్

ఇక్కడ ఉన్నవి పిల్లకు, పెద్దలకు కాదు. చిన్నగా ఉన్నది మాత్రం పెద్దలకే, కాని పెద్దగా ఉన్నది అతను మోఢిఫికేషన్‌కు ప్రతి రూపంగా మారినది. ఒక రాక్షసుడు భూమి మీద రైడింగ్‌కు వెళ్లడానికన్నట్లుగా రూపొందించారు. ఎంతో ఆడంబరంగా ఊరేగిన ఇతను, పట్టు తప్పిందంటే అంతే సంగతులు మరి.

బైకు మోడిఫికేషన్స్

దీనిని గుర్తించడానికి చాలా సమయమే పడుతుంది. బజాజ్ కు చెందిన ప్రియా స్కూటర్ ఇది. తోచిన రంగుల్లో అలంకరణలకు గురైన దీనికి ఒకే సీటును ఇచ్చి రెండు సైలెన్సర్లను అందించారు.

Image Source: Team-BHP

యమహా ఎంటీసర్ 125 సీసీ క్రూయిజర్

యమహా ఎంటీసర్ 125 సీసీ క్రూయిజర్

కారు వంటి పొడవులో ఉన్న మరొక మోటార్ సైకిల్ యమహా ఎంటీసర్ 125 సీసీ క్రూయిజర్. దీనికి జరిగిన మోడిఫికేషన్ ఒక మెట్టు ఎక్కువే అని చెప్పాలి. ఎందుకంటే మోటార్ సైకిల్ పొడవు మాత్రమే కాదు దీనికి మరో చక్రం అదనంగా కూడా అందించారు. పటిష్టంగా బైకుతో పాటు ఉండటానికి సస్పెన్షన్‌ను అందించ ఛాసిస్‌కు అనుసంధానం చేశారు, అయితే చైన్‌ను దీనికి అనుసంధానం చేయలేదు.

Image Source: Team-BHP

బైకు మోడిఫికేషన్స్

మోడిఫికేషన్‌లలో విచిత్రమైన మరియు అసంబద్ద వర్గానికి చెందినది అని చెప్పవచ్చు. ముందు వైపు ఉన్న ఫోర్క్‌ను ఇంత భారీగా పొడవు పెంచేస్తే దీని మీద కూర్చోడానికి కాస్త సాహసించాలి అని చెప్పవచ్చు. ఇంతగా మోడిఫికేషన్ చేశాక ఎలాగోలా కూర్చున్నామంటే దీని ప్రయాణం జీవన్మరణ సమస్యతో కూడుకుంటుంది. కాబట్టి ఇలాంటి వాటికి దూరంగా ఉండటమే మంచిది.

బైకు మోడిఫికేషన్స్

ఇలాంటి వాహనం ఒకటి చీకట్లో మీ ముందు వస్తుంటే దాని బారిన పడి మూర్చపోవడం మాత్రం ఖాయం. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 40 లైట్లను దీనికి అమర్చారు.

బైకు మోడిఫికేషన్స్

ఇక్కడ ఇన్న ఫోటోను గమనిస్తే అతి చిన్న మరియు అతి పెద్ద ద్విచక్ర వాహనాలకు ఉదాహరణగా ఉన్నాయి కదూ ?.పెద్దది మాత్రం రెండు చక్రాల మీద నిడవడం అసంభవం. అందుకే సపోర్ట్ కోసం ఇరువైపులా రెండు చిన్నపాటి టైర్లను అనుసంధానం చేశారు.

డుకాటి మోన్‌స్టర్

డుకాటి మోన్‌స్టర్

మోడిఫికేషన్లకు బైకు ధర ఏ విధంగా అడ్డం చెప్పదని నిరూపించాడో బైకు ప్రేమికుడు. డుకాటికి చెందిన సుమారుగా 10 లక్షల రుపాయల విలువైన ఈ బైకును టైగర్ బైకుగా మోడిఫై చేశాడు. దీని మార్పులు గురించి చెప్పడానికి పదాలు కూడా ఉండవు అనొచ్చు.

బైకు మోడిఫికేషన్స్

స్కూటర్లు ఇలా ఉంటే ఎలా ఉంటుంది అనే కోణంలో మోడిఫై చేసినట్లు లేదూ...? పాత స్కూటర్‌ను రెండు భాగాలు చేసి, మధ్యలో ఉన్న ఫ్లోర్ బోర్డ్‌ను తొలగించి పొడవైన ఛాసితో ఫ్రంట్ టైరును దూరం చేసి, హ్యాండిల్‌ను పొడగించి మొత్తానికి చూడంగానే మోడిఫైడ్ స్కూటర్ అనే తరహాలో రూపొందించేశారు.

బైకు మోడిఫికేషన్స్

ఇలాంటి మోడిఫికేషన్ చేసే ముందు కారు కొనేస్తే పోలా అని అనిపిస్తుంది కదా...? వెస్పా స్కూటర్‌ను భారీ పొడుగ్గా చేసి ఫ్యామిలీ స్కూటర్‌లా మోడిఫై చేశారు. ఇంత వరకు చూసిన మోడిఫికేషన్లను గమనిస్తే పొడవును అధికంగా కోరుకుంటున్నారు అని తెలిసిపోతుంది.

