భారత దేశపు మొదటి మొబైల్ షోరూమ్ "హ్యార్లీ డేవిడ్‌సన్"

Written By:

దేశీయ మార్కెట్లో చాల వరకు సంస్థలు తమ ఉత్పత్తులను అమ్ముకోవడానికి వివిధ మార్గాలను ఎంచుకుంటున్నాయి. కాని ఎన్నుడూ చూడని విధంగా ఒక సంస్థ తమ టూ వీలర్లను బస్సులో తిప్పుతూ అమ్మకాలు చేపడుతోంది.

అంతర్జాతీయంగా ద్వి చక్రవాహనాలకు ప్రఖ్యాతగాంచిన హ్యార్లీ డేవిడ్‌సన్ ఎత్తిన అవతారం ఇది. మొబైల్ షో రూమ్ అంటే ఇదే మరి. హ్యార్లీ డేవిడ్‌సన్ తమ ద్విచక్ర వాహనాలను కోసం ఒక బస్సును షోరూమ్‌గా వేదిక చేసుకుని విక్రయాలు ప్రారంభించనున్నారు. హ్యార్లీ డేవిడ్‌సన్ మొబైల్ షోరూమ్ గురించి మరిన్ని వివరాలు క్రింది కథనం ద్వారా తెలుసుకుందా రండి.

గత వారంలో గోవాలో ప్రారంభమైన ఇండియన్ బైక్ వీక్ సందర్భంగా హ్యార్లీ డేవిడ్‌సన్ తమ మొబైల్ షోరూమ్‌ను ప్రారంభించారు.

అమెరికాకు చెందిన హ్యార్లీ డేవిడ్‌సన్ ద్విచక్ర వాహనాల సంస్థ మొదటి సారిగా ఇండియన్ టూ వీలర్ల మార్కెట్లో మొబైల్ షోరూమ్‌ను ప్రారంభించింది.

ఈ మొబైల్ షోరూమ్‌కు కావాల్సిన బస్సును డిసి డిజైన్స్‌కు చెందిన దిలీప్ ఛాబ్రియో డిజైన్ చేశాడు.

హ్యార్లీ డేవిడ్‌సన్ ఈ మొబైల్ షోరూమ్ ద్వారా బైకులను మాత్రమే కాకుండా నాణ్యమైన విడి భాగాలను కూడా అందిస్తుందని తెలిపింది.

లెజెండరీ టూర్‌గా అభివర్ణించబడుతున్న హ్యార్లీ డేవిడ్‌సన్ బస్సు యాత్రను ఈ నెల చివరి నుండి దేశ వ్యాప్తంగా తిరగడానికి సిద్దమౌతోంది.

మార్చి నెల మొత్తం ఈ బస్సు ముంబాయ్, పూనే, గోవా, బెంగళూరు మరియు కోయంబత్తూరు వంటి నగరాల మీదుగా తన ప్రయాణాన్ని ముగించనుంది.

ప్రస్తుతం హ్యార్లీ డేవిడ్‌సన్ దాదాపుగా 13 మోడళ్ల వరకు అందుబాటులో ఉంచింది.

ఈ లెజెండరీ టూర్ ద్వారా అమ్మకాల కన్నా ప్రజలలోకి బ్రాండ్‌ను విస్తరించే అవకాశం ఎక్కువగా ఉంటుందని హ్యార్లీ డేవిడ్‌సన్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ విక్రమ్ పవాహ్ తెలిపారు.

ప్రస్తుతం ట్రయంప్ మోటార్ సైకిల్స్‌ నుండి హ్యార్లీ డేవిడ్‌సన్ తీవ్ర పోటిని ఎదుర్కుంటోంది. దీనితో పాటు ఏడాదిలో జరిగిన ఆటో ఎక్స్ పో ద్వారా యుఎమ్ మోటార్ సైకిల్స్ ఇండియన్ మార్కెట్లోకి ప్రవేశించింది. దీని ద్వారా పోటి మరింత పెరిగిందని చెప్పవచ్చు.

హ్యార్లీ డేవిడ్‌సన్ మొబైల్ షోరూమ్ ఫోటోలు

హ్యార్లీ డేవిడ్‌సన్ మొబైల్ షోరూమ్ ఫోటోలు

హ్యార్లీ డేవిడ్‌సన్ మొబైల్ షోరూమ్ ఫోటోలు

హ్యార్లీ డేవిడ్‌సన్ మొబైల్ షోరూమ్ ఫోటోలు

హ్యార్లీ డేవిడ్‌సన్ మొబైల్ షోరూమ్ ఫోటోలు

హ్యార్లీ డేవిడ్‌సన్ మొబైల్ షోరూమ్ ఫోటోలు

హ్యార్లీ డేవిడ్‌సన్ మొబైల్ షోరూమ్ ఫోటోలు

హ్యార్లీ డేవిడ్‌సన్ మొబైల్ షోరూమ్ ఫోటోలు

Click to compare, buy, and renew Car Insurance online

Buy InsuranceBuy Now

English summary
Harley-Davidson 'Legend On Tour' Mobile Dealership Unveiled At IBW 2016
Please Wait while comments are loading...

Latest Photos