2016 మోడల్స్ మీద కొత్త ధరలను ప్రకటించిన హార్లి డేవిడ్‌సన్

Written By:

హార్లి డేవిడ్‌సన్ సంస్థ భారతీయ మార్కెట్లో అందుబాటులో ఉంచిన అన్ని మోడళ్ల మీద 2016 సంవత్సరానికి గాను ధరలను పెంచినట్లు అధికారికంగా ప్రకటించింది. అయితే గడిచిన రెండు నెలల కాలం నుండి టూ వీలర్ మరియు ఫోర్ వీలర్ వాహన సంస్థలు వరుస క్రమంలో ధరల పెంపును ప్రకటించారు.

హార్లి డేవిడ్‌సన్ బైకు ప్రేమికులకు ఒక రకంగా ఇది చేదు వార్త అని చెప్పవచ్చు. ప్రస్తుతం హార్లిడేవిడ్‌సన్ మార్కెట్లో అందుబాటులో ఉంచిన మోడళ్లు మరియు వాటి ధర వివరాలు గురించి తెలుసుకుందాం రండి.

హార్లిడేవిడ్‌సన్ మోటార్ సైకిల్స్ వారు ఇలా ధరలు పెంచడానికి కారణం ముడి సరుకు వ్యయం అధికం కావడం వలన మరియు విదేశీయం ధనం మారకంలో మార్పుల అని వివరించారు.

ప్రస్తుతం అమెరికాకు చెందిన ఈ హార్లిడేవి‌డ్‌సన్ సంస్థ భారతీయ మార్కెట్లోకి దాదాపుగా 12 మోడళ్లను అందుబాటులో ఉంచింది. వీటన్నింటి మీద దాదాపుగా 1,500 నుండి 30,000 రుపాయలకు ధరల పెంపును ప్రకటించింది.

2016 నుండి హార్లిడే‌విడ్‌సన్ ధరలు

 • హార్లిడేవి‌డ్‌సన్ స్ట్రీట్ 755 ధర రూ. 4.25 లక్షలు
 • హార్లిడేవి‌డ్‌సన్ ఐరన్ 883 ధర రూ. 7.37 లక్షలు
 • హార్లిడేవి‌డ్‌సన్ ఫోర్టి-ఎయిట్ ధర రూ. 9.12 లక్షలు

2016 నుండి హార్లిడే‌విడ్‌సన్ ధరలు

 • హార్లిడేవి‌డ్‌సన్ స్ట్రీట్ బాబ్ ధర రూ. 10.64 లక్షలు
 • హార్లిడేవి‌డ్‌సన్ ఫ్యాట్ బాబ్ ధర రూ. 13.05 లక్షలు
 • హార్లిడేవి‌డ్‌సన్ ఫ్యాట్ బాయ్ ధర రూ. 15.15 లక్షలు
 • హార్లిడేవి‌డ్‌సన్ బ్రేక్ అవుట్ ధర రూ. 16.40 లక్షలు
 • హార్లిడేవి‌డ్‌సన్ హెరిటేజ్ సాఫ్టైల్ క్లాసిక్ ధర రూ. 16.60 లక్షలు
 • హార్లిడేవి‌డ్‌సన్ నైట్‌రాడ్ ధర రూ. 21.92 లక్షలు

2016 నుండి హార్లిడే‌విడ్‌సన్ ధరలు

 • హార్లిడేవి‌డ్‌సన్ రోడ్ కింగ్ ధర రూ. 25 లక్షలు
 • హార్లిడేవి‌డ్‌సన్ స్ట్రీట్ గ్లైడ్ స్పెషల్ ధర రూ 29.76 లక్షలు
 • హార్లిడేవి‌డ్‌సన్ సిఒవి లిమిటెడ్ ధర రూ. 49.57 లక్షలు

కొత్త మోడల్స్

ఈ మధ్యనే హార్లిడేవిసన్ కొన్ని కొత్త బైకులను మార్కెట్లోకి విడుదల చేసింది.

 1. స్ట్రీట్ 750
 2. ఐరన్ 883
 3. ఫోర్టి-ఎయిట్
 4. స్ట్రీట్ బాబ్
 5. ఫ్యాట్ బాబ్

లగ్జరీ టూ వీలర్లను మార్కెట్లోకి ప్రవేశపెడుతున్న హార్లిన్ డేవిడ్‌సంస్థ 2016 లో జరిగే ఇండియన్ ఆటో ఎక్స్ పోలో మరిన్ని టూ వీలర్లను ప్రవేశ పెట్టనుంది.

హార్లిడేవిడ్‌సన్ వారి క్రూయిజ్ ద్విచక్ర వాహనాలకు చెందిన మరిన్ని ఫోటోలు తరువాత స్లైడర్‌లో...

హార్లిడేవిడ్‌సన్ వారి ద్విచక్ర వాహనాలు.

హార్లిడేవిడ్‌సన్ వారి క్రూయిజ్ ద్విచక్ర వాహనాలు.

హార్లిడేవిడ్‌సన్ వారి క్రూయిజ్ ద్విచక్ర వాహనాలు.

హార్లిడేవిడ్‌సన్ వారి క్రూయిజ్ ద్విచక్ర వాహనాలు.

English summary
Harley-Davidson 2016 Indian Models Pricing Announced
Please Wait while comments are loading...

Latest Photos