సెల్ఫ్ డ్రైవింగ్ కార్లను డామినేట్ చేయడానికి సెల్ఫ్ డ్రైవింగ్ బైకులు

By Anil

ఆటోమొబైల్ రంగంలో ఇప్పుడు ప్రపంచం మొత్తం ఉన్న హాట్ టాపిక్ సెల్ఫ్ "డ్రైవింగ్ కార్". ప్రపంచాన్నే నడిపిస్తున్న గూగుల్ నుండి ఆటోమొబైల్ రంగంలో దిగ్గజాలుగా వెలుగుతున్న వోక్స్‌వ్యాగన్ వరకు ఎన్నో సంస్థలు సెల్ఫ్ డ్రైవింగ్ కార్ల మీద భారీ ప్రయోగాలు చేస్తున్నాయి.

అయితే ఒక అడుగు ముందు విమానాలను తయారు చేసే ప్రముఖ ఎయిర్‌బస్ సంస్థ ఈ మధ్యనే గాలిలో ఎగిరే కార్లను రూపొందిస్తున్నట్లు ప్రకటించింది. అయితే ఈ గాలిలో ఎగిరే కార్లు మానవరహితం అని తెలిపారు.

అభివృద్ది ఇంతటితోనే ఆగిపోలేదు, ఇప్పుడు కొత్త సెల్ఫ్ డ్రైవింగ్ బైకులు తెర మీదకు వచ్చాయి. ప్రయాణంలో ఎంతో కీలకంగా వ్యవహరించే మనిషే లేకుండా వాహనాలు వస్తున్నాయ. టెక్నాలజీ భీభత్సమైన వేగంతో పరుగులు పెడుతోంది అనడానికి పై మూడింటిని ఉదాహరణలుగా తీసుకోవచ్చు. సెల్ఫ్ డ్రైవింగ్ బైకు గురించి పూర్తి వివరాలు క్రింది కథనం ద్వారా తెలుసుకుందాం రండి.

సెల్ఫ్ డ్రైవింగ్ బైకులు

సెల్ప్ డ్రైవింగ్ ఎగిరే కారు, సెల్ఫ్ డ్రైవింగ్ నడిచే కారు వంటివి ఉన్నపుడు సెల్ఫ్ డ్రైవింగ్ బైకు ఎందుకు ఉండకూడదని ఒక సంస్థ ఇలాంటి బైకును తయారు చేయడానికి సిద్దమైపోయింది. దీనికి సైక్లోట్రాన్ అనే పేరు కూడా పెట్టింది.

సెల్ఫ్ డ్రైవింగ్ బైకులు

ఈ సైక్లోట్రాన్ ను వాహనం కాన్సెప్ట్‌తో రూపొందిస్తున్నారు. ఇందులో ఇద్దరు వ్యక్తులు ఎదురెదురుగా కూర్చునే విధంగా సీటింగ్‌ను డిజైన్ చేస్తున్నారు.

సెల్ఫ్ డ్రైవింగ్ బైకులు

ఈ బైకు ఆగి ఉన్నపుడు స్థిరంగా నిలబడటానికి ఇందులో గైరో స్కోప్‌ను అందిస్తున్నారు. ఇది వహనానికి స్థరత్వాన్ని ఇవ్వడానికి సహాయపడుతుంది.

సెల్ఫ్ డ్రైవింగ్ బైకులు

ఈ అసలైన సెల్ఫ్ డ్రైవింగ్ బైకు ప్రాజెక్ట్ ఆలోచన వెనుకున్న వ్యక్తి కెనడాకు చెందిన చార్లెస్ బాంబర్‌డైయర్.

సెల్ఫ్ డ్రైవింగ్ బైకులు

బాంబర్‌డైయర్ ఒక ఇండస్ట్రియల్ ఇంజనీర్ ఆశిష్ తుల్కర్ సహాయంతో సెల్ఫ్ డ్రైవింగ్ బైకు యొక్క నమూనాను రూపొందించాడు.

సెల్ఫ్ డ్రైవింగ్ బైకులు

సైక్లోట్రాన్ సెల్ఫ్‌ డ్రైవింగ్ బైకు పూర్తిగా ఎలక్ట్రిక్ బైకు. ఛార్జింగ్ కోసం ఇందులో వైర్ లెస్ ఛార్జింగ్ పరిజ్ఞానాన్ని వినియోగిస్తున్నారు.

సెల్ఫ్ డ్రైవింగ్ బైకులు

ఎలక్ట్రిక్ మరియు ఇంజన్ పవర్ ఏదైనప్పటికీ బైకులను నడపడంలో మానవుల హస్తం లేకుండా రవాణా జరిగేటట్లు ఈ సైక్లోట్రాన్‌ బైకును అభివృద్ది చేస్తున్నారు.

సెల్ఫ్ డ్రైవింగ్ బైకులు

ఈ సైక్లోట్రాన్ సెల్ఫ్ డ్రైవింగ్ బైకు ఇంకా ప్రయోగ దశలోనే ఉంది. పూర్తి స్థాయిలో అభివృద్ది జరిగి అందుబాటులోకి రావడానికి ఇంకా సమయం పట్టనుంది.

సెల్ఫ్ డ్రైవింగ్ బైకులు
  • డ్రైవర్ లెస్ కార్లకు అడ్వాన్సుగా ఎగిరే డ్రైవర్ లెస్ కార్లు
  • సూట్‌కేస్ ఆకారంలో ఉన్న స్కూటర్: ఓ రౌండ్ వెళ్లొద్దమా...?

Most Read Articles

English summary
After Self Driving Cars, Here Comes Self Riding Motorcycle
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X