బైకు మోడిఫికేషన్స్

అత్యధికంగా మోడిఫికేషన్లకు గురవుతున్న వాటిలో రాయల్ ఎన్ఫీల్డ్ వారి బైకులు ఎక్కువగా ఉన్నాయి. ఎప్పుడూ ఒకే తరహా రూపంలో అందుబాటులోకి వస్తుండటం వల్లనో ఏమో.ఈ రాయల్ ఎన్ఫీల్డ్‌కు అయితే మాత్రం ముందు వైపు హోండా సిటి హెడ్‌ల్యాంప్స్ కల్పించారు. దీనికి కల్పించిన భారీ మోడిఫికేషన్లు అన్నికూడా దీని హెడ్ లైట్ల నుండే మొదలవుతాయి.

బైకు మోడిఫికేషన్స్

అసహజం అనే పదానికి నిలువెత్తు ఉదాహరణ ఇందులోని రాయల్ ఎన్ఫీల్డ్. ఇక్కడ ఉన్న బైకును చూస్తే ప్రపంచ వ్యాప్తంగా అత్యంత పొడవైన సైలెన్సర్ ఉన్న బైకు అనవచ్చు. ఇక దీనిని పార్కింగ్ చేయాలంటే కారును పార్కింగ్ చేయడానికి కావాల్సిన పొడవు ఖచ్చితంగా కావాల్సిందే.

బైకు మోడిఫికేషన్స్

పాత రాయల్ ఎన్ఫీల్డ్ బైకులు ట్రాక్టర్లుగా ఉంటాయి అనొచ్చు, రూపం పరంగా కాకపోయినా అవి ఇచ్చే శబ్దం, వేగం మరియు ధృడత్వం వంటి అంశాల పరంగా స్పష్టం చేయవచ్చు. అందుకే కాబోలు ట్రక్టర్ సైలెన్సర్‌ను తీసి ఇదిగో ఇలా బుల్లెట్‌కు అనుసంధానం చేశారు.

బైకు మోడిఫికేషన్స్

హీరో స్ల్పెండర్ ప్రపంచ వ్యాప్తంగా అత్యధికంగా అమ్మకాలు సాధిస్తున్న టూ వీలర్, కాని రోడ్ల మీద దీని జాడ మాత్రం అంతంత మాత్రంగానే ఉంటుంది. ఒక వ్యక్తి తన స్ల్పెండర్‌కు అతి పెద్ద టైరున అనుసంధానం చేసారు, అంతేకాకుండా దానికి సరిపడా అల్లాయ్ వీల్‌ను కూడా రూపొందించుకున్నాడు.

బైకు మోడిఫికేషన్స్

ఢిల్లీ పోలుసులకు బిఎమ్‌డబ్ల్యూ మరియు గోల్డ్ వింగ్ క్రూయిజర్ బైకులను కొనేంత స్థోమత ఉండకపోవచ్చు. కాని తమకు కేటాయించిన పల్సర్ 180 ను ఇదిగో ఇలా సూపర్ బైకు తరహాలో రూపొందించారు.

బైకు మోడిఫికేషన్స్

సుజుకి హయాబుసా కూడా మోడిఫికేషన్ల బారి నుండి తప్పించుకోలేకపోయింది. ప్రాంతాలకు అతీతంగా జరిగే మోడిఫికేషన్లలో ఇది ఒకటి. దీనికి వెనుక వైపున అదనంగా ఒక చక్రాన్ని దానికి కూడా సస్పెన్షన్‌ను కల్పించారు.

బైకు మోడిఫికేషన్స్

బైకు కొనే స్థోమత లేని వాళ్లు ఏం చేస్తారు ? ఇదిగో ఇలా సైకిల్‌కు మోడిఫికేషన్లు చేస్తారు. మీకు నచ్చిన బైకు యొక్క మూడు ముఖ్య భాగాలను కొనుగోలు చేసి ఇదిగో ఈ చిత్రంలో చూపిన విధంగా అనుసంధానం చేయండి.

బైకు మోడిఫికేషన్స్

సైకిల్ వద్దు అంటే, ఒక పాత స్కూటర్‌ను కొనుగోలు చేసి దానికి మీకు నచ్చిన బైకు యొక్క విడిభాగాలతో అనుసంధానం చేయండి. అలా పల్సర్ విడి భాగాలు వినియోగించినందుకు పల్సర్‌ను పోలి ఉంది.

.

ఫన్నీ కార్ మోడిఫికేషన్స్

ఫన్నీ అండ్ ఇంట్రెస్టింగ్ బైక్/మోటార్‌సైకిల్ ఫొటోలు

కార్ ఫెయిల్ కాంపిలేషన్: ఫన్నీ కార్ ఫొటోస్

Most Read Articles

English summary
Crazy Bike Modification
Story first published: Friday, July 8, 2016, 17:08 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X