కాలేజ్ స్టూడెంట్స్ స్టైల్‌ను ప్రతిబింబించే ఐదు టూ వీలర్లు

By Anil

మోటార్ సైకిల్స్‌లో అత్యంత స్టైలిష్ మరియు మోడ్రన్ సెగ్మెంట్లో ఉన్న టూ వీలర్లు ఏవంటే, కాలేజ్ యువత ఎంచుకునే టూ వీలర్లు అని చెప్పవచ్చు. విభిన్నమైన జీవన శైలిని ఎంచుకునే యువత టూ వీలర్లను కూడా విభిన్నంగా ఎంచుకుంటున్నారు.

ఇండియన్ మార్కెట్లోకి కాలేజ్ స్టూడెంట్స్ మరియు యువత ఎక్కువగా ఎంచుకుంటున్న ఐదు టూ వీలర్ల గురించి క్రింది కథనంలో....ఇందులో ఏ విధమైన పోలిక, వరుస క్రమం లేకుండా ఇవ్వడం జరిగింది. స్టైల్, ధర, రైడింగ్ సౌలభ్యత మరియు దూర భార ప్రాంతాల అవసరాల ఆధారంగా టూ వీలర్లను అందివ్వడం జరిగింది.

హోండా నవీ

హోండా నవీ

స్కూటర్ మరియు బైకులలో రెడింటి లక్షణాలను పోలి ఉండే ఈ క్రాసోవర్ స్కూటర్‌ను నవీను హోండా మోటార్ సైకిల్స్ అండ్ స్కూటర్స్ ఇండియా లిమిటెడ్ ఈ మధ్యనే ఇండియన్ మార్కెట్లోకి విడుదల చేశారు. స్కూటర్లు మరియు బైకులను వాడి విసిగిపోయిన వారికి ఇది ఎంతగానో నచ్చుతుంది.

సాంకేతిక వివరాలు

సాంకేతిక వివరాలు

హోండా వారి బెస్ట్ సెల్లింగ్ స్కూటర్ ఆక్టివాలోని 110 సీసీ ఇంజన్‌నే ఇందులో అందించారు. గేర్లులేని ఇది సుమారుగా 8బిహెచ్‌పి పవర్ మరియు 9ఎన్ఎమ్ గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.

 ధర వివరాలు

ధర వివరాలు

యువతను ఉద్దేశించి విడుదల చేసిన హోండా నవీ క్రాసోవర్ స్కూటర్‌ ప్యాట్రియోట్ రెడ్, షాస్తా వైట్, బ్లాక్, హాపర్ గ్రీన్ మరియు స్పార్కీ ఆరేంజ్ వంటి రంగుల్లో లభిస్తోంది.

ధర రూ. 39,500 నుండి 49,500 లు ఎక్స్ షోరూమ్ (ఢిల్లీ)గా ఉంది.

సరికొత్త డ్రైవింగ్ అనుభవం కలిగించే హోండా నవీ రివ్యూ

పియాజియో వెస్పా

పియాజియో వెస్పా

ఇండియన్ రోడ్ల మీదున్న అన్ని స్కూటర్ల కన్నా విభిన్నమైన డిజైన్‌తో వచ్చింది పియాజియో వెస్పా. దీని డిజైన్ పరంగా అనతి కాలంలోని విపరీతమైన ప్రజాదరణ వచ్చింది, ముఖ్యంగా యువతనే దీనిని ఎక్కువగా ఎంచుకుంటున్నారు.

సాంకేతిక వివరాలు

సాంకేతిక వివరాలు

వెస్పా రెండు ఇంజన్‌ ఆప్షన్‌లలో లభిస్తోంది. ఇవి 125 సీసీ మరియు 150 సీసీ. 125 సీసీ ఇంజన్ సుమారుగా 10బిహెచ్‌పి పవర్ మరియు 10.6ఎన్ఎమ్ గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేయును, అదే విధంగా 150సీసీ ఇంజన్ 12బిహెచ్‌పి పవర్ మరియు 11.5ఎన్ఎమ్ గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేయును.

ధర వివరాలు

ధర వివరాలు

పియాజియో వెస్పా ప్రారంభ ధర రూ. 77,308 లతో మొదలుకొని గరిష్ట ధర రూ. 82,137 లు వరకు ఎక్స్ షోరూమ్ (ఢిల్లీ)గా ఉన్నాయి.

అపాచే ఆర్‌టిఆర్200 4వి

అపాచే ఆర్‌టిఆర్200 4వి

టివీఎస్ ఆపాచే ఇప్పుడు మరింత స్పోర్టివ్‌గా మరియు పదునైన డిజైన్ ఫీచర్లతో ఆపాచే ఆర్‌‌టిఆర్200 4వి గా మరింత ప్రత్యేకతను సంతరించుకుంది. ఇది స్టైలిష్‌గా మాత్రమే కాకుండా, శక్తివంతమైన ఇంజన్‌ను కూడా కలిగి ఉంది.

