విపణిలోకి హీరో లెక్ట్రో సైకిళ్ల విడుదల

దేశీయ విణిలోకి హీరో నాలుగు ఇ-సైకిళ్లను ప్రవేశపెట్టింది. హీరో మొదటి సారిగా ఎలక్ట్రిక్ పెడల్ అసిస్టెడ్ టెక్నాలజీ (EPAC) గల సైకిళ్లను పరిచయం చేసింది.

By Anil

దేశీయ దిగ్గజ సైకిళ్ల తయారీ సంస్థ హీరో సైకిల్స్ విపణిలోకి నాలుగు ఇ-సైకిళ్లను ప్రవేశపెట్టింది. యురోపియన్ మార్కెట్లో లెక్ట్రో బ్రాండ్ పేరుతో అమ్మకాల్లో ఉన్న నాలుగు మోడళ్లను మొదటి సారిగా పరిచయం చేసింది. ఈ నాలుగు సైకిళ్లు కూడా ఎలక్ట్రిక్ పెడల్ అసిస్టెడ్ టెక్నాలజీ (EPAC) ని కలిగి ఉన్నట్లు సంస్థ వెల్లడించింది.

హీరో లెక్ట్రో సైకిళ్లు

ఇపిఎసి పరిజ్ఞానం గల నాలుగు సైకళ్ల ధరలు రూ. 43,000 నుండి 83,000 ల మధ్య ఉన్నట్లు హీరో ప్రకటించింది. రానున్న కాలంలో ఇపిఎసి పరిజ్ఞానం ఉన్న సైకిళ్ల సంఖ్యను 20 కు పెంచాలనే ఆలోచనలో ఉన్నట్లు హీరో తెలిపింది.

హీరో లెక్ట్రో సైకిళ్లు

దేశీయంగా ఇపిఎసి పరిజ్ఞానం ఉన్న సైకిళ్లకు డిమాండ్ పెరుగుతోందని, వీటి మార్కెట్ బలపడుతున్న తరుణంలో మంచి వృద్దిని సాధిస్తుందని హీరో సైకిల్స్ మేనేజింగ్ డైరెక్టర్ పంకజ్ ముంజాల్ విశ్వాసం వ్యక్తం చేశాడు.

హీరో లెక్ట్రో సైకిళ్లు

ఇపిఎసి టెక్నాలజీ గల సైకిళ్లలో డిటాచబుల్ (విడదీసి అమర్చుకునే) బ్యాటరీ అనుసంధానం కలదు. దీనికి ఒక్కసారి చార్జింగ్ చేస్తే 50 కిలోమీటర్ల వరకు నిరంతరాయంగా నడుస్తుంది. మరియు సైక్లింగ్‌లో సులభంగా ఉండేందుకు పెడల్స్‌కు మోటార్ అనుసంధానం కలదు.

హీరో లెక్ట్రో సైకిళ్లు

హీరో సైకిల్స్ తొలివిడతగా ఈ నాలుగు సైకిళ్లను బెంగళూరు, ముంబాయ్, పూనే మరియు ఢిల్లీ అదే విధంగా కేంద్ర రాజధాని పరిధిలో విడుదల చేసింది. తమిళనాడు, కర్ణాటక మరియు మహరాష్ట్రలోని ప్రధాన నగరాలలో కూడా ఈ ఏడాది చివరి నాటికి తమ సైకిళ్లను విడుదల చేయనున్నట్లు తెలిపారు.

హీరో లెక్ట్రో సైకిళ్లు

  • సరికొత్త సుజుకి వ్యాగన్ ఆర్ స్టింగ్ రే - ఇండియా విడుదల కోసమా...?
  • సుజుకి: హెచ్.డి.ఎఫ్.సి మరియు పేటిఎమ్ అకౌంట్లు ఉన్నాయా...?

Most Read Articles

Read more on: #సైకిల్ #cycle
English summary
Hero Cycles Launches Lectro EPAC Bicycles
Story first published: Saturday, November 26, 2016, 10:30 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X