సాంకేతిక వివరాలు

సాంకేతిక వివరాలు

అపాచే ఆర్‌టిఆర్200 4వి లో 200సీసీ సామర్థ్యం ఉన్న ఇంజన్ కలదు, ఇది సుమారుగా 21బిహెచ్‌పి పవర్ మరియు 18.1ఎన్ఎమ్ గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేయును. ఈ ఇంజన్‌కు 5-స్పీడ్ మ్యాన్యువల్ ట్రాన్స్‌మిషన్‌ను అనుసంధానం చేశారు.

ధర వివరాలు

ధర వివరాలు

దీని ప్రారంభ ధర రూ. 89,215 నుండి 94,215 లు ఎక్స్ షోరూమ్ (ఢిల్లీ)గా ఉన్నాయి.

అపాచే ఆర్‌టిఆర్200 4వి కేవలం 3.9 సెంకడ్ల వ్యవధిలోనే గంటకు 0 నుండి 60 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది.

కెటిఎమ్ డ్యూక్200

కెటిఎమ్ డ్యూక్200

ప్రస్తుతం ఇండియాలోని యువత యొక్క ఫేవరెట్ బైకుగా కెటిఎమ్‌ వారి డ్యూక్ 200 నిలిచింది. డిజైన్ మరియు ఇంజన్ పరంగా ఇది యువతను ఎంతగానో ఆకట్టుకుంది అని చెప్పవచ్చు.

సాంకేతిక వివరాలు

సాంకేతిక వివరాలు

కెటిఎమ్ ఇందులో 199.5సీసీ సామర్థ్యం ఉన్న పెట్రోల్ ఇంజన్‌ను అందించారు. ఇది 25బిహెచ్‌పి పవర్ మరియు 19.2ఎన్ఎమ్ గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. దీనికి 6-స్పీడ్ మ్యాన్యువల్ ట్రాన్స్‌‌మిషన్‌ను అనుసంధానం చేశారు.

ధర వివరాలు

ధర వివరాలు

ఆస్ట్రియన్‌కు చెందిన ఈ సంస్థ తమ కెటిఎమ్ డ్యూక్ 200 బైకు ధర రూ. 1,43,401 లు ఎక్స్ షోరూమ్‌ (ఢిల్లీ)గా అందుబాటులో ఉంచింది.

రాయల్ ఎన్ఫీల్డ్ క్లాసిక్ 350

రాయల్ ఎన్ఫీల్డ్ క్లాసిక్ 350

రాయల్ ఎన్ఫీల్డ్ వారి ఈ ఉత్పత్తి అయినా సరే రోడ్లు మీద వెళుతుంటే దాని వెంబడి వచ్చే శబ్దం ప్రతి ఒక్కరి హృదయాలలో రైడింగ్ ఫీలింగ్‌ను పుట్టిస్తుంది. ఇది అపాచే మరియు కెటిఎమ్ లెక్కన రేసింగ్ మరియు స్పీడింగ్ ఉత్పత్తిగా అనిపించనప్పటికీ ఒక కొత్త ఫీలింగ్‌ను సృష్టిస్తుంది.

సాంకేతిక వివరాలు

సాంకేతిక వివరాలు

రాయల్ ఎన్ఫీల్డ్ ఈ క్లాసిక్ 350 బైకులో 346సీసీ సామర్థ్యం ఉన్న సింగిల్ సిలిండర్ ఇంజన్‌ను అందించారు, ఇది సుమారుగా 20బిహెచ్‌పి పవర్ మరియు 28ఎన్ఎమ్ గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్‌కు 5-స్పీడ్ మ్యాన్యువల్ ట్రాన్స్‌మిషన్‌ను అనుసంధానం చేసారు.

ధర వివరాలు

ధర వివరాలు

రాయల్ ఎన్ఫీల్డ్ క్లాసిక్ 350 ధర రూ. 1.29 లక్షలు ఎక్స్ షోరూమ్ (ఢిల్లీ)గా ఉంది. రాయల్ ఎన్ఫీల్డ్ ఈ క్లాసిక్ 350 బైకును విభిన్న రంగుల్లో అందించారు.

కాలేజ్ స్టూడెంట్స్ కోసం ఐదు బెస్ట్ టూ వీలర్లు

ఇండియన్ మార్కెట్లో రెండు లక్షలలోపున్న ఏడు సూపర్ బైకులు

అత్యంత పొడవైన రన్‌వేలు ఉన్న భారతదేశపు పది అంతర్జాతీయ విమానాశ్రయాలు

Most Read Articles

English summary
Five Best Two-Wheelers For College Students
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X